
ఏపీ ఆర్బీకేలో త్వరలోనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ వివరాలను వెల్లడించారు. ఈ శాఖలో మొత్తం 6758 అగ్రికల్చర్ అసిస్టెంట్, 4000 హార్టికల్చర్ అసిస్టెంట్, 400 స్కిల్ బోర్డు(పట్టు పరిశ్రమ) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి.
అయితే, ఈ పోస్టుల్లో ఇప్పటి వరకు 6321 అగ్రికల్చర్ అసిస్టెంట్, 2356 హార్టికల్చర్ అసిస్టెంట్, 378 సిల్క్ అసిస్టెంట్ పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.ఈ క్రమంలోనే మిగిలిపోయిన పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు.

5521 కాల్ సెంటర్ నెంబర్ ద్వారా రైతు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తన్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతి నెలా 1.51 లక్షల రైతు భరోసా మాస పత్రికలను ముద్రిస్తూ రైతులకు సాంకేతిక సలహాలు, సమాచారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, జిల్లా కోర్టుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 3672 పోస్టుల భర్తీకి వెంటనే అప్లై చేయండి.
పోస్టులకు సంబంధించిన వివరాలు:
పోస్టుల వివరాలు, పోస్ట్ సంఖ్య
ఏపీ హై కోర్ట్ లో సెక్షన్ ఆఫీసర్ / కోర్ట్ ఆఫీసర్ / సెక్యూరిటీ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ 09
ఏపీ హై కోర్ట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ 13
ఏపీ హై కోర్ట్ లో కంప్యూటర్ ఆపరేటర్ 11
ఏపీ
హై
కోర్ట్
లో
ఓవర్సీర్
01
ఏపీ
హై
కోర్ట్
లో
అసిస్టెంట్స్
అండ్
ఎగ్జామినర్స్
27
ఏపీ
హై
కోర్ట్
లో
16
టైపిస్టు,
20
కాపీయిస్ట్
ఏపీ
హైకోర్టులో
అసిస్టెంట్
ఓవర్సీర్
01
ఏపీ
హై
కోర్ట్
లో
డ్రైవర్స్
08
ఏపీ
హై
కోర్ట్
లో
ఆఫీస్
సబార్డినేట్
135
జిల్లా
కోర్ట్
లో
స్టెనోగ్రాఫర్
గ్రేడ్
3
114
జిల్లా
కోర్ట్
లో
జూనియర్
అసిస్టెంట్
681
జిల్లా
కోర్ట్
లో
టైపిస్ట్
170
జిల్లా
కోర్ట్
లో
ఫీల్డ్
అసిస్టెంట్
158
జిల్లా
కోర్ట్
లో
ఎగ్జామినర్
112
జిల్లా
కోర్ట్
లో
కాపీయిస్ట్
209
జిల్లా
కోర్ట్
లో
రికార్డ్
అసిస్టెంట్
09
జిల్లా
కోర్ట్
లో
డ్రైవర్
లైట్
వెహికల్
20
జిల్లా
కోర్ట్
లో
ప్రాసెసర్
సర్వర్
439
జిల్లా
కోర్ట్
లో
ఆఫీస్
సబార్డినేట్
1520
మొత్తం
పోస్టులు
3672
వయో
పరిమితి:
01/07/2022
నాటికి
18-42
సంవత్సరాలు
వయో సడలింపు: SC/ ST/OBC/ అభ్యర్థులకు ప్రభుత్వ నియమం ప్రకారం సడలింపు
జీతం:
రూ.19,900/- నుంచి రూ.1,16,600/- మధ్యలో, నెల/ జీతం వస్తుంది.
దరఖాస్తు రుసుము:
మిగతా అభ్యర్థులందరూ:800/-
SC/ST, మహిళా అభ్యర్థులకు :400/-
విద్యా అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న సరిపోతుంది.
ఎంపిక విధానం:
రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా
ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా
వ్రాత పరీక్ష
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22.10.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.