• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీ విళంబినామ ఉగాది సంవత్సరం రాశిఫలాలు

By Pratap
|

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.

మేషరాశి

మేషరాశి

విద్యార్ధులకు పోటి పరీక్షలలో విజయం సాధిస్తారు.వృత్తి,ఉద్యోగ పరంగా మీ స్థాయిని నిలబెట్టుకుంటారు.మీ ప్రవర్తన బయటవారికి నచ్చుతుంది కాని ఇంటి వాళ్లకు మింగుడు పడదు.రావలసిన ధనం చేతికి అందుతుంది.రియల్ ఏస్టేట్,వస్త్ర వ్యాపారాలకు,విదేశీ వ్యవహారాలకు అనుకూలం.కళా సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది.గృహ స్థల,వాహనాల మార్పు సూచనలున్నాయి.

గృహ నిర్మాణ రంగాల వారికి అనుకూలం.గతంలోని జ్ఞాపకాలు తీపి గుర్తులు గుర్తుకు వచ్చి మనస్సును ఇబ్బంది పెడుతాయి.జీవిత భాగస్వామి,కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎక్కువగా మేలు చేస్తాయి.వివాహ సంబంధాలు కుదుట పడతాయి.తల్లివైపు బంధువులు కష్టకాలంలో అండగా నిలిచి సమస్యనుండి గట్టేక్కిస్తారు.ఆరోగ్య విషయంలో కీళ్ళ నొప్పులు,గైనకాలజి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. ప్రతి రోజు రావిచెట్టునకు 11 ప్రదక్షిణలు చేయండి.

వృషభరాశి

వృషభరాశి

ఆత్మ విశ్వాసంతో ప్రారంభించిన పనులలో విజయం లభిస్తుంది.ఆహార నియమాలు పాటించండి.ఇంటి వంటకాలనే తినండి,హోటల్,ఫాస్ట్ ఫుడ్,మైదా పిండికి సంబంధించి పదార్ధాలకు దూరంగా ఉండండి.ఆరోగ్యానికి సంబంధించి ENT ,కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి,తగు జాగ్రత్తలు పాటించండి. మీకున్న కుటుంబ,వ్యావహారానికి సంబంధించిన సమస్యలు ఎవరికి చెప్పుకోలేక ,మీకు అర్ధం కాక కొంత మానసిక ఇబ్బందులకు గురి అవుతారు.శత్రువుల కంట పడకుండా జాగ్రత్త పడండి.ఆర్ధిక పరంగా అనుకూలం.వివాహా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.ఈ సంవత్సరం గృహ యోగం కల నెరవేరుతుంది. వాదోపవాదాలకు, కోపతాపాలకు, వివాదస్పద విషయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.పిల్లల విషయంలో వారి ప్రవర్తనకు సంబంధించిన విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.కోర్ట్ వ్యావహారలలో మీకు సానుకూలంగా తీర్పులు వస్తాయి.జీవిత భాగస్వామికి సంబంధిన వ్యసనాలను అదుపు చేయలేక విసుగులు,గొడవలు ఏర్పడతాయి.వృత్తి,ఉద్యోగ పరంగా స్థాయి పెరుగుతుంది.తొందరపాటుతో ఆకర్షణలకు లోనై అపహాస్యం పాలు కాకుడదు.తలిదండ్రులను పెద్దలను ఎదురించ కూడదు దాని వలన మీకే నష్టం వాటిల్లుతుంది.మీరు అష్టమ శని ప్రభావంలో ఉన్నారని మరచి పోకూడదు. పేదలకు అన్న,వస్త్ర,వస్తు దానాలు చేయండి శుభం కలుగుతుంది.

