• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాయా ఆదీనంలో జగత్తు, మోక్షపథం వైపు ఎలా నడవాలి?

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

మాయలో పడటమే ఈ జీవితంలో అన్నిటికన్నా ఆశ్చర్యం. ఈ జీవితమనే అడవిలో మన మనసు తికమక పడుతుంది పెడుతుంది. మన ఇహలోక జీవితం శాశ్వతం సంపూర్ణం ఎన్నటికి మారనిది సుఖమైనది అంటుంది. కానీ మన మనసు అంటుకు పోయిన ఈ లోకం ఈ లోకంలోని మన జీవితం తాత్కాలికం అసంపూర్ణం ఎప్పుడూ మారేది కొరతలతోకూడినది విచారకరమై నది. గత జన్మల కర్మలను స్వభావాలను బట్టి మనం ఇహలోక ఆశలు పెంచుకుంటాము. మన రాగ ద్వేషాలను బట్టి ఆశలు కోర్కెలు ఎన్నోమనలో కలుగుతాయి. మనసు పుట్టించే ఇహలోకాశలతో మనం మోసపోతాము. నాది, నేను అనే మాయలో పడి మంచి వస్తువులు కోరతాము. రోగం, మరణం వద్దంటాము. మహావిద్యావంతులకు కూడా కోర్కెలు ఉండాలి... కోర్కెలు లేనివాడు చచ్చినట్లే లెక్క అంటారు. తల్లిదండ్రుల్నిజన్మను బంధువుల్ని కులాన్ని రంగును మరణాన్ని అన్నిటినీ మనమే ఏదేది ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో కోరుకున్నట్లు అలాగే జరుగుతున్నట్లూ భ్రమిస్తున్నాము. అన్నిటికంటే ఆశ్యర్యం కలిగించే మన ఈ మూర్ఖత్వం అజ్ఞానమే మహా మాయ.

మాయావినో మమిరే అశ్య మాయాయ (ఋగ్వేదం 9.83.3)

మహా మాయగాళ్ళు ఆయన మాయచేతనే

మాయేశ్వరి, మాయేశ్వరీ మాత.

దేవీ భాగవతం ఆరో స్కంధంలో సకల జగత్తు కు మూలాధారమైన శక్తే ఈ మాయేశ్వరీ మాత. హరిహరబ్రహ్మ రుద్రాదులను సయితం ఈమె సృష్టించి వారి చేత ఏయే పనులు చేయించాలో వాటిని చేయిస్తుంటుంది. ఆదిపరాశక్తి అని, సచ్చిదానంద స్వరూపిణి అని, భగవతి, మాయేశ్వరి అని కూడా ఆ మాతనంటుంటారు. చరాచర జగత్తునంతటినీ ఆడించే మాయాశక్తి ఆమె. సత్వ, రజో, తమో అనే మూడు గుణాలతో ఆవరించి ఉండే మాయ ఆ తల్లి చేతిలోని ఓ సూత్రం. ఆ సూత్రంతోనే సకల సృష్టిని బొమ్మను చేసి ఆడించినట్టు ఆడిస్తూ ఉంటుంది ఆమె. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కూడా త్రిగుణా త్మకమైన మాయను పొంది ఉంటారు. ఆ మాయాశక్తి వల్లే అంతటి పెద్ద పెద్ద దేవుళ్ళు కూడా ఒకసారి కోపంగా, మరోసారి దుఃఖ పడుతూ కనిపిస్తుంటారు.

Adi Parashakti is the Supreme Being goddess

మూడు గుణాల లో మొదటిదైన సత్వగుణం ఆవరించి ఉన్నప్పుడు త్రిమూర్తులు శాంతులై తపస్సు చేసుకుంటూ ఉంటారు. అదే రజోగుణం ఉన్నప్పుడు ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. తమోగుణం ఆవరించి ఉన్నప్పుడు మూఢంగా ప్రవర్తించి విషాదాన్ని అనుభవిస్తూ కనిపిస్తారు. ఈ జగత్తంతా మాయ ఆధీనంలో ఉంటుంది . ఈ మాయాశక్తిని ప్రేరేపించే జగదాంబికను పరతత్వం అని,పరమేశ్వరి అని కూడా అంటారు.మాయాశక్తికి లోనుకా కుండా మోక్షపథం వైపు పయనించాలంటే తనలోని మాయను తొలగించమని వేడుకోవాలి. అప్పుడు మనస్సు నిర్మలంగా ప్రకాశి స్తుంది. ఇంద్రియాలకు నిగ్రహశక్తి లభించిన ప్పుడు మనిషి చూపు తాత్కాలిక సుఖాల మీద ఉండదు. నిత్యము, నిశ్చలము అయిన మోక్షపథం వైపు ఆ చూపు ప్రసరిస్తుంది.

జగన్నాయకి .. జగదాంబిక

ఈ జగత్తున్నంతా సృష్టించి రక్షించి తిరిగి లయం చేసే శక్తి స్వరూపం.జగత్తుకంతటికీ అధినాయకి.జగదాంబిక.త్రిమూర్తుల యోగ దృష్టి సంయోగం వల్ల జన్మించింది ఈ శక్తి స్వరూపిణి, త్రికళ. విష్ణుమాయ.జగాన్ని సంహరించే లయకారిణి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Adi Parashakti or Adishakti is the Supreme Being goddess.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more