వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచే: దక్షిణాయనం విశేషాలు

ఈ రోజు నుండి దక్షీణాయన పుణ్య కాలం మొదలు (కర్కాటక సంక్రమణం) 16-7-2017 కాలమును రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ రోజు నుండి దక్షీణాయన పుణ్య కాలం మొదలు (కర్కాటక సంక్రమణం) 16-7-2017 కాలమును రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశినుండి మరొక రాశిలోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారుటనే సంక్రమణం అంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోను సూర్యుడు ఒక మాసముంటాడు. సూర్యుడు కర్కాటకరాశియందు ప్రవేశించినది మొదలు మకరరాశియందు ప్రవేశించు వరకు గల మధ్యకాలము దక్షిణాయనము. దక్షిణాయనమనగా భూమధ్యరేఖకు దక్షిణమున సూర్యుడు సంచరించు కాలము. ఈ రోజు నుండి పుష్యమాసము వరకు ఆరు నెలలు ఉండును.

ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు. 16-07-2017 న కటక సంక్రమణం. ఆనగా దక్షిణాయన పుణ్య కాలం. సూర్యుడు కర్కాటక రాశిలొ ప్రవెశిస్తాడు. నేటి రాత్రి నుండి దక్షిణాయనం. కాబట్టి సంధ్యావందన, పూజా సంకల్పాలలొ ఇక పిదప 'దక్షిణాయనే' అని చెప్పాలి. సూర్యుడు మేషం, వౄషభం ఇలా ఆయా రాసులలొ ప్రవేశించే సమయం సంక్రాంతి సమయం. అలా మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయి.

Astrologer described about Dakshinayanam.

అన్ని సంక్రమణ సమయాలూ పుణ్య కాలాలే. కాని మిగిలిన మేషాది సంక్రాంతుల కంటె ఈ కటక సంక్రమణ కాలం విశేషమైనది. దీని కంటే మకర సంక్రమణ కాలం మరీ విశేషమైనది. సంక్రమణ సమయములొ స్నాన, దానాలు చెయాలి. తండ్రి లేని వారు పితృదేవతలకు తిల తర్పణాలు వదలాలి. కర్కాటక సంక్రమణం రోజున వరాహ స్వామి పూజ, ఉపవాసం కర్తవ్యాలు. సంక్రమణం రా.తె. 4.-6 గం. కి జరుగుతొంది. కావున శిష్టాచారం పాటింపదలచిన వారు అప్పుడే స్నానం చేయటం మేలు. సామాన్యులు సోమవారం రోజు ఉదయం సంక్రమణ స్నానం చేయవచ్చు... సంక్రమణ తిల తర్పణాలు 17 వ తేదీనే చేయాలి. తిల తర్పనలు ఇచ్చిన రోజు శుచిగా ఒంటి పూట భోజనం చేయాలి.

ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడి గమనంలో కలిగిన మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని మనకు తెలుసు. కానీ మనం సూర్యోదయాన్ని గమనిస్తే, అది సరిగ్గా తూర్పు దిశలో జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది సంవత్సరంలో 2 రోజులు మాత్రమే. మొదటిది సెప్టెంబరు 23, రెండవది మార్చి 21. మిగితా రోజులలో 6 నెలల కాలం కాస్త ఈశాన్యానికి దగ్గరగానూ, మరో 6 నెలల కాలం ఆగ్నేయానికి దగ్గరగానూ సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయనం' అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.

ఆధ్యాత్మికంగా చెప్పుకోలవలసి వస్తే ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇటువంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సహాయం బాగా అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో అనేక ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం కూడా అయ్యింది. సంవత్సరంలో ఉత్తారాయనానికి ఎంత విశిష్టత ఉందో, దక్షిణాయనానికి కూడా అంతే ఉంది. రెండు కాలపురుషుని అంతర్భాగాలే.

శాస్త్రీయంగా చూసినప్పుడు దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీదకు తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా ప్రజలలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడం కోసం ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరున మన పాటించే నియమాలు రోగనిరోదక శక్తిని పెంచి, ఆయుషును వృద్ది చేస్తాయి.

దక్షిణాయనంలో బ్రహ్మచర్యానికి ఆయుర్వేదం అత్యంత ప్రాముఖ్యతనిచ్చింది. ఆయుర్వేదం వేరు, ధర్మశాస్త్రం వేరు కాదు. ఆయుర్వేదం కూడా ధర్మశాస్త్రంలో ఒక భాగమే. దక్షిణాయనంలో ధాతువులను రక్షించుకోవాలి, వృధా చేసుకోకూడదు. ఈ సమయంలో ధాతువులను వృధా చేసుకోవడం వలన రోగాల బారిన పడతారని, ఆయుఃక్షీణమని ఆయుర్వేదం చెప్తోంది.

ఎలా చూసిన దక్షిణాయనంలో మనం చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.

English summary
Astrologer described about Dakshinayanam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X