వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూలై 5న మరో చంద్రగ్రహణం,దీన్ని ఏమని పిలుస్తారు..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

5 జూలై 2020 ఆదివారం రోజు నాడు ఏర్పడే చంద్ర గ్రహణం మనకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ గ్రహణాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది ఛాయా గ్రహణము, రెండవది ప్రచ్చాయ గ్రహణం అని పిలువబడుతాయి.

గ్రహాణాలు ఎలా ఏర్పడతాయి:- సూర్యునికి , భూమికి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. రవి, భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు పరిధిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. రవి, చంద్రులకు మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే రవి, భూమి , చంద్రులు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్ద గానీ కేతువు వద్దగానీ ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

Another Lunar eclipse on july 5th, what is it according to Astrology?

పూర్తీ చంద్రబింబం కనబడకపోతే దాన్ని సంపూర్ణ చంద్ర గ్రహణం అని అంటారు. కొంత భాగం కనిపించక పొతే దానిని పాక్షిక చంద్రగ్రహణం అంటాం. సూర్యుని కాంతి చంద్రుని పైన పడుతుంది. భూమి నీడ పరిధిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భూమి నీడ పరిధి దాటేంత వరకు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. ఈ స్థితినే గ్రహణం అని అంటాం. రాహువు వద్దకు గానీ కేతువు వద్దకు గానీ ఈ గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది.

చంద్ర గ్రహణం:- చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు కనిపిస్తుంది.

చంద్ర గ్రహణానికి కావలసిన పరిస్థితులు :- చంద్ర గ్రహణానికి క్రింది పరిస్థితులు కావలెను.

1. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి.
2. చంద్రుడికీ సూర్యుడికీ మధ్య భూమి వుండాలి.
3. నిండు పౌర్ణమి రాత్రి అయి వుండాలి.
4. చంద్ర గ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష్యా బిందువులపై ఆధారపడి వుంటుంది.

"ప్రతి ఛాయా గ్రహణం" అంటే భూమి ఛాయా పరిధిలో కాకుండా ప్రతి ఛాయాలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఏర్పడే చంద్ర గ్రహణం భారత కాలమాన ప్రకారం ప్రతి ఛాయా పాక్షిక చంద్ర గ్రహణమునకు భారతీయ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం మనం ఈ గ్రహణానికి మనకు ఏలాంటి సంబంధం ఉండదు కాబట్టి ఎవరూ ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు, ఎలాంటి గ్రహణ నియమాలు వర్తించవు, పాటించనవసరం లేదు. ఈ విషయాన్ని తప:శక్తి సంపన్నులైన ఋషుల పరిశోధనలో నిర్ధారించిన నియమం.

భారతదేశ కాల మానం ప్రకారం ఖగోళంలో ఈ ప్రతి ఛాయా గ్రహణం భూమిపై కాకుండా భూమి నీడపై పడుతుంది కాబట్టి మనకు ఎంత మాత్రం వర్తించదు. దీనిని గ్రహణం అని భావించరాదు. ఉదాహరణకు కరెంట్ వైర్ మన మీద పడితే షాక్ కొడుతుంది అది మనకు వర్తిస్తుంది. కానీ మన నీడ ( ఛాయా ) పై కరెంట్ తీగ పడుతే మనకు షాకు ఎలా తగలదో, వర్తించదో ఈ గ్రహణం కుడా మనకు అంతే కాబట్టి గర్భిని స్త్రీలు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు. కొందరు మనకు వర్తిస్తుంది అని ప్రచారం చేస్తున్నారు అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఏ పంచాంగాలలో గ్రహణం గురుంచి ఇది మనకు వరిస్తుందని రాయలేదు కాబట్టి నిస్సందేహంగా ఉండవచ్చు. లేనిపోని అనుమానాలు, అపోహలు పడవద్దు.

