వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరణం తర్వాత ఏమవుతుంది?.. ఎక్కడికి వెళతాము?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మరణం తర్వాత జీవితం ఉందా? మరణం అంటే ఏమిటి? మరణం బాధాకరమైనదా? పునర్జన్మ ఎలా సంభవిస్తుంది? మరణం తర్వాత ముఖ్యంగా మనం ప్రేమించినవారో లేక మనతో ఉండే వారికో మరణం సంభవించినప్పుడు, ఇలాంటి ప్రశ్నలు మన మెదడులో మెదలతూ ఉంటాయి. ఆ సమయంలో మనం అప్పటిదాకా ఉన్న బంధం ఏదో ఉన్నపలాన తెగిపోయింది అని బాధపడతాము. అలాగే, ఆ బంధం ఇంకా కొనసాగితే బాగుండును కదా అని ఆలోచిస్తాము. ఈ ఆలోచనల పోరాటంలో, పైన వివరించిన ప్రశ్నలకి సమాధానల కోసం, మన ప్రయత్నం మొదలవుతుంది.

అందువలన, మరణం తర్వాత ఏమౌతుంది?
మొట్టమొదటి ప్రశ్న మన మనస్సులో ఉదయించేది.. మరణం తర్వాత ఏమౌతుంది? అని. ఇది ఒక ఆశ్చర్యకరమైన పద్దతి. ప్రజలు మరణం అనేది ఒక భయానకమైనది మరియు ