వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవ శరీరంలో 14 లోకాలు.. వాటి ప్రాధాన్యత?

|
Google Oneindia TeluguNews

14 లోకాలు వివిధ పరిధుల్లో ఈ సృష్టిలో ఉన్నాయి. విశ్వంలో ఈ 14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం ఉంది అలాగే ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది.

మన శరీరంలో మూలాధారం నుంచి పైకి క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక,
అనహత,
విశుద్ధి,
ఆజ్ఞ చక్రాలనే 6చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి 7. అలగే మూలాధారానికి దిగువన కూడా 7చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14 వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసుకోవచ్చు.

14 lokas and and their functions in the human body

1. మూలాధారం - వెన్నుపూస అంత్యభాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం. మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.

2. స్వాధిష్టానం -
బొడ్డు క్రింద, జనేనెంద్రియాల వద్ద ఉంటుంది. వివేకము దీని లక్షణం.

3. మణిపూరం - నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం.

4. అనాహతం - హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం.

5. విశుద్ధం -
కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.

6. ఆజ్ఞ -
కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.

7. సహస్రారం - తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.

-: నరకాలు పాతాళ లోకాల గురించి పరిశీలిద్ధాం :-

1. అతలం -
అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామము దీని లక్షణాలు.

2. వితలం - నిరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.

3. సుతలం -
బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.

4. తలాతలం - అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండితనానికి ఇది స్థానం.

5. రసాతలం - కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణాలు.

6. మహాతలం - అవివేకము దీని లక్షణము. పాదాల్లో ఉంటుంది.

అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం. నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.

7. పాతాళం -
కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.

కాబట్టి దీన్ని అర్దం చేసుకుని మనలో ఆ క్రింద చక్రాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, అవన్నీ వదులుకుంటే, కాస్తంతైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం),
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
According to Hindu mythology there are 14 worlds in the universe existing at different dimensions. As, a human is the microcosm of the macrocosm universe, what exists outside is also exists inside; that’s why the organs of the body also represent the 14 worlds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X