వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే అమలకీ ఏకాదశి: ఏం చేయాలి, ఈ పూజా విధానం ఎలా ఉంటుంది?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య, ఫోన్: 9440611151

అమలకీ ఏకాదశి రోజు నాడు చేయవలసిన ప్రత్యేక పూజ గురించి తెలుసుకుందాం.ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత.భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్ళను పోయాలి.ఆ తర్వాత చెట్టునకు పసుపు,కుంకుమ,గంధం పూలతో అలంకరించి,దీపం,దూపం,అరటి ఆకులో అరటిపండు నైవేద్యం పెట్టిన తర్వాత

చెంబులో కొన్ని నీళ్ళను పోసుకుని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపునీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరిక చెట్టునకు సవ్య దిశగా ప్రదక్షిణాలు చేస్తూ చుట్టునకు ఓ అకు వరస చొప్పున పదమూడు చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన ధారాన్ని నిష్కల్మషమైన మనస్సుతో ముడి వేయాలి.

Amalaki Ekadashi 2019: Why Devotees Fast & Worship Lord Vishnu & Amla Tree?

ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో స్మరించ వలసిన మంత్రం :-

ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి !
వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తధాకురు !!

భగవంతుడు భక్తుడి యొక్క ప్రేమాతో కూడుకున్న పిలుపునకు స్వామి వారు అత్యంతగా ఇష్టపడతాడు.ప్రతీ ఏకాదశి రోజున ఉపవాస్యం చేసిన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.శారీరక పుష్టి ,శక్తి ఉన్నవారు నెలలో వచ్చు రెండు ఏకాదశులలో ఉపవాస్యం ఉంటూ ప్రతి నెల చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నారాయణుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

ఏకాదశి రోజు ఉపవాస్యం ఉండాలని కొంత మందికి కోరిక ఉంటుంది కాని శారీరక పుష్టి లేని వారికి కొబ్బరి నీళ్ళు,జ్యూసులు మొదలైన ద్రవ పదార్ధాలు త్రాగుతూ కూడా ఉపవాస్యం చేయవచ్చును.భగవంతుడు తనపై భక్తీ కావాలనే కోరుకుంటాడు,సాటి జీవులలో ప్రతి పనిలో తనను చూడగలిగితే చాలు అని స్వామి వారి ఉద్యేశ్యం అది గ్రహించి వ్యవహారించ గలిగితే చాలు. జై శ్రీమన్నారాయణ.

English summary
Amalaki Ekadashi 2019 Date: Why Devotees Fast & Worship Lord Vishnu & Amla Tree?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X