వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ సంస్కృతిలో 64 కళలు.. అవేమిటో తెలుసా?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని మనకు తెలుసు , అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదట 64 విద్యలను తెలియజేసే శ్లోకం

వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన
కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న
పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ,
మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద,
రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష,
వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన
వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక
యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ
చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా
చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన
వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య
చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య
విద్వజ్ఞాన విద్యోతితే.

64 Kalas in Indian Tradition

అర్థము:-

1. వేదములు ( ఋగ్వేదము, యజుర్వేదము , సామవేదము , అధర్వణ వేదము అనేవి మనకు నాలుగు వేదాలు )

2. వేదాంగములు - వేదములకు సంబంధించిన ఆరు శాస్త్రములు (1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని ఆరు వేదాంగములు ( శాస్త్రములు )

3. ఇతిహాసములు - రామాయణ , మహాభారత , భాగవతం పురాణాదులు.

4. ఆగమశాస్త్రములు - 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని నాలుగు ఆగమములు కలవు.

5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు

6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము

7. నాటకములు

8. గానము ( సంగీతం )

9. కవిత్వము ఛందో బద్ధముగా పద్యమును గాని శ్లోకమును గాని రచించడము

10. కామశాస్త్రము

11. ద్యూతము ( జూదమాడడము ) జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీటికే
అక్షసూక్త మని అందురు .

12. దేశభాషాజ్ఞానం

13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయు విధానము.

14. వాచకము = ఏ గ్రంధమైననూ తప్పు లేకుండ వినసొంపుగా అర్థవంతముగా చదువు నేర్పునది .

15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన ,నేత్రాథానాది , అవధానములలో నైపుణ్యము

16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినది ఇడా , పింగళా , సుషుమ్న , నాడులకు సంబంధించి చెప్పబడు శుభాశుభ ఫలాలు తెలిపే శాస్త్రము,

17. శకునము= ప్రయాణ సమయములో పక్షులు జంతువులు మానవులు , ఎదురు రావడం గురించి పక్కకు తప్పుకోవడం ఆయా శకునం గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల తెలిపే శాస్త్రము

18. సాముద్రికము= హస్త రేఖలు , బిందువులు , వగైరాలను గుర్తించి శుభాశుభముల తెలుసుకునే శాస్త్రము

19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణ జ్ఞానం

20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము

21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము

22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము

23. మల్లవిద్య = కుస్తీలు పట్టులో నైపుణ్యతను తెలిపే విధానము

24. పాకకర్మ= వంటలు చేయటలో ప్రావిన్యత .

25. దోహళము=వృక్షశాస్త్ర పరిజ్ఞానం.

26. గంధవాదము = పలురకాల సువాసన వస్తువులు అత్తరు ,పన్నీరు వంటివి తయారుచేసే విధానం తెలిపేది .

27. ధాతువాదము = రసాయన వస్తువులు తెలుసుకునే విద్య

28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .

29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.

30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ ఉండే విద్య .

31. జలస్తంభన - నీళ్ళను గడ్డ కట్టించి దానిపై నడిచే విద్య .

32. వాయుస్తంభన - గాలిలో తేలియాడే విద్య.

33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గ,ఆయుదాలను నిలిపివేసే విద్య

34. వశ్యము - పరులను లోబరచుకొను విద్య

35. ఆకర్షణము - పరులను ఆకర్షించే విద్య,

36. మోహనము - పరులను మోహింపజేయు .

37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,

38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటు నుండి వెళ్ళ గొట్టడము,

39. మారణము - పరులకు ప్రాణహాని కలిగించడము.

40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.

41. వాణిజ్యము - వ్యాపారాదులు.

42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.

43. కృషి - వ్యవసాయ నేర్పరితనం.

44. ఆసవకర్మ - ఆసవములను , మందులను చేయు రీతి

45. లాపుకర్మ - పశు పక్ష్యాదులను స్వాధీన పరచుకొను రీతి.

46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పరితనం.

47. మృగయా - వేటాడు నేర్పరితనం.

48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పరితనం.

49. అద్మశ్యకరణీ - పరులకు కనబడని రీతిగా మెలంగడము.

50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పరితనం.

51. చిత్ర - చిత్రకళలో నేర్పరితనం.

52. లోహా - పాత్రలు చేయిటలో నేర్పరితనం.

53. పాషాణ - రాళ్ళు చెక్కడములో నేర్పరితనం (శిల్పకళ)

54. మృత్ - మట్టితో చేయు పనులలో నేర్పరితనం.

55. దారు - చెక్కపని చెక్కడములో నేర్పరితనం.

56. వేళు - వెదరుతో చేయు పనులలో నేర్పరితనం.

57. చర్మ - తోళ్ళ పరిశ్రమలో నేర్పరితనం..

58. అంబర - వస్త్ర పరిశ్రమలో నేర్పరితనం.

59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పరితనం.

60. ఓషథసిద్ధి - మూలికల ద్వారా కార్య సాధనా విధానము.

61. మంత్రసిద్ధి - మంత్రముల ద్వారా కార్య సాధనము.

62. స్వరవంచనా - కంఠ ధ్వని వలన ఆకర్షణము.

63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము.

64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల, మహేంద్ర జాలములు తలచినచోటికి వెల్లండం ,సృష్టించడం ఇవి గారడీ విద్యలు.

English summary
64 Kalas or Performing Arts are very important in Indian Tradition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X