ప్రత్యేక సూచన :- భారత దేశంలో చంద్ర గ్రహణం లేదు కాబట్టి భారత దేశములో నివసించే వారికి ఈ గ్రహణ నియమాలు ఆచరించవలసిన అవసరం లేదు, ఇది గమనించ గలరు.

మన భారతీయ సంస్కృతిలో మహర్షులు తమ పరిశోధన అనుభవంతో నిర్ధారించి చెప్పిన విషయం ఛాయా గ్రహణములే మానవాళిని ప్రభావితం చేస్తాయి. గ్రహణాల వలన భూమిపై ఏ ప్రాంతంలో కనబడుతుందో ఏ నక్షత్రంలో సంభవిస్తుందో వారికి ఆక్కడి ప్రజలకు ప్రభావం చూపిస్తాయి అని వారి పరిశోధనల ద్వారా తేల్చేసి వారి దివ్వ దృష్టితో గ్రహించి గ్రహణాలు కేవలం ఛాయా గ్రహణములనే పరిఘనలోకి తీసుకుని పాటించాలి అని తెలియజేసారు. ప్రతి ఛాయా గ్రహణాలు ఎలాంటి హానికరమైన ఫలితాలు ఇవ్వవని నిర్ధారించారు.

జూన్ 5 తేదీ రోజు మరియు జులై 5న ఏర్పడే ప్రచ్చాయ గ్రహణం వలన ఎలాంటి ఇబ్బంది ఎవరికీ కలగదు కానీ జూన్ 21 రోజున ఏర్పడిన సూర్య గ్రహణం రోజు గ్రహణం ఏర్పడే సమయానికి ఖగోళంలో ఆరు గ్రహాలు అపసవ్య దిశలో తిరగడం అనేది కొన్ని రాశులకు అనుకూలం కాదని చెప్పవచ్చును. ఆ రాశులపై ప్రతికూల ప్రభావం ఏమిటో గమనిద్దాం. ఉపఛాయ గ్రహణంగా ఏర్పడనున్న ఈ ఖగోళ ఘటన వల్ల రాశిచక్రంలో కొన్ని కీలక మార్పులు సంభవించనున్నాయి. ముఖ్యంగా ఆరు రాశులపై ఎక్కవ ప్రతికూల ప్రభావం చూపుతుంది.

జులై 5 ఆదివారం రోజు గురుపూర్ణిమ కుడా. ఈ రోజున ఉపఛాయ చంద్రగ్రహణం అయినప్పటికీ చంద్రుడి పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే చంద్రుడు సాధారణంగా కనిపిస్తాడు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం జనవరిలో ఏర్పడింది. తాజాగా సంభవించనున్న మూడోది. అంతే కాకుండా ఈ ఏడాది ఏర్పడనున్న చిట్టచివరి చంద్రగ్రహణం. ఈ నేపథ్యంలో జ్యోతిషశాస్త్ర ప్రకారం ద్వాదశరాశి చక్రంలోని పన్నెండు రాశులపై ప్రభావం చూపించనుంది. అందులో ముఖ్యంగా ఆరు రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మరి ఆ రాశులేంటో గమనిద్దాం.

