వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవీ నవరాత్రుల ప్రత్యేకం: 9రోజులపాటు విశేష పూజలు ఇలా

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దేవీ నవరాత్రుల ప్రత్యేకతను వివరించారు జ్యోతిష్కుడు. ఆ వివరాల్లోకి వెళితే..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Simple Prasads for Nine days of Navratriనవరాత్రుల కోసం సులువైన 'నైవేద్యాలు' మీకోసం | Oneindia Telugu

హైదరాబాద్: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దేవీ నవరాత్రుల ప్రత్యేకతను వివరించారు జ్యోతిష్కుడు. ఆ వివరాల్లోకి వెళితే..

శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.

భద్రపదంలో వినాయక నవరాత్రులు ముగిసిన పక్షానికి శరద్రుతువులో ఆశ్వీయుజమాసం ప్రారంభం మొదలుకొని 9రాత్రులు నవరాత్రలుగా జరిపి, పదవరోజు ఉదయం శమీ పూజతో ఆద్వాసన చేయడం పరిపాటి. వివిధ రోజులలో వివిధ పద్ధతులలో అలంకారాలు నివేదించి అమ్మవారికి వివిధ పద్ధ తులలో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటం పరిపాటి. పాఠకుల సమాచారం కొరకు అన్ని వివరాలు ఒకేచోట ముందుగానే అందించడం జరుగుతుంది.

21.09.2017 న అలంకారం బాలా త్రిపుర సుందరీ అలంకారం నైవేద్యం - పులగం
22.09.2017 న అలంకారం గాయత్రీ దేవి అలంకారం నైవేద్యం - పులిహోర
23.09.2017 న అలంకారం మహాలక్ష్మి దేవి అలంకారం నైవేద్యం - వడపప్పు, పానకం
24.09.2017 న అలంకారం అన్నపూర్ణ అలంకారం నైవేద్యం - పరమాన్ణం, బూరెలు
25.09.2017 న అలంకారం లలితా దేవి అలంకారం నైవేద్యం - పెసర బూరెలు, పరమాన్నం
26.09.2017 న అలంకారం శాకంబరీ అలంకారం నైవేద్యం - శకాన్నం (కూర అన్నం)
27.09.2017 న అలంకారం సరస్వతీ దేవి అలంకారం నైవేద్యం - క్షీరాన్నం
28.09.2017 న అలంకారం దుర్గాదేవి అలంకారం నైవేద్యం - నిమ్మకాయ పులిహోర
29.09.2017 న అలంకారం మహిషాసుర మర్దినీ అలంకారం నైవేద్యం -చలివిడి, వడపప్పు, పానకం
30.09.2017 న అలంకారం రాజరాజెశ్వరి అలంకారం

Astrologer described about Devi Navratri festival speciality.

కుమారీ పూజ ప్రతీ రోజు చేయవచ్చు,
శమీపూజ 30.వ తేదీన చేయాలి,
ఆయుధ పూజని కొందరు దుర్గాష్టమి రోజున 28వ తేదీన మరికొందరు దసరా రోజున చేస్తారు.
చండీ, దుర్గా హోమాలు 28 వ తేదీన చేయడం మంచిది.
శాకంబరీ అలంకారం రోజున అమ్మవారికి వివిధ రకాలైన, కూరగాయలతో మాలలు చేసి అలంకరించాలి.

నవదుర్గలు
ప్రథమం శైల పుత్రీతి - మొదటి రోజు శైపుత్రి
ద్వితీయం బ్రహ్మచారిణీ - రెండు బ్రహ్మచారిణి
తృతీయస్తు చంద్ర ఘంటే - మూడు చంద్రఘంటా
కూష్మాండేతు చతుర్థకీ - నాల్గవరోజు కూష్మాండా
పంచమం స్కందమాతేతి - ఐదు స్కందమాత
షష్ఠం కాత్యాయనీ తిచ - ఆరవరోజు కాత్యాయని
సప్తమం కాలరాత్రీచ - ఏడవరోజు కాలరాత్రి
మహాగౌరీతి చాష్టమం - ఎనిమిదవ రోజు మహా గౌరీ
నవమం సిద్ధి దాత్రీచ - చివరగా స్ధిదాత్రిగా 9వరోజున అమ్మవారి
నవదుర్గా: ప్రకీర్తిచ - మూర్తులు చెప్ప బడుతాయి.
విజయ దశమిన అమ్మవారిని నియమంగా పూజించి అమ్మవారిని అద్వాసన చెప్పి మూర్తిని నిమజ్జన చేస్తారు.

1.శైలపుత్రి
నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికి పూజలు, ఉపాసనలు జరుపబడును.
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరామ్‌
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్‌

2.బ్రహ్మచారిణి
దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపమే ఉపాసింపబడును.
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా

3.చంద్రఘంట
దుర్గామాతయొక్క మూడవశక్తినామము చంద్రఘంట నవరాత్రోత్సవములలో మూడవరోజున ఈమె విగ్రహమునకే పూజాపురస్కారములు జరుగును.
పిండజప్రవరారుఢా చండకోపాస్త్రకైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా

4.కూష్మాండ
దుర్గామాతయొక్క నాల్గవ స్వరూప నామము కుష్మాండ.
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ దధానా
హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే

5.స్కందమాత
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా
శుభద్కాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ
మూలా నక్షత్రం -
సరస్వతీం చతాం నౌమి వాగధిష్ఠాతృ దేవతాం
దేవత్వం ప్రతిపద్యంతే యదనుగ్రహతో జనా:

6.కాత్యాయని
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ
విజయ దశమి ( ఆయుధపూజ, శమీపూజ విధానములు )
యాదేవీ సర్వరూభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై సమస్తస్యై సమస్తస్యై నమో నమః
అనేక ప్రాంతాలలో అనేక రూపాలతో పూజించే అమ్మవారిని దక్షిణ భారత దేశంలో, అలంకారాలతో పూజిస్తారు.

7. కాళరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ
వామపాదోల్లపల్లోహలతాకంటక భూషణా వర
మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ

8.మహాగౌరి
దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపమునకు మహాగౌరి అని పేరు.
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి
మహాగౌరీ శుభం దద్యాత్‌, మహాదేవప్రమోదదా

9.సిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యై, అసురైరమరైరపి సేవ్యమానా
సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ.

English summary
Astrologer described about Devi Navratri festival speciality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X