హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిపికేషన్.. : 1433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా.. తాజాగా పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో మరో 1433 ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

1433 ఉద్యోగాల్లో 657 ఏఈఈ, 11 ఏఈ, హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ, తదితర పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు 35,220 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం గమనార్హం.

telangana state government approval to replace another 1433 jobs

కాగా, రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో గ్రూప్-1 పోస్టులతోపాటు పోలీసు, రవాణా, అటవీ, ఎక్సైజ్, హెల్త్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటకే నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్1, పోలీసు నియామకాల దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది.

తాజాగా ఉత్తర్వులిచ్చిన 1433 ఖాళీలను కలుపుకుని.. ఇప్పటి వరకు 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. మరోవైపు, వైద్యారోగ్య శాఖలోని 12,775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. తొలి విడతగా 1326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ఆదివారం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

English summary
telangana state government approval to replace another 1433 jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X