వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19-2-2019 మంగళవారం: మహా మాఘి (మాఘ పౌర్ణమి) స్నానాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151.

సంవత్సరానికి నెలలు 12 . నెలకి ఒక పూర్ణిమ. ఇది సర్వ సాధారణం . ఆకాశం లో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు , పూర్ణిమలు మనకి లెక్కల్లోకి వస్తాయి. శాస్త్రీయం గా చందృడు .. భూమి .. సూర్యుడు గమనాల బట్టి పగలు , రాత్రులు , నెలలు , సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే . దీనినే కేలండర్ అంటాము .

తిథుల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకి సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి . పూర్ణిమ నాడు తెల్లవారు ఝామున వెళ్లి సముద్రస్నానము చేయడం మంచిది .

పూర్ణిమలలో కెల్ల మాఘమాసంలో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ , వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ లు ఎంతో ఉత్కృస్ట మైనవి . ఆ పూర్ణిమలలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది . " మహామాఘి , అలభ్యయోగం " అని ఈ మాఘ పూర్ణిమను అంటారు . అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట .

2019 Magha Purnima: Maghi Purnima bathing dates

వైశాఖీ కార్తీకీ మాఘీ ! తిధయోతీవ పూజిత: !!
స్నానదాన విహీనాస్తా ! ననేయా: పాండునందన !!

అని చెప్పబడింది స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా ఈ పూర్ణిమలను గడుపకూడదు.

స్నానము

యాగాల్లో అశ్వమేధం, వ్రతాల్లో సత్యనారాయణస్వామి వ్రతం, ధర్మాల్లో అహింస ఎంత గొప్పవో స్నానాలలో మాఘస్నానం అంతగొప్పది. అలాంటి మాఘస్నానాన్ని ప్రవాహజలంలో చేస్తేనే అధికఫలితం. జపం, తపం, దానం, వ్రతం మొదలైనవాటితో కూడా ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచలేమేమోగానీ... మాఘమాసంలో కేవలం స్నానం వల్లనే ఆయన
ప్రసన్నుడై భక్తులను సకలపాపాలనుంచీ విముక్తుణ్ణి చేస్తాడని పద్మపురాణం ఉత్తరఖండంలోని మాఘమాస మహత్యం చెబుతోంది. కార్తీకమాసం దీపప్రజ్వలనకు ప్రత్యేకమైతే... మాఘం స్నానాలకు ప్రత్యేకం. నారద పురాణాన్ని అనుసరించి... దేవతలు తమ శక్తులనూ తేజస్సులనూ మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా మంచిది. ఈ మాసంలో పేద వారికి అన్న, వస్త్ర దానాలు చేస్తే మంచి జరుగుతుంది.

సూర్యోదయానికి ముందే...

పౌర్ణమినాడు చంద్రుడు మఘ(మఖ) నక్షత్రంతో ఉండే మాసం మాఘమాసం. మాఘమాస మహత్యం బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు ఆరోగ్యదాయకం. సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చే కాలమిది. ఈ సమయంలో సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. ఈ కిరణాలు నీటిపై పడటం వల్ల ఆ నీరు చాలా శక్తిమంతమవుతుందట. అందుకే, జనవరి 20 నుంచి మార్చి 30 వరకూ సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు చాలామంచివని చెబుతారు.

మాఘమాసం సూర్యసంబంధమైన అర్చనమాసం. ఈ నెలలో ఆదివారం చాలా పవిత్రమైనది. ఈ రోజున తలస్నానం చేసి, సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఆదిత్యహృదయం, సూర్యాష్టకం వంటివి చదవాలి. మాఘంలో సూర్యోదయానికి ముందు నక్షత్రాలున్నప్పుడు చేసే స్నానమే అత్యుత్తమమైనది. సూర్యోదయం తరవాత చేసే స్నానం నిష్ఫలమైనది. మాఘమాసమంతా నదీస్నానం చేయలేనివాళ్లు కనీసం మూడురోజులైనా చేయాలట. ఈ నెలలో అమావాస్య నాడు ప్రయాగలో స్నానం చేస్తే సమస్త పాపాల నుంచీ విముక్తి లభిస్తుందని మహాభారతంలోని అనుశాసనిక పర్వం చెబుతోంది.

సనాతన ధర్మంలో స్నానానికి ఎంతో విశిష్టస్థానం ఉంది. మనం రోజూ చేసే స్నానం దేహాన్ని శుద్ధిచేసి, మనలోని ప్రకోపాన్ని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ స్నానాలు నిత్య, నైమిత్తిక, కామ్య, క్రియాంశ, అభ్యంగన, క్రియా అని ఆరు రకాలు. ఇందులో వైశాఖ, కార్తీక, మాఘమాసాల్లో ప్రత్యేక ఫలితాలను కోరి చేసే స్నానాలనూ; యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలనూ కామ్యస్నానాలుగా చెబుతారు. ఇలాంటి స్నానం ప్రవాహజలాల్లో... ముఖ్యంగా సాగరసంగమ ప్రదేశాల్లోనూ చేస్తే ఇంకా మంచిది.

ఇక్కడే ఒక్క ముఖ్య విషయం గమనించండి, నదీ స్నానం మంచిది అన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ చేయరాదు, ఎందుకంటే...
మనము ప్రతిరోజూ చేసే స్నానము శరీర శుభ్రతకోసము చేస్తాము. . తల శుభ్రతకోసము ప్రతిరోజూ తలస్నానము చేసేవారూ ఉన్నారు. విధిగా వారానికి ఒకసారైనా తలస్నానము చేయాలి. స్నానానికి మంచినీరే వాడాలి. పూర్వము నదులన్నీ తాము పుట్ట్టిన ప్రాంతము నుండి కొండలు , అడవులు దాటి రావడము వలన నీరు స్వచ్చము గాను వనమూలికల మయమై ఔషధ గుణాలు కలిగి ఉండేవి. ఎటువంటి మలినాలూ , రసాయనాలు , మురికినీరు కలిసేవికావు . అలా ప్రవహించే నదినీటిలో స్నానము చేస్తే ఆరోగ్యము గా ఉండేవారు. కానీ ప్రపంచమంతా పారిశ్రామికమైన తరువాత , జనాభా విపరీతముగా పెరగడము వలన , నదీప్రాంతాలలో పరిశ్రములు నెలకొల్పడము వలన , బహిరంగ ప్రదేశాలలో మల మూత్రాలు విసర్జించడము మూలంగా " *కొన్ని చోట్ల* " నదీజలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి.

పుణ్యము వస్తుందనే నెపముతో నదీస్నానాలను , నీటీప్రవాహ స్నానాలను ప్రోత్సహించేవారు. అయితే పుణ్యం కోసం అని కలుషితమైన నీటిలో స్నానం చేయడం ఎంతమాత్రము ఆరోగ్యప్రదమైనది కాదు. కాలముతో పాటు ఎన్నోమార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇదీ అంతే ... ప్రతిదాన్నీ శాస్త్రీయ పరముగా ఆలోచించాలి. మీరు ఆచరించ బోయే నది శుభ్రంగా ఉంటేనే స్నానం చేయండి. మూఢ భక్తి మంచిది కాదు. జై శ్రీమన్నారాయణ.

English summary
Magh Purnima or Magha Pournami, also known as Maha Maghi, is one of the auspicious Pournami days for Hindu devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X