• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆత్మ సర్వాంతర్యామి: అద్వైత ఆనందాన్ని పొందడం అంత సులభమేమీ కాదు

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ఆత్మనే సర్వాంతర్యామి అనే విషయం తెలుసుకున్నవారు, ఆత్మ రూపంలో భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని అంగీకరించినవారు, ఆత్మానందాన్ని అనుభవించడానికి మాత్రం మానసికంగా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కనిపించేవన్నీ
ఆ ఆత్మ లేక అనంత శక్తిలో నుండే పరిణమిస్తూ ఉద్భవించాయని తెలిసినవారు నిజ జీవితంలో అద్వైత ఆనందాన్ని పొందడం అంత సులభమేమీ కాదు.

A Brief History Of The Soul

ఈశా వాస్యోపనిషత్తులో సర్వ భూతాలలో అంతర్యామిని దర్శించిన వారికి మానసిక వైకల్యాలు కలగవు అనడం సులభంగా అనిపించినా అది నిరంతర చింతన, తపన వలననే సాధ్యం.

ఆది శంకరులు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన అనంతరకాలంలో గంగా స్నానమాచరించి విశ్వనాథుని దర్శనం కోసం కదులుతూ ఉంటే ఒక కాటి కాపరి ఎదురైనప్పుడు పక్కకు తప్పుకో అని అనడం విచిత్రం.

అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు అత్యంత
మేథాశక్తి గల మహిమాన్వితుడు, వేదవేదాంతాలను ఔపోసనపట్టిన బ్రహ్మజ్ఞాని ఆచరణ విషయం వచ్చే సరికి భంగ పడ్డాడంటే ఎంత ఆశ్చర్యకరమో ఆలోచించండి. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు. ఆత్మ స్వరూపుడై ఉన్నవాడని తెలిసినా అంగీకరించినా అనుభవించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఆ అనుభవంతోనే ఆదిశంకరులవారు అప్పటికప్పుడు 'మనీషా పంచకం' ప్రవచించి బ్రహ్మ జ్ఞాని ఎవరైననేమి అతడు నా గురువంటూ నిశ్చయించుకొన్నాడు.

ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే చాలు కదా ఎందుకు అనుభవించడం ? అనే ప్రశ్న తలెత్తవచ్చు. అరిషడ్వర్గరూపంలో ఉన్న మనస్సులోని మాలిన్యాలు తొలగేందుకు శ్రీ కృష్ణుని నిష్కామకర్మ సాధించేందుకు సనాతన ధర్మ జీవితం జీవించేందుకు సుఖ దుఃఖాలను నిర్మూలించేందుకు ముఖ్యంగా మృత్యుంజయ మోక్షస్థితిని జీవితంలో అనుభవించేందుకు ఆత్మానందంలో రమించేందుకు అద్వైతాన్ని అనుభవించాలి. అదే కదా 'అహం బ్రహ్మాస్మి'కి నిజమైన తార్కాణం. అన్నమయ్య కలగన్న శ్రీవేంకటేశ్వరుడు ఆయనకు చివరి దశలో 'అంతర్యామి'గా ప్రసన్నమయ్యాడు.

భౌతిక దృక్పథం నుండి ఆత్మ దృక్పథంలోకి మారడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో చూడవచ్చు. అందుకే ఆత్మజ్ఞాన జిజ్ఞాసులు మొదట ఆత్మను జడమును అర్థం చేసుకోవాలి. తద్వారా మాత్రమే ఆత్మను, జడమును వేరుగా చూడటాన్ని మన ఆలోచనలలో నుండి తీసివేయగలం.

'మహోపనిషత్‌' భేద దృష్టియే అవిద్య అని చెప్పింది. దానిని విసర్జించమని ఆదేశించింది. సర్వమూ బ్రహ్మమేనన్న విషయం తెలుసుకోవడమే విద్య అని దానిని అనుభవించడమే అక్షయమని తేల్చిచెప్పింది.

దీనికి చిన్న ఉదాహరణగా సైన్స్‌ చెప్పే విషయాన్ని తీసుకోవచ్చును. భూమి మీద భూమిని మించిన బరువు ఉన్న జీవులు జన్మిస్తే భూమి తన భ్రమణ పరిభ్రమణ గతులను తప్పుతుందా అనేది ప్రశ్న. సమాధానం 'గతి తప్పదు'. ఎందుకు గతి తప్పదు? ఎందుకంటే ఆ జీవులన్నీ భూమండలంలోనుండే ఉద్భవించినవి కాబట్టి. ఇదే గమ్మత్తు. ఆశ్చర్యదాయకం. ఇదే చిన్న ఉదాహరణను ఆ సర్వాంతర్యామిలో పుట్టి, గిట్టే ఖగోళ పదార్థాలన్నింటి విషయంలోనూ అన్వయించుకోవచ్చు.

ఈ విధంగా అంతర్యామిని దర్శించుకోవచ్చు. ఈ దర్శనం నిరంతర మానసిక చింతనతోనే ఆచరణ సాధ్యం.

జిజ్ఞాసులకు మనసు అత్యంత కీలక సాధనం. అది మాత్రమే అవిద్యను తొలగించి వేసే విద్యకు ఆధారమౌతుంది. ఆ మనసు స్థిరంగా, బలంగా ఆత్మతో మమేకమైతేనే ఆచరణ సాధ్యమౌతుంది. అప్పుడే నిష్కామకర్మ చేస్తూ మోక్ష స్థితిని అనుభవించగలం. తద్వారా మనచుట్టూ ఉన్న సమాజంలో, ప్రకృతిలో మనల్ని మనమే చూసుకోగలం. అంతటా ప్రేమను నింపగలం. ఆ స్థితియే 'అహం బ్రహ్మాస్మి' అప్పుడే
భేద భావం వలన ఉత్పన్నమయ్యే అరిషడ్వర్గాలు నశించి ఆనంద మయ జగత్తు సాక్షాత్కారమౌతుంది.

ఇది సాధన చేసిన వారికి అనుభవంలోకి వస్తుంది.

English summary
The article explains the nature of the individual soul, the difference between embodied soul and free soul, how souls become bound to Nature and how they can achieve liberation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X