వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్ని ఆలయాల్లోకి వెళ్లినప్పుడు చొక్కా ఉండకూడదా?

కొన్ని ఆలయాల్లోనే కాదు. ఏ ఆలయంలో ఆయినా భగవంతుణ్ణి దర్శించేటప్పుడు పైన వస్త్రం ఉండకూడదు. నడుముకు పైభాగంలో వస్త్రం ఎందుకు ఉండకూడదంటే మన శరీరంలోని భాగాలకు కొన్ని నిరుష్టమైన ప్రతీకలున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొన్ని ఆలయాల్లోనే కాదు. ఏ ఆలయంలో ఆయినా భగవంతుణ్ణి దర్శించేటప్పుడు పైన వస్త్రం ఉండకూడదు. నడుముకు పైభాగంలో వస్త్రం ఎందుకు ఉండకూడదంటే మన శరీరంలోని భాగాలకు కొన్ని నిరుష్టమైన ప్రతీకలున్నాయి. రెండు చేతులనూ. ఉదరము, నాభి బ్రహ్మస్థానం. హృదయము విష్ణస్థానం. కంఠము రుద్రస్థానం అంటూరు.

ఈ స్థానాలు వరుసగా వ్యానము, వివేకము, విమోకము అని గుర్తిస్తారు. చేతులు రెండూ అభ్యాసాలు. కాత్తు అనుద్దరములు అన్నారు. మంచి చెడు రెండూ ఆలోచించి తెలుసుకోవడానికి ఉదరం ప్రధానం. తెలుసుకున్నది ఆచరించడానికి హృదయం కావాలి. ఆచరించిన దానిలో స్వార్గాన్ని విడిచిపెట్టడానికి భుజములు ప్రధానం.

astrologer tells about temple entrance

ఇలా శరీరంలోని ఆయా స్థానాలన్నీ దేవతా ప్రతీకలే. ఈ ప్రతీకలన్నింటినీ పెద్దలకు మనం దర్శింపచేయాలి. శరీరాన్ని ఎంతగా దాచుకుంటే అంతగా దానిపై మనకు వ్యామోహం పడుతుంది. పెద్దల ముందు శరీరంపైని మమకారాన్ని తొలగించుకుని మనస్సు, బుద్ధి కేంద్రీకరించాలి. దేహాత్మ అభిమానాన్ని విడిచిపెట్టాలి. అందుకే పెద్దలముందు, దైవంముందు నడుముకు పైభాగంలో వస్తాన్ని తీసి నడుముకు కట్టుకోవాలి. ఏకవస్త్రం పనికిరాదు అని శాస్త్ర వాక్యము.

నారాయణుడు శ్రీరామ, పరశురామ అవతారాలను ఒకేసారి ఎందుకు ధరించాడు ?
అమలాపురం పరశురాముడు త్రేతాయుగంనాటివాడు. త్రేతాయుగంనాటిది. రెండూ ఒకేసారి ఎత్తిన అవతారాలు కాదు. అయినా ఒకసారి పరమాత్ముని ఒకేరూపం ఉండాలనే నియమం లేదు. క్రూర్మావతార ఘట్టంలో ధన్వంతరి, మోహిని కూడా విష్ణుని అవతారాలే. కపిలుడు, కశ్యపుడు, కర్ణముడు వంటి బుషులంతా నారాయణుని అంశలే. అలాగే నర నారాయణులలో ఇద్దరూ నారాయణస్వరూపాలే.

ఒక రూపంలో గురువుగా, ఒక రూపంలో శిష్యునీగా వచ్చింది పరమాత్ముడు. మహాభారతంలో కృష్ణుడనే పేరు అయిదుగురికి ఉంది. పదకొండుమంది రుద్రులు, ఎనిమిదిమంది బ్రహ్మలు వీరంతా భారతకథలో కనిపిస్తారు. పరశురాముడిగా క్షత్రియ వినాశనం చేసిన పరమాత్మయే మరోసారి క్షత్రియనిగా రావడం ఆయన లీల. వినయం ఉన్నవాడు గెలుస్తాడు. అహంకారం ఉన్నవాడు ఓడిపోతాడని పరశురాముని కథ మనకు అందించే సందేశం.

పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి తగిన వయస్సు ఎంత?

పూర్వం పిల్లలకు అయిదో ఏట అక్షరాభ్యాసం చేయించేవారు. ఆటపాటల్లో పిల్లవాడి బుద్ది జానం వైపుకు మరలాలంటే ఆ వయస్సు వరకూ ఆగాల్సిందే. పోటీ ప్రపంచంలో అందరూ మూడో ఏటనే బడిలో వేస్తున్నారు. కాబట్టి అప్పుడే అక్షరాభ్యాసం తప్పనిసరి అయిపోయింది. తప్పు అనిపిస్తున్నా చాలామంది అనుసరిస్తారు. కాలధర్మాన్ని నిస్సందేహంగా పుష్పాన్ని బలవంతంగా వికసింపచేసే ప్రయత్నం.

లాలయేత్ పంచవరాణి అయిదేళ్ల వరకూ పిల్లలు అల్లరి చేస్తే మందలించాలి కానీ శిక్షించే అధికారం పెద్దలకు లేదు. "దశవరాణి పాలయేత్ పదేళ్ల వయసు వచ్చేవరకూ వారి మంచిచెడ్డలు దగ్గరుండి గమనించాలి. ఆ రెండింటికీ నేటికాలంలో అవకాశం ఉండదు. దండించకుండా, బలవంతపెట్టకుండా, మానసిక ఒత్తిడి తీసుకురాకుండా నేటి చదువులు సాగవు. అయిదేళ్లు నిండేవరకూ పిల్లలకు కనీసం రాతపని లేకుండా చేస్తే బాగుంటుంది.

English summary
Astrologer described about temple entrance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X