• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐటీ జాబ్స్: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌లో వేలాది నియామకాలు, మహిళలకు ప్రాధాన్యత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో దిగ్గజ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ) కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, తదితర సంస్థలు పలు నియామకాలను చేపడుతున్నాయి. ఈ నియామకాల్లో ఎక్కువ మంది మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి.

ఐటీలో కొత్తగా వేలాది ఉద్యోగాలు.. 60వేల మంది మహిళలకు ఛాన్స్

ఐటీలో కొత్తగా వేలాది ఉద్యోగాలు.. 60వేల మంది మహిళలకు ఛాన్స్

ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఐటీ దిగ్గజాలు మొత్తం 60 వేల మంది మహిళా టెక్ ప్రొఫెషనల్స్‌ను నియమించుకోనున్నట్లు వెల్లడించాయి. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలను చేపడుతున్నట్లు ఐటీ సంస్థలు ప్రకటించాయి. ఐటీ కంపెనీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. 2019లో ఫీమెల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్(ఎఫ్ఎల్ఎఫ్‌పీఆర్) 20.8 శాతానికి పడిపోయింది. 1990లోనే ఎఫ్ఎల్ఎఫ్‌పీఆర్ 30.27 శాతం ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే టెక్ కంపెనీలు మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ నియామకాలను చేపడుతున్నాయి. దీంతో సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది.

హెచ్‌సీఎల్ ఉద్యోగ నియామకాలు.. 60 శాతం మహిళలకే

హెచ్‌సీఎల్ ఉద్యోగ నియామకాలు.. 60 శాతం మహిళలకే


క్యాంపస్‌ల నుంచి కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, వారిలో 60 శాతం మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు హెచ్‌సీఎల్ కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 22,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

టీసీఎస్‌లో 15వేలకుపైగా ఉద్యోగాలు.. 50 శాతం మహిళలకే

టీసీఎస్‌లో 15వేలకుపైగా ఉద్యోగాలు.. 50 శాతం మహిళలకే


మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా 15,000-18,000 మంది మహిళా ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ టెక్ సంస్థలో 1.85 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. తాజా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ లో 50 శాతం మహిళలు ఉండేలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది టీసీఎస్.

టీసీఎస్ నియామకాలు.. ఎంబీఏ ఫ్రెషర్లకు ప్రాధాన్యత

టీసీఎస్ నియామకాలు.. ఎంబీఏ ఫ్రెషర్లకు ప్రాధాన్యత

ఇంతలో, టీసీఎస్ తన మేనేజ్‌మెంట్ హైరింగ్ చొరవలో భాగంగా ఎంబీఏ గ్రాడ్యుయేట్‌లను నియమించాలని యోచిస్తోంది. బ్యాచ్ 2020, 2021, 2022 పాసింగ్ అవుట్ బ్యాచ్‌కి చెందిన ఫ్రెష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా గతంలో మాట్లాడుతూ.. డిజిటల్ టాలెంట్‌కు డిమాండ్ పెరుగుతున్నందున వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడంపై ఐటీ పరిశ్రమ చూస్తోందన్నారు. ఐటీ సంస్థలు హైబ్రిడ్ వర్క్ మోడల్స్, స్కిల్లింగ్ జోక్యాలను కూడా అన్వేషిస్తున్నాయని ఆమె తెలిపారు.

English summary
TCS, Infosys, Wipro, HCL to hire more woman freshers via campus hiring.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X