మేషరాశి:- ప్రశంసలు పొందుతారు. పై అధికారుల సూచనలు ఉపయోగపడును. శుభాకార్యక్రమాలలో పాల్గొందురు. ఈ మాసంలో ప్రధమ వారం మంచి ఫలితాలు ఏర్పడవు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్ధిక సమస్యలకు, మానసిక అశాంతికి దారితీయు సూచనలు కలవు. ప్రేమ వ్యవహారముల వలన అపకీర్తి, గౌరవ హాని. మేషరాశి పురుషులకు పర స్త్రీ ఆకర్షణ వలన తీవ్ర సమస్యలు. ఉద్యోగ జీవనంలో భాద్యతలను చివరి నిమిషంలో పూర్తీ చేయగలుగుతారు. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృషభరాశి:- నూతన అవకాశములు లభించును. వివాహ ప్రయత్నాలు విజయవంతం అగును. వ్యాపార విస్తరణ అవకాశములు లభించును. ఉన్నత విద్య ఆశిస్తున్న వారికి ప్రయత్నపూర్వక లాభం ఏర్పడును. ఆర్ధిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు. వృత్తి జీవనంలో పనులు తీవ్ర జాప్యం ఎదుర్కొందును. కొన్ని వివాదాలు మానసికంగా చికాకులు లేదా గౌరవ హాని కలుగచేయును. సోదర వర్గం వారి సహకారంతో సమస్యలు పరిష్కారమగును. కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడును. మొత్తం మీద ధనాదాయం కొంత తగ్గును. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరమైనవిగా ఉంటాయి. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​మిథునరాశి :- ఈ చంద్ర గ్రహణం మిథున రాశివారిపై అత్యంధికంగా ప్రభావం చూపనుంది. అష్టమ శని ప్రభావంతో ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశ పడటాలు ఎంతమాత్రం పనికిరావు అని గ్రహించండి. కుటుంబ, సామాజిక జీవితంలో ఒత్తిడిలు చోటుచేసుకుంటాయి జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వీలైనంత వరకు వివాదాలు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలి. లేకపోతే ఇది మీరు తలపెట్టిన కార్యంపై ప్రభావితం చేస్తుంది. అవసరమైన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అందువల్ల దీనిపై దృష్టిసారించండి. మీరు ప్రతీ చిన్న విషయాలిన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు, మనస్సును ప్రశాంతంగా పెట్టుకోకపోతే ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు సహనం పాటిస్తూ మౌనంగా ఉండండి. భిన్నంగా వ్యవహరిస్తే వ్యతిరేక ఫలితాలు చవిచూడాల్సి వస్తుంది. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి.

కర్కాటకరాశి:- ముఖ్యమైన నిర్ణయాలను పెద్దల, శ్రేయోభిలాషి సలహాలతో తీసుకొనవచ్చు. మొత్తం మీద తీవ్ర ఇబ్బందుల నుండి బయటపడతారు. దూర ప్రాంత ఆదాయ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఆదాయం పొందగలరు. నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. ఉద్యోగ జీవనంలో నిలకడ వస్తుంది. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగును. కుటుంబ విషయాలలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాలలో పట్టు సాధిస్తారు. పరిస్థితులు అవగాహన అవుతాయి. సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. చండి లేక సుదర్శన హోమం జరిపించుకొండి ప్రతికూలాలు శుభాలుగా మారుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​సింహరాశి :- సింహరాశి వారికి ఓపిక ఎక్కువ అవసరం అని గ్రహించండి. అమృతం కోసం దేవ, దానవులు పాల సముద్రం చిలికితే మొదట విషం ముందు వచ్చినట్లు కొన్ని విధములైన ఇబ్బందులతో సతమతం చేస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువగా జాగ్రత్తలతో ఉండవలసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు , మిమ్మల్ని ఇష్టపడే వారితో బంధం బలపడుతుంది. మిమ్మల్ని ఇష్టపడే వారిని దూరం చేసుకోకండి. ఆధ్యాత్మిక చింతన వలన కొంత ఉపశమనం లభిస్తుంది. భూమికి సంబంధించిన వ్యాపారాలు, మోటారు వాహనాల క్రయవిక్రయాలు సాగించకపోవడం మంచిది. అనవసరంగా డబ్బును వృథాగా ఖర్చుచేయకూడదు, డాంభికాలకు పోకూడదు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే రాబడిలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంచుకున్న వృత్తి, వ్యాపారంలో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయంలో మాత్రం పెద్దాగా ఇబ్బంది కలిగించనప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ పెద్దలతో కాని ఉద్యోగంలో పై అధికారులతో కాని, ప్రభుత్వాధికారులతో అనవసర వివాదాలు దిగకూడదు. స్పీడ్ నిర్ణయాలు, ఆవేశ పడటాలు ఎంత మాత్రం పనికిరావు అని గ్రహించండి. లేకుంటే మీరే నష్టపోయే అవకాశముంది. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి.

