వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకం దాసోహం: లక్ష్మీ అనుగ్రహమంటే ఏంటో తెలుసా!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మీకు బలం లేకపోయినా పదిమంది బలవంతులు మీ వద్ద చేతులు కట్టుకుంటారు. జ్ఞానము లేకపోయినా అనేక మంది జ్ఞానవంతులు మీకు సేవలందిస్తారు. ధనము వల్ల సుఖములు కలుగుతాయి. ఆఖరికి చిన్నచిన్న తప్పులనీ, ఒక్కోసారి తెలిసీ తెలియక చేసిన మహా తప్పునీ కూడా ధనమే తన కడుపులో దాచుకుంటుంది.

ఇన్ని చేసే ధన విషయంలో మీకు అహం పెరిగితే ఆ ధనమే మిమ్మల్ని అధఃపాతాళానికి నెట్టివేస్తుంది. డబ్బులుంటే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది. నిజమే అంత వరకూ బావుంది. నా డబ్బుతో అందర్నీ దింపిస్తాను అని భావిస్తే, ప్రవర్తిస్తే ఒక్కసారి మీరే కోతవ్వాల్సి వస్తుంది. మీదకొచ్చిన గద్దను చూసి వణికే కోతిలా గజగజ వణకాల్సి వస్తుంది. అంతా కోతులే అనుకుంటే, ప్రవర్తిస్తే మీరు కోతులని భావించిన వారే మహాసర్పాలై కాటు వేస్తారు.

సంపదలు ఎలారావు ?
చాలామందికి తెలియని విషయం ఓ వైఢూర్యమో, ముత్యమో, పగడమో ఎంతవుతుందో తెలుసా? లక్షల్లో వున్నవారికి కూడా అవి స్థోమత వుండదు. ధనం కష్టపడటం వల్లా, వినూత్నంగా పని చేయటం వల్లా, కొత్తదనాన్ని చూపించటము వల్లా వస్తుంది. చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎవ్వరైనా రాళ్ళ ఉంగరాలని పెట్టుకుని ధనం సంపాదించారేమో చూడండి. ఎవరూ లేరు. వృత్తిపై అంకితభావమే ఉన్నవాడ్నిచేస్తుంది. ఇలా చెప్పినందుకు రాళ్ళూ, రత్నాలూ అమ్మేవారు నాపై విరుచుకు పడవద్దు. పురాణ ఇతిహాసాల్లో ఎవరు అవి పెట్టుకొని సాధించారో చెప్పండి.

astrologer tells about Mahalaxmi blessings

లక్షికి ఏవి ప్రీతికరములు

క్షీరసాగర తనయ శ్రీమహాలక్ష్మి పూజకు పాలతో చేసిన నైవేద్యాలు నివేదించాలి. ఆ పదార్థాలంటే శ్రీమహాలక్ష్మికి ప్రీతికరం. తన పుట్టినింటికి వెళ్ళినంత ఆనందంగా ఆ గృహానికి వస్తుంది.

విష్ణు భక్తులను తిడితే వచ్చేది దరిద్రమే

శ్రీ మహావిష్ణు భక్తులని తూలనాడితే, హరికి కోపం వచ్చి వారి గృహాల నుంచి వెళ్ళిపోతాడు. భర్తతో పాటు భార్య శ్రీమహాలక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. విష్ణుభక్తుడైన దూర్వాసుణ్ణి ఇంద్రుడు చిన్నబుచ్చినందుకే స్వర్గలక్ష్మిస్వర్గం నుంచి వెళ్ళిపోయింది. ఇంద్రుడు మహాకష్టాలు పడ్డాడు.
శ్రీమహాలక్షీదేవికి ఇష్టంలేనివి
మంచంపై కూర్చుని భోజనం చెయ్యటము
ఉదయాన్నే ఇళ్ళూ, వాకిలీ శుభ్రం చెయ్యకపోవటము.
లేచింది మొదలు భర్తనీ, పిల్లల్ని తిట్టటము, అరవటము, విసుక్కోవటము.
సాయం సమయాన సంధ్య దీపం ఉంచకపోవటము.
సరిగా పక్వము చెందని ఆహారాదులను తినటము
ఆహారాన్ని తీసుకోకముందు, తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోకుండా ఉండటము.
ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనపడటము వల్ల అనారోగ్యం, ధనహీనత కలుగుతాయి.
తడిబట్టలతో భోజనాన్ని చేయటమూ, తదియునాడు దొండకాయను తినటమూ, తమలపాకుల కన్నా ముందు వక్కలు నమలటమూ ఇవన్నీ దారిద్య్రాన్ని తెస్తాయి.
ధనాన్ని ఉత్తరము వైపున్న గదిలో జాగ్రత్త చేయటం ద్వారా కుబేరుని ప్రీతిని పొందగలరు.
'లక్ష్మీ కమలావాసిన్యై స్వాహా" అని వేదమంత్ర రాజాన్ని పఠించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించాడు
శంఖధ్వనీ, నిత్య ఆరాధనా, తులసి లేని చోట లక్ష్మీదేవి క్షణకాలం కూడా నివసించదు.
శ్రీమహాలక్ష్మీపతి జన్మతిథినాడు ఉపవాసం వుండటం వల్ల శ్రీమహాలక్ష్మి దీవెనలనూ, సంపదలనూ పొందవచ్చు.

English summary
Astrologer described about Goddess Mahalaxmi blessings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X