వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read: వాస్తు ప్రకారం ఏ చెట్లు ఏ దిశల్లో ఉండాలి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

వాస్తు ప్రకారం చాలా మంది ఇళ్లు నిర్మించుకుంటారు, అయితే మొక్కల విషయంలో మాత్రం మంచి ఖాళీ స్దలం ఉంది కదా అని వేసేస్తారు, అయితే ఇక్కడ కొన్ని వాస్తు నియమాలు పాటించాలి, ముఖ్యంగా మొక్కల విషయంలో ఈ నియమాలు పాటిస్తే వాస్తు మరియు ఇబ్బందులు ఉండవు.

1. మీరు ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని చెట్లను పెంచకూడదు.

2. ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి.

According to Vaastu, which plants should be planted where?

3. తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచాలి.

4. పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి.

5. ఉత్తర ద్వారం వారి ఇంటికి వాయవ్యంలో తులసికోట వుండాలి.

6. ఇక తులసి కోట మొక్క విషయంలో ఈశాన్యంలో ఉంచకూడదు.

7. ఉత్తర దిశలో కొబ్బరి, మామిడి, దానిమ్మ, బత్తాయ ఈ చెట్లు వేయకూడదు

8. మీకు ఆనవాయి ఉంటే అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి.

9. ఖచ్చితంగా ఇంటికి నైరుతి దిశలో కొబ్బరి చెట్టు ఉండాలి.

10. బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు.

11. తమలపాకుల మొక్కను దక్షిణ దిశలో ఇంట్లో పెంచటం శుభం.

12. దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో పూల కుండీలు వుంచవచ్చును.

13. పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, ఇంటి ప్రహారీ లోపల వేయకూడదు, ఇంటి బయట పెంచుకోవచ్చు. ఇంటి వాస్తుకి సంబంధం లేకుండా ఉండాలి.

14. తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు.

15. క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచవచ్చును.

16. తాటి తుమ్మ ఈత పైనాపిల్ ఇలాంటి చెట్లు ఇంట్లో పెంచకూడదు.

English summary
Many houses are built according to the layout, but in the case of plants, it is asked whether there is good space, but here are some architectural rules to follow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X