వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆషాఢంలో కొత్తజంట కలిసుండకూడదంటారు ఎందుకు ? ఆత్తాకోడళ్లు కూడానా ?

ఆషాఢం వర్షఋతువుని ఆరంభిస్తూ వచ్చే మాసం ఇది. ఈ మాసంలో దంపతులకి, ప్రత్యేకంగా కొత్త దంపతులకి ఈ మాసం కొన్నికారణాల చెత దూరంగా ఉండమన్నారు, అలాగే అత్తా కోడల్ని కూడా దూరంగా ఉండమంటారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆషాఢం వర్షఋతువుని ఆరంభిస్తూ వచ్చే మాసం ఇది. ఈ మాసంలో దంపతులకి, ప్రత్యేకంగా కొత్త దంపతులకి ఈ మాసం కొన్నికారణాల చెత దూరంగా ఉండమన్నారు, అలాగే అత్తా కోడల్ని కూడా దూరంగా ఉండమంటారు.

సేద్య, రోగ, ప్రసూతి, ధర్మములు అనే నాలుగు కారణాలుగా ముఖ్య కారణాలున్నాయి.

సేద్య

పూర్వకాలమునుండి ఉన్న ఆచారం ప్రకారం మనది వ్యవసాయ ఆదారిత దేశం. ఇక్కడ ఎక్కువగా పంటలు పండించేవారే ఎక్కువ. అప్పటి కీవన విధానాన్ని బట్టి. వర్షాకాల ప్రారంభమైన ఈకాలంలో, వరద, చేనుకి నీటి పెట్టడం, గట్టు కట్టడం, వంటి అనేక వ్యవసాయపనులలో ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు వెళ్లాలో తెలియదు, అలాంటప్పుడు కొత్తపెళ్లి కొడుకు అంత తొందరగా భార్యని వదిలి రాకపోవచ్చు. అలాంటప్పుడు ముందు పని చెడిపోతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా దంపతులని దూరంగా ఉండమంటారు.

astrologer tells about Ashadam

రోగం

ప్రతీ ఋతువులోను వాతావరణంలో ఏర్పడే ఒక ప్రత్యేక మార్పు కొన్ని క్రిములని పుట్టిస్తాయి. వీటివల్ల కొన్ని పండ్ల వంటివి కొన్ని చెట్లకి ఏర్పడతాయి. అలాంటివి కొన్ని వాతావరణంలో పుట్టి వేర్వేరు జీవుల వలన అంటురొగాలు పుడతాయి. లైంగిక విషయాలలో దూరంగా ఉండకపోతే దంపతులకి అంటురోగాలు వాటిల్లే అవకాశాలున్నాయి. కాబట్టి అలా జరగకుండా దంపతులని దూరంగా ఉంచుతారు.

ప్రసూతి

ఈ ఆషాఢంలో గనక గర్భం ధరిస్తే పుట్టబోయేబిడ్డ తర్వాతి సంవత్సరం వేసవిలో జన్మిస్తాడు. అది శిశువుకి కొంత అనారోగ్య కరం, సరిగ్గా రోగనిరోధక శక్తి లేని బిడ్డని కాపాడటం కొంత కష్టమవుతుంది. కాబట్టి దానికి ముందు నివారణ చర్యగా ముందుగా అలాంటివి జరగకుండా దంపతులని దూరంగా ఉండమంటారు.

ధర్మములు

అప్పుడే వివాహమైన కొత్త కోడలు కొంతకాలం అత్తగారి దగ్గర ఉండి మళ్లీ పుట్టింటికి వెళుతుంది. దానివల్ల కొత్తగా ఉన్న భయము పోగొట్టడానికి తల్లిదగ్గర కొంత కౌన్సిలింగ్‌ వంటివి తీసుకొనడానికి వీలవుతుంది.

తెలియనివి నేర్చుకొనడానికి, కొత్త భయం పోయేలాగా ఆ కోడలికి తల్లి నేర్పుతుంది, దానివల్లమళ్లి తిరిగి వచ్చిన కోడలు మరింత మెరుగైన దాంపత్య, కుటుంబ జీవనాన్ని కొనసాగిమచడం కుదురుతుంది. దీనిని మనవారు మరొకలా మార్చి అత్తాకోడల్లు కలిసుండకూడదంటారు.

సంతాన యోగ్యత

మంచి సంతానం కావాలంటే ముందు కొంత కాలం బ్రహ్మచర్యం పాటించాలి, ఎక్కువగా వ్రతాలు పాటించాలి, దానివల్ల మంచి సంతానం కలుగుతుంది. ఇలా జన్మించిన సంతానం తల్లిదండ్రులని లోకాన్ని కూడా ఉద్ధరిస్తాడు. కాబట్టి చెడు దృష్టితో విశ్వాసాన్ని వెక్కిరిమచకుండా అందులోని శాస్త్రీయతని తెలుసుకుని పాటిద్దాం.

English summary
Astrologer described about Ashadam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X