వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ? ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి, మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...

* గణనాయకాష్టకం - అన్ని విజయాలకు.

* శివాష్టకం - శివ అనుగ్రహం.

* ఆదిత్యహృదయం - ఆరోగ్యం, ఉద్యోగం.

* శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది.

According to the hindu Mythology, what one should read to get fruitful result

* అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి.

* కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.

* దుర్గష్టోత్తర శతనామం - భయహరం.

* విశ్వనాథ అష్టకం - విద్య విజయం.

* సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం.

* హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ.

* విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి.

* శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి.

* భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి.

* శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం.

* లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం.

* కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం.

* ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత.

* శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం.

* లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి.

* శ్యామాల దండకం - వాక్శుద్ధి.

* త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి.

* శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి.

* శని స్తోత్రం - శని పీడ నివారణ.

* మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం.

* అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి.

* కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం.

* కనకధార స్తోత్రం - కనకధారయే.

* శ్రీ సూక్తం - ధన లాభం.

* సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది.

* సుదర్శన మంత్రం - శత్రు నాశనం.

* విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం.

* రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి.

* దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు.

* భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు.

* వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు.

* దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు.

* లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి.

⭐⭐⭐ పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది.

⭐⭐⭐ అష్టకం - 8 శ్లోకాలతో కూడినది.

⭐⭐⭐ నవకం - 9 శ్లోకాలతో కూడినది.

⭐⭐⭐ స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది.

⭐⭐⭐ శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం.

⭐⭐⭐ సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం.

పంచపునీతాలు:-
⭐ వాక్ శుద్ధి
⭐ దేహ శుద్ధి
⭐ భాండ శుద్ధి
⭐ కర్మ శుద్ధి
⭐ మనశ్శుద్ధి

* వాక్ శుద్ధి :- వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు... మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.

* దేహ శుద్ధి :- మన శరీరం దేవుని ఆలయం వంటిది... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.

* భాండ శుద్ధి :- శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది.

* కర్మ శుద్ధి :- అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు.

* మనశ్శుద్ధి :- మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి... మనస్సు చంచలమైనది... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి.

* ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది.

* ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది.

* నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది.

* యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది.

* సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది.

* గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది.

* సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది.

* పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది.

* భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు.

English summary
According to Astrology what one need to read and what results occur from those readings here is the list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X