వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభప్రదం: ఫాల్గుణమాసం శ్రీ మహాలక్ష్మీ ని ఆరాధించండి!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫాల్లజోత్తరనాడు శ్రీ మహాలఆరాధన శుభప్రదం సంపత్ ప్రదమని పెద్దల మాట.లక్ష్మీలతో కూడిన నారాయణుడు. శ్రీలక్ష్మీసహిత నారాయణుడు సర్వవ్యాపకుడు కైలాసమున పార్వతీ దేవితో శంకరుడు ఈవిధముగ పల్కుచున్నాడు. కళ్యాణి ! పరమపురుషుడగు శ్రీమన్నారాయణుడు శ్రీమహాలక్ష్మితో కూడుట వలన గొప్పరూపము కలవాడయి, మితస్వరూపడయి, అనేక కోటి ಮಿನ್ಯಿಧಿು లంబోలిన సౌందర్యముగలవాడై లక్ష్మితో గూడి లోకముల రంజింపజేయుచు పరమపదమున నివసించుచున్నాడు.

శ్రీమహావిష్ణువును విడనాడని లక్ష్మీదేవియు నిత్యురాలు, సర్వవ్యాపకు రాలు, సకల లోకములకు నాయకురాలు, ఎల్లప్పడూ మంగళకరురాలు స్థావరజంగమాత్మమగు జగమంతయు ఆమె యొక్కకటాక్షమును ఆశ్రయించి యున్నది.

త్రిస్వరూపిణి శ్రీలక్ష్మీ మూడు స్వరూపములతో చూడదగిన, నారాయణుని భార్య, జగన్మాత, సమస్త జగత్తునకు ఆశ్రయమైయున్నవి. ఆ లక్ష్మీదేవియొక్క నేత్రోన్మీలన నిమోలనముల వలన జగత్తుయొక్క స్థితి లయములు జరుగుచున్నవి. సర్వజగత్మారణమై భూతయై పరమేశ్వరియైన మహాలక్ష్మి త్రిగుణాత్మకమైన ప్రకృతికి అధిష్ణానదేవత. చూడదగినదియు, చూడదగనిదియునైన స్వరూపముగల లక్ష్మి జగమంతటను వ్యాపించి యున్నది.

astrologer tells about goddess Lakshmi worship

శూన్యమయిన లోకమంతయు తన దయార్ధ దృష్టిచే కటాక్షించి స్వకీయ తేజస్సుచే నిండించెను. ఆ లక్ష్మియే తన యంశముచేత భూనీళారూపమును వహించియున్నది. జలాదిర సరూపముచే నీళాదేవిఆయెను. ధనవాగ్రూప ముల ధరించి లక్ష్మియాయెను. ఇట్లు శ్రీభూనీళారూపములగు మూడు స్వరూపముల నొందియున్న లక్ష్మీదేవి జగత్తును, భగవంతుని నాశ్రయించి యున్నది.

శ్రీమహాలక్ష్మీకటాక్షమునకై లక్షీస్తవము

ఓవరాననా ! సమస్త విద్యల భేదములును లక్ష్మీస్వరూపమే సమస్తము లగు స్త్రీరూపములు శ్రీమహాలక్ష్మీకి దేహము స్త్రీలయందుండునట్టి సౌంద ర్యము, సత్స్వభావము, సదాచారము, సౌభాగ్యము, రతిసుఖము ఇవన్నియు లక్ష్మీ స్వరూపమే. ఆ శ్రీమహాలక్ష్మీయొక్క కటాక్షమునందు పదివేలలో నొకపాలుచే జూడబడిన బ్రహ్మ రుద్రుడు, దేవేంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు, అగ్ని మొదలగువారు నిరవధికముగ ఐశ్వర్యమును పొంది యున్నారు.

English summary
Astrologer described about how to worship goddess Lakshmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X