వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బావి లేదా బోరింగు ఎక్కడ ఉండాలి?: ఎలాంటి ఫలితాలు

ఆగ్నేయ నైరుతి, వాయువ్య మూలలో బావులు త్రవ్వరాదు. ఈశాన్యమున బావి త్రవ్వటం శుభమును కల్గించును. ఈ విధానము గృహమునకు, గ్రామమునకు శ్రేష్టమైనది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:
ఆగ్నేయాది త్రికోణేషు కుర్యాత్కూపకం బద |
శేష స్థానేషు శుభదం త్రామాధీనం విదం స్కృతమ్ |
ఆగ్నేయ నైరుతి, వాయువ్య మూలలో బావులు త్రవ్వరాదు. ఈశాన్యమున బావి త్రవ్వటం శుభమును కల్గించును. ఈ విధానము గృహమునకు, గ్రామమునకు శ్రేష్టమైనది.

తూర్పున పుత్ర నాశనము, ఆగ్నేయమున అగ్నిభయము, దక్షిణమున శత్రుబాధ,
నైరుతిన బావి కలహము, పశ్చిమమున దౌష్ట్యము, వాయువ్యమున దరిద్రము, ఉత్తరమున సంపద, ఈశాన్యమున సంతానాభివృద్ధి కలుగును.
కావున గృహస్తులు ఈ క్రింది సూచనలు పాటించి గృహమున బోరింగు. బావులు ఏర్పాటు చేసుకొనవలెను.

గృహములో ఉత్తర ఈశాన్యములలోగాని, తూర్పు ఈశాన్యగాని బావులు లేదా బోరింగులు ఏర్పాటు చేసుకొనవచ్చును.

Astrologer described about good place for well.

బోరింగు కాని నుయ్యిగాని ఇంటి ఈశాన్య కోణమున ఉంచకూడదు. ఉత్తర ఈశాన్య స్థలములో బోరింగు కాని నుయ్యిగాని వుంటే కుటుంబ సౌఖ్యము కలుగును.
వంశవృద్ధి, ధనవృద్ధి కలిగి వారు తరతరాలు భాగ్యవంతులుగా నుందురు.
తూర్పు ఈశాన్యస్థలములో నుయ్యిగాక, గొయ్యిగానీ వుంటే కుటుంబ సౌఖ్యము, వంశాభివృద్ధి మరియు పేరు ప్రతిష్టలు కలుగును.

గృహమునకు ఈశాన్యమని కొంతమంది గృహస్థులుల బోరింగు కాని నుయ్యిగాని ఇంటికి ఆనుకొని నిర్మించుకొందురు. ఇది తప్పు. మనమేర్పాటు చేసుకొను బోరింగ్ గాని బావిగాని మొత్తం ఆవరణకు ఈశాన్యమున యుండవలెను. కేవలము యింటికే ఈశాన్యమునకు గాదు.

ఎక్కడ ప్లాట్లలో ఈశాన్యములో నుయ్యి తీసే అవకాశముండదో అట్టి చోట్ల తూర్పున బోరింగ్గానీ నుయ్యిగాని ఏర్పాటు చేసుకొనవచ్చును.
అదే విధముగా ఉత్తరములో బావిగాని, బోరింగ్ ఏర్పాటు చేసుకొనవచ్చును. బావిపై గిలక దూలాన్ని ఉత్తర దక్షిణాలు వుండేటటు అమర్చు కొనవచ్చును.

బోరింగ్గానిబావిగాని త్రవ్వకూడని చోట్లు
పశ్చిమాన బావిగాని బోరింగ్గాని యుండరాదు. అది ఆ గృహములో నివసించు పురుషులను అనారోగ్యముగా మార్చును. ఆర్థికముగా నష్టము కలిగించును.
పశ్చిమ నైరుతిలో బావిగాని, బోరింగ్గానీ వుంటే పురుషులకు భయంకర దీర్ఘ వ్యాధులు లేదా చెడు ప్రవర్తనలు కలుగజేయును.

దక్షిణ నైరుతి భాగములో బావిగానీ బోరింగ్కాని యున్న స్త్రీలకు భయంకర వ్యాధులు, యజమానికి ఆర్ధికనష్టాలు కలిగి అతడు ఋణగ్రస్తుడుగా మారును.
పశ్చిమ వాయువ్యములో నుయ్యిగాని, బావిగాని యున్చో, అది నివసించు పురుషులపై చెడు ప్రభావమును కలుగజేయును.
ఉత్తర వాయువ్యములో బావియున్న అందు వివసించు గృహసులకు శత్రువుల బాధ అధికముగానుండును.

ఇంటి ద్వారముల అమరిక ఎలా ఉండాలి ?
ఇంట్లో నుండి మనము వీధిలోకి నడిచే నడక - మన జీవితపు నడకను మార్చును. కనుక నడక ఉచ్ఛమైనచొ మన బ్రతుకు గూడ ఎత్తుగను, నడక దిగుడు ఐనచో బ్రతుకు దుర్భరముగను అగును.
ఉత్తర దక్షిణముగా నుండు గోడలకు ఉత్తరభాగము ఎత్తు, దక్షిణము దిగుడు. తూర్పు పడమరగా నుండుగోడలకు తూర్పు ఎత్తు, పడమరదిగుడు. ద్వారములుంచునప్పడు గోడను కొలచి దాని పొడవును సగము చేసి ద్వారములు ఎత్తు లోనికి జరిగియుండు లాగ ఉంచవలెను.
గృహము యొక్క కాంపౌండులోగల వెలుపలి భాగమున పడమర మరియు నైరుతి దిక్కున గల గదులకు దిగుడు స్థానమున ద్వారములుంచినచో ఆ యింటి వారికి మరణము లేదా దీర్ఘ వ్యాధులు కలుగును.
గృహము యొక్క బయటి ప్రదేశమున దక్షిణ - ఆగ్నేయమున గది లోనికి దిగుడు స్థానమున ద్వారము ఉన్న స్త్రీలకు అనారోగ్యము గదిలోనికి ఉచ్ఛమైన పిల్లలకు కీడు కలుగును.

వాస్తు శాస్త్రములో ఈ విషయము చాలా ప్రాముఖ్యమైనది. రెండు వీధులు ఏ మూలలో కలియునో ఆ స్థలము ఆ మూల బ్లాకుగా పిలువబడును.

పాత గృహములను వాస్తుకు సరిచేయుటకు, నూతన గృహములు నిర్మించుటకు, ఫాక్టరీలుగాని, మిలులుగాని నిర్మించుటకు ఈ అంశము అతి ముఖ్యమైనది. ఈ అంశము తెలియక ఎవరైనా వాస్తు ప్రకారం నిర్మాణములు చేయుటకు వీలు కుదరదు.
ఆయా స్థలాలను బట్టి ప్లాట్లను 8 రకాలుగా విభజించటం జరిగినది. ప్లాట్ల యొక్క రోడ్లను బట్టి, పరిసరాలను బట్టి ఆ స్థలము యొక్క ఫలితము నిర్ణయించబడును. కావున యజమానులు అనుకూలమైన ప్లాటును ఎన్నుకొని వాస్తు ప్రకారం నిర్మాణములు చేపట్టుట శ్రేయోదాయకముగా యుండును.

English summary
Astrologer described about good place for well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X