వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవీ నిత్యకర్మానుష్ణానము ఏవిధంగా చేసుకోవాలి?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీదేవీ నిత్యకర్మానుష్ణానము ఏ విధంగా చేసుకోవాలనేదానిపై జ్యోతిష్కులు ఇలా వివరించారు..

బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, స్నానాదికములు ముగించుకొని, పూజాగృహంలో ప్రవేశించి, గురువును ప్రార్ధించి, శ్రీసూక్తవిధానంగా అమ్మవారిని సహస్రనామాలతో, త్రిశతీ నామాలతో, ఖడ్గమాలతో, అష్ణోత్తర శతనామాలతో అర్చన చేసి.. చలివిడి, వడపప్ప, పానకము, ఫలములు నివేదనచేసి.. మంగళహారతిచ్చి పూజ ముగించి సహస్రనామ, త్రిశతీనామ, అష్ణోత్తరశతనామ స్తోత్ర పారాయణములు చేయాలి.

కవచ, మాల, తైలోక్య విజయ, మంత్రాదులను పారాయణం చేసి, గురువు ప్రసాదించిన మహామంత్రాన్ని వెయ్యిమార్లుగానీ, ఐదువందల మార్లుగానీ, మూడువందల మార్లుగానీ, 108 మార్లుగానీ జపించి, అమ్మవారియొక్క దివ్యమంగళ స్వరూపాన్నిధ్యానించి, పూజామందిరం నుండి బయటకు వచ్చి మనయొక్క వృత్తిధర్మాలను నిర్వర్తించుకోవాలి.

astrologer tells about devi navratri worship

త్రికాలములలో సంధ్యావందనం ఆచరిస్తూ, రాత్రికాలంలో ఇదేవిధంగా పూజ, సోత్ర, జప, ధ్యానాదులను నిర్వహించుకొనిన విశేషాతివిశేష ఫలము లభిస్తుంది. మన శక్తినిబట్టి ఈ కర్మానుష్ణానము చేసుకొనవలెను. శ్రీచక్రనవావరణార్చన, సౌందర్యలహరి, చండీసప్తశతి, దేవీభాగవత, దేవీభాగవతాది పారాయణలు, శక్యానుసారంగా నిర్వహించుకొనవచ్చును. సమయాన్ని వృధాచేయక ఏదోవిధంగా అమ్మ ఉపాసన చేయుటకే ప్రయత్నం చేయాలి.

ఆసనము ఎలా ఉండాలి ?

తిష్ట కుదిరితేగానీ నిష్ట కుదరదన్నారు పెద్దలు. అందుచేత మనము సుఖాసనాసీనులమై పూజ, స్తోత్ర, జప, ధ్యానాదులను నిర్వహించుకోవాలి. మనము అధిష్టించే పీఠము భూమికి 9 అంగుళాలు ఎత్తులో ఉండేటట్లుగా చెక్కతో తయారు చేయించుకొని, దానిపై కూర్మయంత్రాన్ని లిఖించి, దానిపై దర్భాసనము వేసుకొని, దర్భాసనముపై చిత్రాసనము వేసుకొని, చిత్రాసనముపై తెల్లని ధావళిని వేసుకొని మన ఆసనాన్ని సిద్ధం చేసుకోవాలి. పీఠం తయారుచేసే విషయంలో ఇనుపమేకులు వాడకుండా జాగ్రత్తపడాలి. పీఠంయొక్క నాలుగు కోళ్లు పులిపాదాలతో వుండాలి. ఈ చెక్కకు ఎర్రచందనము, చందనము, పనస, నేరేడు, టేకు, గుగ్గిలము, నల్ల విరుగుడు చేవ కలపను వాడాలి.

అమ్మవారివద్ద ఏవిధంగా దీపారాధన చేయాలి?

