వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థలం కొనేముందు ఇలా చేయండి: అంతా మంచే జరుగుతుంది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాస్త్రపరంగా ప్లాన్ చేసి గృహనిర్మాణం చేపట్టిన గృహసుడు తనకంటూ కొన్ని విషయాలు గృహనిర్మాణం గురించి తెలుసుకొని యుండవలెను. ఎందుకంటే గృహం నిర్మించే ఇంజినీర్ గానీ, వాస్తు సలహాదారుగానీ ఇంటికి ప్రతిరోజు రావడానికి వీలు కుదరదు.

గృహం నిర్మించే ముందు ఆ స్థలం యొక్క అష్టదిశల్ని స్పష్టంగా సరిచూసుకోవలెను. మూలలయొక్క కొలతల్లో లోపాలుంటే ఇంటివారికి కలతలు తప్పవు. కావున మూలలు నిరుష్టంగా నిర్ధారణ చేసుకోవలెను.

2. ముందు ప్లాటు చుటూ ప్రహరి నిర్మించవలెను.
3. ప్రహరి నిర్మాణమునకు, గృహ నిర్మాణమునకు పునాది తవ్వకం ఈశాన్యము
నుండి మొదలు పెట్టి చివరగా నైరుతి మూల త్రవ్వవలె, కట్టడం మాత్రము నైరుతి మూల మొదలు పెట్టవలెను.
4. గృహనిర్మాణానికుపయోగించు రాయి, ఇటుక, సిమెంటు, ఇసుక మొదలగు
వాటిని ప్లాటుకు పశ్చిమము లేదా దక్షిణ భాగములో గాని, మీ ప్రక్క ప్లాటుల్లో గాని వేసుకోవలెను.
ప్లాటు ఏ దిశ కూడా తెగి యుండకూడదు.
ఇంటి ముందు ఒక్క రోడు కాకుండా, ఇంటికి నలువైపులలో రెండుగాని, మూడుగాని మరియు నాలుగు రోడు ఉన్నచో మంచిది.

 astrologer tells about how to purchase land

స్థలము పశ్చిమం ఎత్తుగా యుండి తూర్పు వాలుగా యుండవలెను. దక్షిణం ఎత్తుగా యుండి తూర్పు వాలుగా ఉండవలెను. నైరుతి ఎత్తుగా నుండి ఈశాన్యము వాలుగా ఉండవలెను. తూర్పు ఉత్తర ఈశాన్యాలు తప్ప మరే దిక్కులు పెరిగి యుండరాదు. చెడు వీధి పోటు తగులకుండా చూసుకోవలెను.

మీ ఇళ్లకు ఉన్నఖాళీస్థలాలు దక్షిణ, పశ్చిమాలందు ఉత్తరము తూరుతూర్పల కంటే ఎక్కువగా యున్న వాటిని తగ్గించి గోడలలో గాని, కంచెలోగాని వేరుచేసి ఆ స్థలములో ఏదైనా షెడ్డుగాని వేయవలెను లేదా అమ్మివేయవలెను.

మనం ఎన్నుకొన్న ప్లాటు సమతలంగా యున్నా మంచిదే. ముక్కోణపు ప్లాటును ఎప్పడు గృహ నిర్మాణమునకు ఎన్నుకొనకూడదు. మనము గృహమునకు ఏ సింహద్వారమైనా శాస్త్ర సమ్మతముగా నిర్మించిన మంచి ఫలితములు ఇచ్చును.
ఒంటరిగా గృహము నిర్మించునపుడు ప్లాటును, గృహమునకు దిక్సూచితో దిక్కులు సరిచేసి గృహము నిర్మించవలెను.

స్థలాలు ఇతర దిశలందు మెరకగా యుండి, ఉత్తర, తూర్పు, ఈశాన్యాలు పల్లముగా యున్న గృహము నిర్మించవచ్చును. గోతులు, నైరుతి, పడమర వేపు యున్న స్థలాలు గృహ నిర్మాణమునకు పనికిరావు.

English summary
Astrologer described how to purchase new land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X