​కన్యరాశి :- కన్యరాశి వారికి అశుభ ప్రభావాలను ఎక్కువగా చవిచూపుతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీరు అంటువ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. అశ్రద్ధచేస్తే మీకు ఇవి ప్రమాదకారిగా మారవచ్చు. అలాగే మీరు కుటుంబం, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం మీకు అంతగా మంచిది కాదు అనే విషయం గ్రహించాలి. ఆహారం విషయంలో మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవాలి. స్త్రీ లతో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. స్త్రీ మూలక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండండి. మీరు చేసే పని మరింత దిగజారుతున్నట్లు కనిపిస్తుంది. ఫలితంగా మనస్సులో అభద్రతభావం నెలకొంటుంది. ఇంట్లో వివాదాలకూ దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత కొరకు ధ్యానం చేయండి. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి.

తులరాశి :- అర్దాష్టమ శని ప్రభావంలో ఉన్నామని గుర్తు పెట్టుకొండి. ఉద్యోగ జీవనం సామాన్య యోగాన్ని కలుగచేయును. ఆలోచనా విధానం బాగుండును. కుటుంబ సమస్యలు మానసికంగా చికాకులు కలుగచేయును. ప్రేమ వ్యవహారంలో మీ తొందరపాటు ఎంత మాత్రం పనికి రాదు. సహానం, రాజీ విధానం అలవరుచుకుంటే శుభాలను చూస్తారు. పంతాలకు పొతే ఇబ్బందులు ఎదుర్కుంటారు. రక్త సంబంధీకుల పట్ల అభిమానం అవసరం. ధనాదాయం సామాన్యం. సంతాన సంబంధిత విషయాలలో ప్రతికూల ఫలితాలు ఏర్పడును. అధునాతన పరికరాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టు నూతన కార్యములు జయప్రదంగా కొనసాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు, అయిన కావలసిన వారిపై అనుమానాలు పనికి రావు. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.

వృశ్చికరాశి :- ఏలినాటి శని ప్రభావం నుండి బయట పడ్డప్పటికిని ఎంతో కొంత ఇబ్బంది కరమైన ప్రభావం చూపనుంది. ఈ సమయంలో మీకు బాధ్యతలు మరింత పెరుగుతాయి.ప్రేమ భాగస్వామితో కానీ , జీవిత భాగస్వామితో కానీ మీకు అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశముంది. తలిదండ్రుల ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు చేసిన రుణాలను త్వరగా చెల్లించండి. కొన్నిసార్లు కొన్ని సంఘటన వలన సమాజంలో గౌరవమర్యాదలు తగ్గుతాయి. కొన్ని నిర్ణయాల వలన వివాదాలు కూడా పెరిగే అవకాశముంది. సంఘం విద్రోహులుగా మీపై ముద్ర వేస్తారు. ఈ కారణంగా కుటుంబంలో గొడవలు జరుగుతాయి. అంతేకాకుండా రోజువారీ పనుల్లో అవరోధాలు ఏర్పడుతాయి. ఫలితంగా మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన కొన్ని సమస్యలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి.