నిత్యమూ మనము చేయు దీపారాధన వల్ల మన ఆత్మజ్యోతి ప్రకాశిసూ మనము నిర్వహించే పూజ, స్తోత్ర, జప ధ్యానాదులు అఖండ ఫలాన్నిస్తాయి. అమ్మవారికి కుడివైపు ఆవునెయ్యితో తెల్లని గుడ్డ వత్తి వేసి, ఎడమవైపు నూపప్ప నూనెతో ఎర్రగుడ్డ వత్తి వేసి దీపారాధన చేయాలి. దీపారాధన అగ్గిపుల్లతో చేయరాదు. అగ్గిపుల్ల వెలిగించి, దానిద్వారా కైవత్తినిగానీ, అగరుబత్తినిగానీ వెలిగించి దీపారాదన చేయాలి. దీపారాధన చేసిన అనంతరం దీపారాధన కుంది మొదట్లో, పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు ఉంచి నమస్కరించాలి.

అమ్మవారి మహామంత్ర జపానికి ఏ జపమాలలు ఉపయోగించాలి?

అమ్మ జపానికి చందన, రక్తచందన, తులసి, స్పటిక, శంఖ, ముత్యాల, పగడాల, రుద్రాక్షమాలలను ఉపయోగించవచ్చు. అన్ని మాలల్లో కెల్లా రుద్రాక్షమాల జపం శ్రేష్టమైనది. ఏ మహామంత్రమైనప్పటికీ కూడా రుద్రాక్ష మాలతో చేయవచ్చు. 108 పూసలు గల మూల పూర్ణమాలగా, 54 పూసలుగల మాల అర్థమాలగా, 27 పూసలుగల మాల నక్షత్రమాలగా, 36 పూసలు కలిగి అర్ధపూసలేని మాల అక్షయమాలగా చెప్పబడుతున్నది. పూర్ణమాల పూర్ణఫలాన్ని అర్థమాల మధ్యమఫలాన్ని నక్షత్రమాల అధమఫలాన్ని అక్షయమాల అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తుంది. అక్షరలక్షలు జపం చేసే విషయంలో అడ్డపూస కలిగిన పూర్ణమాలను మాత్రమే ఉపయోగించుకోవాలి.
ఎందుకంటే ఇక్కడ సంఖ్య ప్రధానం. సిద్దిక్రమం పూర్తయిన పిదప అక్షయమాలను ఉపయోగించి, జపము చేసిన విశేషఫలం లభించును. జపమాల కుడిచేతి, నడిమివేలు, నడిమి కణుపుపై వుంచి, బొటనవ్రేలితో మనవైపుకు జపము చేయాలి. చూపుడువేలు, ఎడమచేయి జపమాలకు తగలకుండా జాగ్రత్తపడాలి. జపము చేయునపుడు జపమాల కంటికి కనపడరాదు. వస్త్రము కప్పిగానీ, గోముఖీ సంచిగానీ ఉపయోగించిగానీ జపము చేసిన విశేషఫలం కలుగుతుంది. జపము చేయునపుడు అడ్డపూసను దాటి చేయరాదు. జపమాలను వెనుకకు త్రిప్పి మరలా జపము చేయవలయును.

మంత్రాన్ని బయటకు ఉచ్ఛరిసూ జపాన్ని వాచక జపమని, మంత్రాన్ని నోట్లో చెప్పకుంటూ చేయు జపాన్ని ఉపాంశు జపమని, హృదయంలో మానసికంగా చేయు జపాన్ని మానసిక జపమని పిలుస్తారు. వాచక జపము అధమఫలాన్ని ఉపాంశు జపము మధ్యమఫలాన్ని మానసిక జపము అఖండఫలాన్ని ప్రసాదిస్తాయి. జపమాలను ముఖానికి ఎదురుగా ఉంచి జపము చేసినయెడల ఉత్తమఫలము, హృదయస్థానంలో ఉంచి చేసిన మధ్యమఫలము, నాభిస్థానంలో ఉంచి చేసిన అధమఫలము, నాభికి దిగువగా చేసేటటువంటి జపము అధమాతి అధమఫలాన్ని ఇస్తుంది. పై విషయాలన్నింటిని ధృష్టిలో ఉంచుకొని సప్రాంగములతో మహామంత్రసాధన చేయాలి.

English summary
Astrologer described about Devi Navratri worship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X