 మిథునరాశి

మిథునరాశి

మీకు సప్తమ శని సంచారం నడుస్తున్నది.దూర,విదేశీ సంబంధిత ప్రయాణాలుంటాయి. విద్యాసంబందమైన విషయంలో అధిక ఖర్ఛులుంటాయి.పోటి పరీక్షలలో విజయం సాధిస్తారు.చెవి,ముక్కు,గొంతుకు సంబంధిత అనారోగ్యం,మధ్య మధ్య వైరల్ పీవర్లు కొంత కాలం ఇబ్బంది పెడుతాయి.మీ సమస్యలకు కుటుంబ సభ్యుల సహకారం వలన విజయం చేకూరుతుంది.కొన్ని సంధర్భాలలో వ్యవహారంలో ఆశించిన లాభలు లేకపోయినను నష్టం మాత్రం ఉండదు.రాజకీయ పరమైన పురోగతి అనుకూలంగా ఉంది.మీ ప్రతిభకు తగ్గ ఫలితం దొరుకుతుంది,మీరు సెలబ్రెటి స్థాయిలో నిలుస్తారు.వివాహా సంబంధాలు కుదుట పడుతాయి.ఎన్నో ఏళ్ళుగా ఏదిరి చూస్తున్న మీ ఆశయం నెరవేరుతుంది.ముఖ్యమైన వస్తువులను,పత్రాలను జాగ్రత్తగా చూసుకోండి.మిమ్మల్ని పొగిడిన వాల్లంత మీ ఆత్మీయులు కాదని గ్రహించాలి.సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.కేంద్ర ,రాష్ట్ర ఉద్యోగవకాశాలున్నాయి.ప్రతి నిత్యం రెండు పూటల దీపారాధన చేయండి.నిరంతరం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని స్మరింఛండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి

కర్కాటకరాశి

వృత్తి ఉద్యోగాల పరంగా స్థాయి పెరుగుతుంది.స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి. ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి.మీ ప్రతిభకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇపుడు ఎంతో ఉపయోగ పడతాయి.గతంలోని సంఘటనలను దృష్తిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు వివాదాలకు దురంగా ఉండాలని దృడ నిర్ణయం చేసుకుంటారు.శారీరక రుగ్మతల కంటే మానసిక బాధలు ప్రమాదకరమని గ్రహిస్తారు.TV మరియు సినిమా రంగంవారికి మంచి అవకాశాలున్నాయి.నిరుద్యోగులకు పార్ట్ టైం ఉద్యోగ అవకాశం వస్తుంది.శత్రువులతో జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా ప్రయోజనాలు కలుగుతాయి.కొంత జాగ్రత్త వహించాల్సి వస్తుంది.ఆత్మీయులను కోల్పోవడం వలన మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. సినిమా రంగం వారికి కళాకారులకు మంచి అవకాశాలున్నాయి.ఉద్యోగాలు లభిస్తాయి. విద్యా సంస్థలు నడిపే వారికి గుడ్ విల్ లభిస్తుంది. దైవానికి దగ్గర ఉంటే శుభం కలుగుతుంది. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయండి. ఆవులకు నానబెట్టిన గోధుమలు బెల్లము కలిపి తినిపించండి.

సింహరాశి

సింహరాశి

అనుకున్న పనులు కృషి పట్టుదలతో పూర్తి చేస్తారు.విద్యార్ధులకు అనుకూలంగా ఉంది.వ్యాపార విస్తరణ ఆలోచనలు కలిసి వస్తాయి.ప్రతీ పనిలో తొందర పడక సంయవనం పాటిస్తే శుభం కలుగుతుంది.స్నేహితులలోని మార్పు ఇబ్బంది కలిగిస్తుంది.వివాహానికి అనుకూల సమయం.రెండు నాలుకల దోరని కలిగి ఉన్నవ్యక్తులతో దూరంగా ఉండండి.పశువుల పెంపంకం,డైయిరీ వ్యాపారం,ఔషద సంబంధమైన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఎంత ధనం సంపాదించిన ధనాన్ని పొదుపు చేయలేక పోతారు.అందరిని ఒకతాటిపై నడిపించాలని కృషి చేస్తారు.తోందరపడి ఉద్యోగ మార్పులు చేయకూడదు.అతి ఆశ పడితే ఇబ్బంది పడుతారు.సినిమా రంగం వారికి కొత్త అవకాశాలుంటాయి. సంవత్సర ద్వితీయార్ధంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది.వాహనాల మార్పు జరుగుతుంది.మీ చలాకీ తనంతో పనులను చక్కబెట్టు కుంటారు.చిట్టి వ్యాపారాలు దివాలా తీస్తాయి. కష్టపడి మీ వ్యాపారాలు ఓ కొలిక్కి తెచ్చుకుంటారు.టీం వర్క్ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలిలు ,ప్రమోషన్లు ఉంటాయి. మరిన్ని విజయాలకు ప్రతిరోజూ ఆదిత్య హృదయం చదువుకోండి.సూర్యునికి రాగి చెంబులో పంచదార,కుంకుమ,పసుపువేసి నీళ్లతో అర్ఘ్యం వదలండి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.