​ధనస్సురాశి :- ఏలినాటి శని ప్రభావం మూడవ భాగం అంటే ఏలినాటి శని చివరి భాగంలో ఉండటం వలన ఎక్కువ శాతం చెడు ప్రభావం అనేది ఎక్కువగా చవి చూడాల్సి ఉంటుంది. ఈ ప్రభావం అనేది అనేక విషయాలలో చూపిస్తుంది. మానసిక ఒత్తిడిని తీసుకొస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఒక సారి మీ వ్యక్తీ గత జాతకాన్ని పరిశీలన చేయించుకొండి. ఆరోగ్య సంబందమైన విషయాలలో జాగ్త్రత్త అవసరం. కుటుంబ సభ్యుల రోజువారీ ఖర్చులలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లో తోబుట్టువులతో గొడవలు ఉండవచ్చు. సంతాన మూలకంగా కొన్ని సమస్యలు. సెల్ఫ్ డ్రైవింగ్ వద్దు. ప్రయాణాలలో గాయపడే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించండి. మీరు పిల్లల విషయంలో ఓ కన్ను వేసి ఉండండి, లేదా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత కష్టపడాల్సి ఉంటుంది. తద్వారా మీలో అభద్రత ఉండదు. వీలైతే మీరు చండి హోమం జరిపించండి. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి.

మకరరాశి :- ఏలినాటి శని రెండవ భాగం నడుస్తున్న కారణంగా అవసరాలకు రావలసిన ధనం అందుట కష్టం. హామీలు ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోరు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ప్రధమ అర్ధభాగం అంత అనుకూలంగా ఉండదు. మకర రాశికి చెందిన స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలుగచేయును. ధనాదాయం తగ్గును. ద్వితీయ అర్ధ భాగం నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత ప్రారంభమగును. నూతన కాంట్రాక్టులు పొందుతారు. సంతాన ప్రయత్నములు వంశ పెద్దల ఆశీస్శులతో విజయవంతం అవుతాయి. ఆర్ధిక విషయాలలో కూడా అనుకూలత పొందుతారు. స్థానచలన ప్రయత్నాలకు మంచి కాలం. దంత సంబంధ సమస్యల వలన ఇబ్బదులు కలిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభరాశి :- ఏలినాటి శని ప్రభావం ప్రధమ భాగంలో ఉన్నామని గుర్తుంచుకోండి. గురు శుభ దృష్టి వలన అధికారులతో వివాదాలు తొలగును. ధనాదాయం బాగుండును. సినీరంగ వ్యాపారములు చేయు వారికి మాత్రం ఆశించిన లాభములు లభించుట కష్టం. పెట్టుబడులు పెట్టుటకు ముందు పెద్దల సలహాలు పాటించుట మంచిది. శరీర ఆరోగ్యం సహకరించును. సంతానం వలన మానసిక ఉల్లాసం లభించును. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. గృహంలో బంధు మిత్రుల కలయిక ఏర్పడును. పితృ వర్గీయుల కొరకు ధన వ్యయం ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధ స్థాన చలన ప్రయత్నములకు అనుకూలంగా ఉండును. తలపెట్టిన పనులలో ఏర్పడుతున్న ఆటంకములు తొలగును. మీ మేలును కోరే గురువులకు సన్నిహితంగా ఉంటే మరింత మేలు జరుగుతుంది. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి :- ప్రతిబంధక వ్యవహారాలు వాయిదా పడును. జీవన స్థితిపై మెరుగైన ఆలోచనలు ఉంటాయి. శస్త్ర చికిత్స తప్పిపోవును. విమర్శలకు దూరంగా ఉంటారు. జ్ఞాపక శక్తితో ముఖ్యకార్యక్రమాలు నెరవేరును. నూతన ప్రయత్నములలో సులువుగా విజయం చేకూరును. కూడా గత మాసపు అనుకూల ఫలితాలు కొనసాగును. ధనాదాయం సామాన్యం. కుటుంబంలోని పెద్ద వయస్సు వారికి ఆరోగ్య భంగములు. వృత్తి వ్యాపారాలలో చక్కటి ధన ఆదాయం. చండి లేక సుదర్శన హోమం జరిపించుకొండి ప్రతికూలాలు శుభాలుగా మారుతాయి. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.

English summary
A lunar eclipse that occurs on Sunday, July 5, 2020, has nothing to do with eclipse.These eclipses are of two types. The first is the shadow eclipse, the second is called the eclipse
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X