
ఐటీ జాబ్స్: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌లో వేలాది నియామకాలు, మహిళలకు ప్రాధాన్యత
న్యూఢిల్లీ: భారతదేశంలో దిగ్గజ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ) కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, తదితర సంస్థలు పలు నియామకాలను చేపడుతున్నాయి. ఈ నియామకాల్లో ఎక్కువ మంది మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి.

ఐటీలో కొత్తగా వేలాది ఉద్యోగాలు.. 60వేల మంది మహిళలకు ఛాన్స్
ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఐటీ దిగ్గజాలు మొత్తం 60 వేల మంది మహిళా టెక్ ప్రొఫెషనల్స్‌ను నియమించుకోనున్నట్లు వెల్లడించాయి. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలను చేపడుతున్నట్లు ఐటీ సంస్థలు ప్రకటించాయి. ఐటీ కంపెనీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. 2019లో ఫీమెల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్(ఎఫ్ఎల్ఎఫ్పీఆర్) 20.8 శాతానికి పడిపోయింది. 1990లోనే ఎఫ్ఎల్ఎఫ్పీఆర్ 30.27 శాతం ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే టెక్ కంపెనీలు మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ నియామకాలను చేపడుతున్నాయి. దీంతో సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది.

హెచ్‌సీఎల్ ఉద్యోగ నియామకాలు.. 60 శాతం మహిళలకే
క్యాంపస్‌ల
నుంచి
కొత్త
ఉద్యోగులను
నియమించుకునేందుకు
సిద్ధంగా
ఉన్నామని,
వారిలో
60
శాతం
మహిళలకు
ప్రాధాన్యత
ఇస్తున్నట్లు
హెచ్‌సీఎల్
కంపెనీ
వెల్లడించింది.
ఈ
ఆర్థిక
సంవత్సరంలో
మొత్తం
22,000
ఉద్యోగాలను
భర్తీ
చేసేందుకు
నిర్ణయించుకున్నట్లు
పేర్కొంది.

టీసీఎస్‌లో 15వేలకుపైగా ఉద్యోగాలు.. 50 శాతం మహిళలకే
మరో
ఐటీ
దిగ్గజం
టీసీఎస్
కూడా
15,000-18,000
మంది
మహిళా
ఉద్యోగులను
నియమించుకోవాలని
నిర్ణయించింది.
ఇప్పటికే
ఈ
టెక్
సంస్థలో
1.85
లక్షల
మంది
మహిళా
ఉద్యోగులు
ఉన్నారు.
తాజా
క్యాంపస్
రిక్రూట్మెంట్
లో
50
శాతం
మహిళలు
ఉండేలా
ప్రాధాన్యత
ఇస్తున్నట్లు
తెలిపింది
టీసీఎస్.

టీసీఎస్ నియామకాలు.. ఎంబీఏ ఫ్రెషర్లకు ప్రాధాన్యత
ఇంతలో,
టీసీఎస్
తన
మేనేజ్మెంట్
హైరింగ్
చొరవలో
భాగంగా
ఎంబీఏ
గ్రాడ్యుయేట్లను
నియమించాలని
యోచిస్తోంది.
బ్యాచ్
2020,
2021,
2022
పాసింగ్
అవుట్
బ్యాచ్‌కి
చెందిన
ఫ్రెష్
ఎంబీఏ
గ్రాడ్యుయేట్లు
దరఖాస్తు
చేసుకోవచ్చు.
నాస్కామ్
సీనియర్
వైస్
ప్రెసిడెంట్
సంగీతా
గుప్తా
గతంలో
మాట్లాడుతూ..
డిజిటల్
టాలెంట్‌కు
డిమాండ్
పెరుగుతున్నందున
వర్క్‌ఫోర్స్‌లో
మహిళల
భాగస్వామ్యాన్ని
మెరుగుపరచడంపై
ఐటీ
పరిశ్రమ
చూస్తోందన్నారు.
ఐటీ
సంస్థలు
హైబ్రిడ్
వర్క్
మోడల్స్,
స్కిల్లింగ్
జోక్యాలను
కూడా
అన్వేషిస్తున్నాయని
ఆమె
తెలిపారు.