వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళి పూజ విధానం: ఏం చేయాలి, ఏం చేయకూడదు?

దీపావళి పర్వదినం సందర్భంగా జ్యోతిష్కులు పండగ విశేషాలను వివరించారు.దీపావళి నిత్య కృత్యాలు:ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది.కొత్త బట్టలు కట్టుకోవడం కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా జ్యోతిష్కులు పండగ విశేషాలను వివరించారు.
దీపావళి నిత్య కృత్యాలు:
ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది.
కొత్త బట్టలు కట్టుకోవడం కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం మంచిది.

ఈరోజు చేయకూడనిది:
మద్యమాంసాలను తీసుకోవడం పగలు పూట నిద్రపోవడం.

ఈ రోజు ఇంటిలో ఏర్పాట్లు :
గుమ్మాలకు తోరణాలు ధరింపజేయడం ఇంటిలో దేవుడి పటానికి బొట్టు పూలతో అలంకరించి పూజించడము.

పూజించే విధానం:

ఇంట్లో పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరవాలి, దానిపైన దాన్యాన్ని పోయాలి, దారంతో చెప్పిన కలశాన్ని అలంకరించి కొబ్బరికాయతో స్థాపన చేయాలి.
లక్ష్మీదేవి ఫోటోలు పెట్టాలి.

అమ్మ వారికి ధరింప చేయవలసినవి కాటుక అద్దం చెక్క దువెన ఎరుపు రంగు గాజులు మొదలైన అలంకరణ సామాగ్రి.

అభిషేకము పంచామృతంతో చేయాలి అనగా ఆవుపాలు ఆవుపెరుగు ఆవునెయ్యి తేనె మరియు పంచదారలతో అభిషేకించాలి.

అమ్మవారికి చేయవలసిన నైవేద్యము
కొబ్బరికాయ అరటిపండ్లు పాయసాన్నము పంచఫలములు అనగా అయిదు రకాల పండ్లు అమ్మవారికి నివేదించాలి.

Astrologer described about Deepavali festival arrangements.

మారేడు పత్రితో లక్ష్మీదేవిని పూజించడం మరింత శుభకరం.
కర్పూర హారతి తో లక్ష్మీ దేవి మంగళ హారతి పాట పాడాలి.
వ్యాపార గృహం అయినట్లయితే మంచి గుమ్మడితో దిష్టితీసి కొట్టాలి.

అమ్మవారి పూజ విధానం అందరూ చేయదగిన విధంగా కింద అందించాము.
మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి
లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే
శ్రీ మహాలక్ష్మీ నమః ధ్యాయామి. నమస్కరించాలి
శ్రీ ధనలక్ష్మ్యై నమః ఆవాహయామి అక్షతలు వేయాలి
శ్రీ ధనలక్ష్మీ నమః ఆసనం సమర్పయామి పీటను ముట్టుకోవాలి
శ్రీ ధనలక్ష్మీ నమః పాద్యం సమర్పయామి నీటిని చల్లాలి
శ్రీ ధనలక్ష్మీ నమః అర్ఘ్యం పరికల్పయామి నీటిని చల్లాలి
శ్రీ ధనలక్ష్మీ నమః ఆచమనీయం సమర్పయామి నీళ్లను కింద వదలాలి
శ్రీ ధనలక్ష్మీ నమః స్నానం పరికల్పయామి పంచామృతంతో లేదా నీళ్లతో అమ్మవారి ఫోటో మీద చల్లాలి.
శ్రీ ధనలక్ష్మీ నమః వస్త్రం సమర్పయామి అమ్మవారికి మనకు తోచిన వస్త్రాన్ని సమర్పించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః ఆభరణం పరికల్పయామి గాజులు బొట్టు మొదలైనవాటిని అమ్మవారిని ముందు ఉంచాలి
శ్రీ ధనలక్ష్మీ నమః గంధం సమర్పయామి చందనాన్ని అమ్మవారి మీద చల్లాలి
శ్రీ ధనలక్ష్మీ నమః అలంకరణం సమర్పయామి అలంకరణ కోసం పసుపు కుంకుమ పువ్వుతో చల్లాలి
శ్రీ ధనలక్ష్మీ నమః పుష్పాణి సమర్పయామి పువ్వులని పూలమాలని కలశానికి పటానికి అలంకరించాలి.
శ్రీ ధనలక్ష్మీ నమః ధూపం సమర్పయామి అగరవత్తుల పొగని చూపించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః దీపం దర్శయామి దీపాన్ని అమ్మవారికి చూపించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః నైవేద్యం సమర్పయామి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్క నీ తాంబూలంగా అమ్మవారికి సమర్పించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః నీరాజనం దర్శయామి కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి
శ్రీ మహాలక్ష్మ్యై నమః మంత్ర పుష్పం పరికల్పయామి అమ్మవారిికి పుష్పాలను సమర్పించాలి
శ్రీ మహాలక్ష్మ్యై నమః ప్రదక్షిణం సమర్పయామి అమ్మవారి ముందు నిలబడి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి
అక్షతలు నీళ్ళు వదులుతూ ఈ మాట చెప్పాలి
అనేన మహాలక్ష్మీ పూజయాచ జగదంబ అర్పణ మస్తు.
తన పూజతో ఆనందించమని ఈ కింది విధంగా ప్రార్ధన చేయాలి.

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వద
ఈ విధంగా పూజించిన తర్వాత వ్యాపారులు డబ్బులని ఉంచే కౌంటర్ ని పూజించాలి అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి దిష్టి తియ్యాలి.
ఈ ఆ విధంగా అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీదేవి పూజ పూర్తయినట్లు.

