వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇల్లు కట్టేటప్పుడు తప్పక పాటించవలసిన కీలక నియమాలు

గృహనిర్మాణము పూర్తిగా తాపీమేస్త్రీలు, వడ్రంగులపై ఆధారపడి యుండును. జనులు తమ గృహములుగాని, ఫ్యాక్టరీలుగాని, ఏ ఇతర నిర్మాణములు గాని నిర్మించుకొనునప్పడు ముఖ్యముగా విషయ పరిజ్ఞానము కలిగిన మేస్త్రీని ఎన్నుకొన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గృహనిర్మాణము పూర్తిగా తాపీమేస్త్రీలు, వడ్రంగులపై ఆధారపడి యుండును. జనులు తమ గృహములుగాని, ఫ్యాక్టరీలుగాని, ఏ ఇతర నిర్మాణములు గాని నిర్మించుకొనునప్పడు ముఖ్యముగా విషయ పరిజ్ఞానము కలిగిన మేస్త్రీని ఎన్నుకొని తమ నిర్మాణములు చేపట్టవలెను. లేకున్న ఆ గృహముల యొక్క మూలలు మరియు పటిష్టత సరిగా లేక అవి నరకప్రాయముగా తయారగును. గృహసని యొక్క డబ్బు ఖర్చయిపోయి, పైగా సమయము, జీవితము గూడ నిరర్ధకమగును.

1. గృహము నిర్మించునప్పడు స్థలమునకు ఈశాన్యము కొంచెము పెరుగు లాగున సరిచేయవలెను.
2. గృహనిర్మాణ సామాగ్రి అనగా ఇటుకలు, రాయి, ఇసుక, మొదలగునవి స్థలము యొక్క నైరుతి, దక్షిణ, పశ్చిమ దిశలయందుంచవలెను.
3. నిర్మాణ ప్రారంభము నైరుతి నుండి ప్రారంభించవలెను.
4. నిర్మాణములు పునాది నుండి తూర్పు, ఉత్తర, ఈశాన్యముల పల్లముగా నుండునటుల చూసుకొనవలెను.
5. నైరుతి గది అన్ని గదులకంటే ఎత్తుగాను, ఈశాన్యపు గది అన్ని గదులకంటే పల్లముగాను నుండునటుల నిర్మాణము చేయవలెను.
6. ద్వారములు, కిటికీలు ఉచ్ఛస్థానములో నమర్చవలెను.
7. ఇలునకు గాని, రూములకు గాని మూలలను గుండ్రముగా చేయదలచిన నైరుతి, వాయవ్య, ఆగ్నేయముల యొక్క మూలలను మాత్రమే రౌండుగా చేయవలెను. కాని ఈశాన్యమూల మాత్రము కోణముండు లాగుననే యుండవలెను. అది గుండ్రముగా చేయరాదు.
8. దూలముల యొక్క మొదళ్ళ దక్షిణ, పశ్చిమ దిశలలో, కొనలు తూర్పు, ఉత్తర దిశలలో వచ్చులాగున వేయవలెను.
దూలముల కొనలు గోడలుయొక్క గర్భము దాటి బయటికి వచ్చుట వాస్తు
విరుద్ధము. కావున వాటిని గోడలోనికి సరిపోవునట్లుగా చేయవలెను. ఈ విషయములో వేమన యోగి ఈ విధముగా చెప్పెను.

Astrologer described about house building instructions.

"దూలాలు వెలికి నుండిన
వాలాయము చేటువచు వసుమతిలోనన్
లోలాక్షివిడచిపెట్టిన
మేలిమిగా బ్రతకవచ్చు మేదిని వేమా!"
అనగా గృహము యొక్క దూలములు బయటికి పెరుగరాదు. మానవుడు భార్య విడిచిపెట్టినపుడైనను సుఖముగా బ్రతుకవచ్చును గాని దూలముగోడ దాటి పెరిగిన యింటిలో సుఖముగా నుండలేడని తాత్పర్యము.

ఇంటికి అమర్చు ద్వారముల, కిటికీల అలమారుల యొక్క కొలతలు - వెడల్పునకు రెట్టింపు పొడవుండవలెను.
గృహసులు అసలైన యీ విషయాలను వదిలి గృహములో నుండు కిటికీలు, ద్వారాలు మరియు అలమారాలయొక్క సంఖ్య ముఖ్యమని భావించుచున్నారు. కాని అది ముఖ్యమైనది కాదు. అది ఏ సంఖ్యలోనైన నుండవచ్చు. అవియుండు స్థానములే ముఖ్యమని తెలియవలెను.

పని పూర్తి అయి ఇంటికి వెళ్ళేముందు దక్షిణ, పశ్చిమ గోడలు, తూర్పు, ఉత్తర గోడల కన్నా కొంత ఎత్తు ఉండేటటు చూచుకొనవలెను. అటు లేకున్న పని ఆగిపోవడమో లేక ఇతర కారణముల వలన నిర్మాణము ఆగిపోవడమో జరుగును. ఈ విషయంలో గృహసులు జాగ్రత్తగా యుండవలెను.

ఇంటి లెంటల్ లెవెల్లో పోర్టికో మాదిరిగా వేయునపుడు ఇంటి ఈశాన్యం తెగిపోకుండ జాగ్రత్తపడాలి. గృహసుడు తమ ఇంటి పై కప్ప విషయంలో ఆర్.సి. క్లాబ్గాని, కట్టె కప్పగాని వేయునపుడు వర్షపు నీరు తూర్పు - ఉత్తర ఈశాన్యాలు పారు విధంగా వేయవలెను.

English summary
Astrologer described about house building instructions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X