కన్య రాశి

కన్య రాశి

మీరు అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నారు. మీ ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమాలలో పొరపాట్లు, లోటుపాట్లు ఏర్పడతాయి. విదేశీ వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. నరదృష్టి ఎక్కువగా ఉంది. అనారోగ్యాలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. మీరు అభిమానించే వ్యక్తులు మీ పై పెత్తనం చెలాయిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి.ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రజా సంబంధాలు పెంచుకొవాలని శతవిధాల ప్రయత్నిస్తారు. తగాదాలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.స్త్రీలతో విభేదాలు వల్ల మనశ్శాంతి కరవవుతుంది. మీకు సంబంధంలేని విషయాలలో తలదూర్చడం తగదు. మీ పిల్లల చదువుల కొరకు ఖర్చులు అధికంగా చేస్తారు. కమీషన్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మూర్ఖత్వం కలిగిన మనష్యులలో వారి మనసును మార్చాలని చూడకండి. అర్థంలేని ఇతరుల ఏడుపును పట్టించుకోకండి. విద్యారంగం వారికి అనుకూలంగా ఉంది. మీ మనసుకు నచ్చిన (ప్రేమ) వివాహం చేసుకుంటారు. పిల్లల క్రమశిక్షణ లో జాగ్రత్తలు పాటించాలి. ఏరంగంలోనైనా మీకు రావలసిన లబ్ది రాదు. కష్టపడి జీవితాన్ని నిర్మించుకుంటారు. ఆత్మీయులోకరు తిరిగిరాని లోకానికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది, దాని కారణంగా మీరు మానసిక వేదనకు గురి అవుతారు. ముఖ్యంగా పురుషులు స్త్రీలకు సంబంధించిన విషయాలలో దూరంగా ఉండాలి. పేదవారికి ఆర్థిక సహాయం కానీ, వస్తు రూపంగా కానీ సహాయం అందించండి తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.

తుల రాశి

తుల రాశి

ఈ సంవత్సరం మీకు రాజయోగం అని చెప్పాలి. చాలా అనుకూలంగా శుభ ఫలితాలు ఇస్తున్నాయి. వివాహ అనుకూలం ఉంది. ఉద్యోగం లభిస్తుంది.అన్నింటా లాభసాటిగా ఉంటుంది. మీపై శత్రువులు ఎక్కువ కన్నేసి ఉంచారు, కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. విదేశీ సంబంధమైన వీసాలు లభిస్తాయి. రాజకీయ నాయకుల ద్వారా ఉద్యోగ, అధికారికంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. మీ స్వేచ్ఛకు ఇబ్బందులు కలగడం వల్ల మానసికంగా కొంత కుంగి పోవలసి వస్తుంది. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల లో చికాకులు కలుగుతాయి సెప్టెంబర్ నుండి కోర్టుకు సంబంధించిన కేసుల్లో ఇబ్బందులు ఉండే అవకాశముంది. ఆటుపోట్లకు తట్టుకుని ఆర్థికంగా నష్టపోకుండా నిలబడతారు. ఉద్యోగంలో స్థానం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఏర్పడుతాయి జాగ్రత్తలు అవసరం. మీ ప్రవర్తనలో కొంత మార్పు అవసరమని గ్రహించండి. అందరితో సౌమ్యంగా ప్రవర్తించాలి. సాంకేతిక విద్యా పరంగా అభివృద్ధి ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది.స్థానచలనము ఉంటుంది.జ్యేష్ట సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.శత్రువుల పీడ అధికంగా ఉంది. రాహుకాల సమయంలో అమ్మవారికి ఎర్రని 3 వత్తులతో నిమ్మకాయ దీపం పెట్టండి. పేదవారికి వస్త్ర, అన్న దానాలు చేస్తూ ఉండండి తప్పకుండా కలిసి వస్తుంది.