దీపావళి పూజ ఏర్పాట్లు, పూజా విధానం

దీపావళి నిత్య కృత్యాలు:
ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది
కొత్త బట్టలు కట్టుకోవడం కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం మంచిది
ఈరోజు చేయకూడనిది:
మద్యమాంసాలను తీసుకోవడం పగలు పూట నిద్రపోవడం.
ఈ రోజు ఇంటిలో ఏర్పాట్లు :
గుమ్మాలకు తోరణాలు ధరింపజేయడం ఇంటిలో దేవుడి పటానికి బొట్టు పూలతో అలంకరించి పూజించడము.
పూజించే విధానం,
ఇంట్లో పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరవాలి, దానిపైన దాన్యాన్ని పోయాలి, దారంతో చెప్పిన కలశాన్ని అలంకరించి కొబ్బరికాయతో స్థాపన చేయాలి.
లక్ష్మీదేవి ఫోటోలు పెట్టాలి.
అమ్మ వారికి ధరింప చేయవలసినవి కాటుక అద్దం చెక్క దువెన ఎరుపు రంగు గాజులు మొదలైన అలంకరణ సామాగ్రి.
అభిషేకము పంచామృతంతో చేయాలి అనగా ఆవుపాలు ఆవుపెరుగు ఆవునెయ్యి తేనె మరియు పంచదారలతో అభిషేకించాలి.
అమ్మవారికి చేయవలసిన నైవేద్యము
కొబ్బరికాయ అరటిపండ్లు పాయసాన్నము పంచఫలములు అనగా అయిదు రకాల పండ్లు అమ్మవారికి నివేదించాలి.
మారేడు పత్రితో లక్ష్మీదేవిని పూజించడం మరింత శుభకరం.
కర్పూర హారతి తో లక్ష్మీ దేవి మంగళ హారతి పాట పాడాలి.
వ్యాపార గృహం అయినట్లయితే మంచి గుమ్మడితో దిష్టితీసి కొట్టాలి.

అమ్మవారి పూజ విధానం అందరూ చేయదగిన విధంగా కింద అందించాము.
మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి
లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే
శ్రీ మహాలక్ష్మీ నమః ధ్యాయామి. నమస్కరించాలి
శ్రీ ధనలక్ష్మ్యై నమః ఆవాహయామి అక్షతలు వేయాలి
శ్రీ ధనలక్ష్మీ నమః ఆసనం సమర్పయామి పీటను ముట్టుకోవాలి
శ్రీ ధనలక్ష్మీ నమః పాద్యం సమర్పయామి నీటిని చల్లాలి
శ్రీ ధనలక్ష్మీ నమః అర్ఘ్యం పరికల్పయామి నీటిని చల్లాలి
శ్రీ ధనలక్ష్మీ నమః ఆచమనీయం సమర్పయామి నీళ్లను కింద వదలాలి
శ్రీ ధనలక్ష్మీ నమః స్నానం పరికల్పయామి పంచామృతంతో లేదా నీళ్లతో అమ్మవారి ఫోటో మీద చల్లాలి.
శ్రీ ధనలక్ష్మీ నమః వస్త్రం సమర్పయామి అమ్మవారికి మనకు తోచిన వస్త్రాన్ని సమర్పించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః ఆభరణం పరికల్పయామి గాజులు బొట్టు మొదలైనవాటిని అమ్మవారిని ముందు ఉంచాలి
శ్రీ ధనలక్ష్మీ నమః గంధం సమర్పయామి చందనాన్ని అమ్మవారి మీద చల్లాలి
శ్రీ ధనలక్ష్మీ నమః అలంకరణం సమర్పయామి అలంకరణ కోసం పసుపు కుంకుమ పువ్వుతో చల్లాలి
శ్రీ ధనలక్ష్మీ నమః పుష్పాణి సమర్పయామి పువ్వులని పూలమాలని కలశానికి పటానికి అలంకరించాలి.
శ్రీ ధనలక్ష్మీ నమః ధూపం సమర్పయామి అగరవత్తుల పొగని చూపించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః దీపం దర్శయామి దీపాన్ని అమ్మవారికి చూపించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః నైవేద్యం సమర్పయామి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్క నీ తాంబూలంగా అమ్మవారికి సమర్పించాలి
శ్రీ ధనలక్ష్మీ నమః నీరాజనం దర్శయామి కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి
శ్రీ మహాలక్ష్మ్యై నమః మంత్ర పుష్పం పరికల్పయామి అమ్మవారిికి పుష్పాలను సమర్పించాలి
శ్రీ మహాలక్ష్మ్యై నమః ప్రదక్షిణం సమర్పయామి అమ్మవారి ముందు నిలబడి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి
అక్షతలు నీళ్ళు వదులుతూ ఈ మాట చెప్పాలి
అనేన మహాలక్ష్మీ పూజయాచ జగదంబ అర్పణ మస్తు.
తన పూజతో ఆనందించమని ఈ కింది విధంగా ప్రార్ధన చేయాలి.

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వద
ఈ విధంగా పూజించిన తర్వాత వ్యాపారులు డబ్బులని ఉంచే కౌంటర్ ని పూజించాలి అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి దిష్టి తియ్యాలి.
ఈ ఆ విధంగా అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీదేవి పూజ పూర్తయినట్లు.

English summary
Astrologer described about Deepavali festival arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X