వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్: 861 పోస్టులు, ఆప్లై చేయండిలా..అర్హత ఇదే

|
Google Oneindia TeluguNews

వివిధ సివిల్ సర్వీసు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 861 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పాస్ అయి.. చివరీ ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

01.08.2022 వరకు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్లు మించకుండా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. 02.08.1990 నుంచి 01.08.2001 మధ్య జన్మించిన వారు అర్హులు.. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా సరే ప్రయత్నించవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు ట్రై చేయవచ్చు. రాతపరీక్ష.. ప్రిలిమ్స్, మెయిన్స్.. ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

upsc issue notification for 861 posts

ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 200 మార్కులు ఉంటాయి. అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు ఇచ్చారు. ప్రిలిమ్స్‌లో పేపర్-2 జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. ఇందులో 33 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ 2025 మార్కులకు నిర్వహిస్తారు.

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 02.02.2022 తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆప్లై చేసుకోవడానికి చివరి తేదీ 22.02.2022 సమయం ఇచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష 05.06.2022న నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ, పీడబ్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

English summary
upsc issue notification for 861 post. graduation is qualification and degree last year candidates also eligible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X