వృశ్చికరాశి

వృశ్చికరాశి

మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారని గ్రహించండి. ప్రారంభంలో బాగుంటే ఆగస్టు తర్వాత ఇబ్బందులు ఉంటాయి. ప్రారంభంలో ఇబ్బందులు ఉంటే మద్య భాగం నుండి అనుకూలంగా ఉంటుంది.ప్రత్యేక్షంగా పరోక్షంగా మీ పైన మంచి ప్రభావం చూపిస్తాయి. ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి. విదేశీయానానికి సంబందించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. మాట పట్టింపు, మొండి వైఖరివల్ల కొన్నిటికి దూరంగా ఉండవలసి వస్తుంది. లేనిపోని చెడు ఆలోచన వల్ల మానసిక బాధలకు గురి కాకూడదు. మీరు ఎదైన పనిని ప్రారంభించే ముందు నిపుణులను సంప్రదించి వారి అభిప్రాయాలను సలహాలను స్వీకరించండి. ఫైనాన్స్, లాటరీలు, స్కీమ్ లకు, లక్కీడ్రాలకు దూరంగా ఉండాలి.కుటుంబ సంఘటనలు కొన్ని మీకు వైరాగ్యాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరమైన ఇబ్బందులు వెన్నంటే ఉంటాయి. అవగాహన లోపం వల్ల కొన్ని జంటలలో ఆవేశాలకు పోయి విడాకులకు దారితీసుకుంటారు. ప్రేమ పట్ల ప్రేమ వివాహాల పట్ల విరక్తి చెందుతారు. రాజకీయ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రతి దానిలో మితిమీరిన ఆత్మవిశ్వాసమూ, అహంభావం దరికి రానివ్వకండి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనుకూలం కాదు.ఆత్మీయులతో విభేదాలు, విరోధాలు ఏర్పడే అవకాశాలున్నాయి అట్టి విషయంలో జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహం వలన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరికి అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాయి. మరిన్ని శుభఫలితాలు కొరకు శని త్రయోదశి రోజు శనిభగవానునికి నల్లనువ్వులు,నల్లని వస్త్రం, నువ్వులనూనెతో అభిషేకం చేయండి. వికలాంగులకు మీ చేతనైన సహాయం చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనస్సురాశి

ధనస్సురాశి

ఈ సంవత్సరం మీకు జన్మశని ప్రభావం ఉంది. దీని కారణంగా ఆర్థిక పరమైన ఋణాలు చేస్తారు.ఆరోగ్య పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఉదర సంబంధిత జబ్బులు ఇబ్బంది పెట్టే అవకాశముంది. కుటుంబ పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది.పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు గృహ నిర్మాణ సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.అయినవాళ్ళతో,ఆత్మీయిలతో విభేదాలు ఏర్పడే అవకాశముంది, జాగ్రత్తలు పాటించండి. కుటుంబములో అనైక్యత చోటు చేసుకుంటుంది.సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని గ్రహించండి. ప్రతీ విషయంలో మౌనం, మాటలో పొదుపు అవసరం. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది.దాంపత్య జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరిన్ని శుభఫలితాలకొరకు పేదలకు అనాథలకు అన్న, వస్త్ర దానాలు తరచుగా చేస్తూ ప్రతి రోజు రావి చెట్టును 11 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా చదువుకోవాలి.

