వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్దం పగిలితే అరిష్టమా?, స్నానం ఎంతసేపు చేయాలి?

అద్దం పగిలితే అరిష్టమా కాదా తర్వాత కాని ముందు పగిలిన అద్దంలో మన మొహాన్ని చూసుకోకూడదు. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు. మరకలు పడి లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలు ఉంచ కూడదు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అద్దం పగిలితే అరిష్టమా కాదా తర్వాత కాని ముందు పగిలిన అద్దంలో మన మొహాన్ని చూసుకోకూడదు. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు. మరకలు పడి లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలు ఉంచ కూడదు. అద్దానికీ, లక్ష్మీదేవికీ చాలా దగ్గర సంబంధం ఉంది. అద్దం అంటే లక్ష్మిదేవి స్థానం. అద్దంలో ఎప్పడూ ఒకే బొమ్మ నిలకగా ఉండదు. లక్ష్మీదేవికూడా అంతే.

అద్దం పగిలితే ధన నష్టమని పురాణాలు చెబు తున్నాయి. గాజు వస్తువు ఏదైనాసరే పగిలినప్పుడు ఎంత జాగ్రత్తగా శుభ్రపర చినా దానియొక్క రజను ఎక్కడో ఒకచోటవుండి చటుక్కున కాటు వేస్తుంది. కనుక అద్దం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సహనంతో పగిలిన అద్దంముక్కలను ఎవరు నడవని ప్రదేశాల్లో వాటిని పారెయ్యాలి.

astrologer tells about natural doubts

2. దేవాలయంలోకి వెళ్ళేముందు కాళ్ళఎందుకు కడుక్కోవాలి?
గుడికి వెళ్ళాలి అంటే స్నానం చేసే వెళతాము. అయినా గుడి బైట పంప వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము. దానికి కారణం స్నానం అయ్యాక, వెళ్ళేముందు చెప్పలు ధరిస్తాము. కనుక ముందుగా గుడి బైట పాదరక్షలను వదలి, పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి, పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ, ఆపాదమస్తకమూ పరిశుభ్రం చేసుకోవటానికి, తొలుత రెండు కాళ్ళు వెనక, ముందూ తడిచేలా కడుక్కుంటాము. మూడుసార్లు పక్కిలించి నీటిని బెటకి వదలాలి. దేవా! శరీరమూ, వాక్కుకి మూల కారకమైన నాలుకా, నోరూ కూడా శుభ్రపరుచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్ధిస్తున్నాము. కావున మమ్మ దీవించు' అని అర్థం. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళూ నోరూ శుభ్రపరుచుకొని దర్శించుకోవాలి.

3. తమలపాకు తొడిమ వదిలి తాంబూలం ఎందుకు సేవిస్తారు?
తమలపాకు తొడిమ తింటే వ్యాధి రావటానికి అవకాశాలు ఎక్కువ. అలాగే చివర్లు తింటే పాపం. ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది. తమలపాకు నమలగానే ఊసివేయాలి. దానికి కారణం తొడిమ, ఈనెలూ, చివర్లు ఇంకా మిగిలి ఉంటాయి. తొలి రసం ద్వారా బైటికి వదిలెయ్యటం జరుగుతుంది.

Recommended Video

'My Mother is like Indrani, likes having sex with many men' class 6 kid tells teacher

తాంబూలంలో ఒక వక్క మాత్రమే వాడాలి. రెండు వక్కలు పనికి రావు. తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారూ, కంటి జబ్బులున్నవారూ, క్షయాదులున్నవారూ వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకుకి రాసే సున్నం మధ్య వేలూ లేదా బొటన వేలితోనే రాసు కోవాలి. దాని వల్ల ఆయువు పెరుగుతుంది. ఈ రెండు వేళ్ళ ద్వారా సున్నం వ్రాయటం ద్వారా హృదయ నరాల్లో ఉత్తేజం కలిగి హృదయం తన పని తను మరింత సుళువుగా చేసుకుంటుంది.

4. అసలు స్మానం ఎంతసేపు చెయ్యాలి?
ప్రతీరోజు పావుగంటైనా స్నానం చేస్తే చాలామంచిది. 4చెంబులతో శరీరాన్ని బాగా తడిపి, సున్సిపిండిలాంటి వాటితో శుభ్రంగా రుదుకుని, ఆపై 7,8 చెంబులతో శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి. మెత్తటి టవల్తో దేహాన్ని అదుకొని తుడుచుకోవాలి. స్నానమైన తరువాత దేహంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవటంవల్ల ఎన్నో రోగాలు వచ్చే అవకాశములున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ భయంకరమైన జబ్బులు కూడా వచ్చే అవకాశము ఉంది.

కనుక శుభ్రంగా స్నానం చేసి ఫ్యాన్ క్రింద ఓ నిమిషంపాటు నిల్చుని ఆపై బట్టలు ధరించండి. స్త్రీ, పురుషులు ఎవరూ దిగంబరంగా స్నానము చేయకూడదు. ప్రభాతవేళ45 గంటమధ్య స్నానం ఋషిస్నానం అంటారు ఆ తరువాత ఉదయం 5,6 గంటలమధ్య చేసేది దైవస్నానం అంటారు. అటుపిమ్మట ఉదయం 6,7గంటల మధ్య చేసేది మానవ స్నానం అంటారు. ఇంక ఆ తరువాత చేసేది రాక్షస స్నానం. స్నానంచేసేటప్పడు చన్నీటి స్నానం చాలామంచిది. నదీ స్నానం అన్నిటి కంటె ఉత్తమమైనది. తెల్లవారు జామున 10వేల రూపాయలు ఆదాయమొస్తున్నా మానుకొని మరీ సరైన స్నానం చెయ్యటం మంచిది.

5. పంచగవ్యము అంటే ?

గోవు సర్వదేవతలకు ప్రతిరూపమా గోవు పాలు, పెరుగు, నెయ్యి, మల మూత్రాలు ఆవునుంచి వెలువడే వీటిని పంచగవ్యములు అంటారు. గో మూత్రమునందు వానదేవుడూ, గోమయమందు అగ్నిదేవుడూ, ఘృత మందు సూర్యభగవానుడూ, దధి యందు వాయుదేవుడూ, గో క్షీరమందు చంద్రుడూ ఉంటారని ప్రశస్తే, అందుకే గోమాత పూజింపతగినదిగా, పవిత్రమైనదిగా సర్వదేవతలకు ప్రతిరూపంగా భావిస్తారు.

English summary
Astrologer described about natural doubts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X