130 ఏళ్ల తరువాత కీలక పరిణామం.. ఈ 3 రాశుల వారు ఐశ్వర్యవంతులు
వైశాఖ మాసం పౌర్ణమిని బుద్ధ పూర్ణిమ అంటారు. బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడి జననం, జ్ఞానోదయం, మరణాన్ని సూచించిన రోజు. బౌద్ధ మతస్తులకు ముఖ్యమైన పండగ. జ్యోతిష్యం ప్రకారం ఆరోజు చాలా కీలకమైంది. అదేరోజున ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. దాదాపు 130 సంవత్సరాల తర్వాత బుద్ధ పూర్ణిమ రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.
గ్రహణం సమయంలో రాశుల కలయిక అనేక రాశుల్లో సంతోషాన్ని తేబోతోంది. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మే 5 రాత్రి 8.47 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1.00 గంటకు ముగుస్తుంది. దీంతో పాటు సూర్యోదయం నుంచి ఉదయం 9:16 వరకు స్వాతి నక్షత్రం రోజంతా ఉంటుంది. మేష, కర్కాటక, సింహరాశులవారికి బుద్ధపూర్ణిమ రోజు బాగా కలిసిరానుంది.

మేష రాశి: బుద్ధ పూర్ణిమ రోజు సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. బుధ గ్రహంతో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. చంద్రగ్రహణ ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. కొంతకాలం నుంచి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రయోజనం పొందుతారు.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం మంచిది. సూర్యుడు, బుధుడు కలయికతో ఏర్పడిన బుధాదిత్య యోగం వీరికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.
సింహ రాశి: బుద్ధ పూర్ణిమ రోజు సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. రాశికి చెందిన వారికి బుధాదిత్య యోగ ప్రభావాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశిచక్రంవారికి కార్యాలయంలో వారు చేస్తున్న పనికి ప్రశంసలు పొందుతారు. అంతేకాదు.. ఇంక్రిమెంట్ తో పదోన్నతి ఉంటుంది.












Click it and Unblock the Notifications