మకరరాశి

మకరరాశి

ప్రస్తుత కాలంలో మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మీ ప్రతి పని అంచనాలకు మించి ఉంటుంది. వివాహం విషయంలో విసుగు తెప్పిస్తుంది, మధ్యవర్తుల ప్రమేయం లేనిది వివాహాలు కాని పరిస్థితి ఏర్పడుతుంది.మొండి పట్టుదలను వదిలివేయాలి,సర్దుకు పోయే అలవాటు చేసుకోవాలి. ఆర్థికపరంగా మధ్యస్తంగా ఉంటుంది. కుటుంబంలో తలిదండ్రుల ఆరోగ్య విషయంలో ఆందోళనలు చోటుచేసుకోనున్నాయి. మీ జీవితంలో మొదటిసారి ఏల్నాటి శని నడుస్తున్నవారికి ఆరోగ్యసమస్యలు ఉంటాయి. రెండవసారి శని ప్రభావం ఉన్న వారికి ఉద్యోగాల సమస్యలు, తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలుంటాయి. మూడవసారి నడుస్తున్న వారికి వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పును కోరుకోవద్దు. ఉన్నచోటనే వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి. నూతనంగా వ్యాపారాలను ప్రారంభించ వద్దు. వాహనాలతో, ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో, ఉద్యోగంలో క్రమశిక్షణ లోపం వల్ల ఇబ్బందులు పడతారు. పాత రుణాలు తీరుస్తారు. కొత్త రుణాలు చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదు. యోగా మెడిటేషన్ వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. గృహ యోగం సూచనలున్నాయి. మీపై నిందారోపనలు వస్తాయి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కుంటారు. మరిన్ని శుభ ఫలితాలు కొరకు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి సమయం దొరికినప్పుడు శ్రీరామ జయరామ జయజయరామ అనే మంత్రాన్ని స్మరించాలి పశు పక్షాదులకు దానా వేయండి, పేదలకు అన్న దానాలు చేయండి.

 కుంభరాశి

కుంభరాశి

ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. భాగ్య స్థానంలో శని సంచారం వలన అన్ని అనుకూలంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గొప్ప ఉద్యోగం లభిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.అన్నింటా అభివృద్ధి కనిపిస్తుంది. విదేశీ అవకాశాలు, ఉద్యోగాలు లభిస్తాయి, రాజకీయ జీవితం చాలా బాగుంటుంది, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఏర్పడుతాయి, శత్రువులపై విజయం సాధిస్తారు, నూతన వ్యాపారాలు టెండర్లు, లీజులు, కోర్టు వ్యవహారాలు కలిసివస్తాయి. రుణాలు తీరుస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంక్ రుణాలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి. పెళ్ళికి మంచి సంబంధం వస్తుంది. ఇంటా బయట మీ మాటకు ఎదురు లేని పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి కఠినమైన ధోరణి వల్ల కొంత మానసిక ఇబ్బందులు కలుగుతాయి.ప్రేమ పట్ల మీకున్న మంచి అభిప్రాయం తుడుచుకు పోతుంది.నర దిష్టి ఎక్కువగా ఉంది. తగిన జాగ్రత్తలు పాటించండి. శక్తి కలిగిన వారు నవరత్న ఉంగరం ధరించండి .చెట్లకు, పక్షులకు, పశువులకు సేవలు చేయండి శుభం కలుగుతుంది.

 మీనరాశి

మీనరాశి

గురువు నీచ స్థానంలో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి.విదేశాలలో ఉద్యోగ అనుకూలతలున్నాయి.కాని మానసిక సంత్రూప్తి కరువౌతుంది. మీ పై వచ్చిన నిందలు నిజముకాదని నిరూపించుకుంటారు. అవివాహితులకు వివాహయోగం. క్రీడా రంగము వారికి అనుకూలమైన కాలం. స్నేహితులు పక్కదారిపట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీ ప్రతిభతో దైవానుగ్రహంతో అభివృద్ధి వైపు పయనిస్తారు.గృహ యోగం కలిసి వస్తుంది.ఉద్యోగంలో మార్పు సంభవం.చిట్టిలు,ఫైనాన్స్,వ్యాపారాలలో నష్టం కనిపిస్తుంది.గైనిక్ ప్రాబ్లంస్ కొంత కాలం ఇబ్బంది పెడుతాయి.ఎట్టకేలకు సంతాన యోగం ఉంది.ఆధ్యాత్మిక ,సామాజిక కార్యక్రమాలకు విరివిగా చందాలు ఇస్తారు.స్నేహితుల వలన పెడదారి పట్టే అవకాశం ఉంది, అలాంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థికంగా శక్తి కలిగినవారు నవరత్న ఉంగరం ధరించండి గోవులకు దానా వేయండి పావురాలకు జొన్నలు నీళ్లు అందించండి శుభ ఫలితాలు కలుగుతాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
2018-2019 Telugu Vilambi Nama Samvatsara Rasi Phalalu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more