వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Astrology: గోర్లే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తీస్తున్నారా.. అయితే అరిష్టమే..!

గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు తీయడం వల్ల ఇబ్బందులు పడతారు.

|
Google Oneindia TeluguNews

చాలా మంది గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు తీస్తారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు తీయడం మంచిది కాదట. అలాగే చాలా మంది నోటితో గోర్లను తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే గోర్లు కత్తిరించే విషయంలో చాలా నియమాలు ఉన్నాయి.ఈ నియమాలను పాటించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. జ్యోతిష్యం ప్రకారం గోర్లు కత్తిరించడానికి సంబంధించిన ఆ నియమాల ఏమిటో తెలసుకుందాం..

మంగళ, గురు, శని

మంగళ, గురు, శని

గోర్లు పరిశుభ్రత, గోర్లు కత్తిరించే రోజు, సమయం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. లేదంటే ఆ వ్యక్తి పేదరికంలోకి వెళ్లాల్సి వస్తుందట. గోర్లు మంగళ, గురు, శనివారాల్లో ఎప్పుడూ గోర్లను కత్తిరించకూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.ఇలా చేయడం వల్ల కుజుడు, గురు, శని గ్రహాలు అశుభ ఫలితాలను ఇవ్వడం మొదలుపెడతాయట. బలహీనమైన కుజుడు వివాహం, సంపద, ధైర్యం లేకపోవడం వంటి సమస్యలను వస్తాయట.

అమావాస్య

అమావాస్య

గురువారం గోర్లు కత్తిరించుకోవడం అంటే దురదృష్టానికి ఆహ్వానం పలికినట్లే అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.శనివారం రోజు గోర్లు కత్తిరించడం వల్ల శని గ్రహానికి కోపం వచ్చే అవకాశం ఉందట. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందట. అంతేకాదు అమావాస్య తిథిలలో గోర్లను కత్తిరించకూడదట. చతుర్దశి, అమావాస్య రోజున గోర్లు లేదా జుట్టు కత్తిరించడం వలన అనేక సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్రం

జ్యోతిష్య శాస్త్రం

సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం మంచిది కాదట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమ, బుధ,శుక్ర, ఆదివారాలలో గోర్లను కత్తిరించుకోవడం మంచిదని చెబుతున్నారు. గోర్లను ఎప్పటికీ పగటిపూట మాత్రమే కత్తిరించుకోవడం మంచిదట. సోమవారం శివుడు, చంద్రుడు మనస్సుతో సంబంధం కలిగి ఉంటుందట. సోమవారం నాడు గోర్లు కత్తిరిస్తే తమోగుణం తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

బుధవారం

బుధవారం

బుధవారం నాడు గోళ్లు కత్తిరించడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. ఇది కాకుండా వృత్తిలో తెలివితేటల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం శుక్ర గ్రహానికి అంకితం అయి ఉంటుంది. ప్రేమ, సంపద మరియు లగ్జరీతో సంబంధం కలిగి ఉంటుంది. గోర్లు కత్తిరించడానికి శుక్రవారం ఉత్తమ రోజుగా చెబుతారు.ఇలా చేయడం వల్ల జీవితంలో సంబంధాలు బలపడతాయట.

English summary
Most people pick their nails when they fall out. When this happens, then it is not good to remove the nails. Also many people take nails by mouth. Doing this is also not good for health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X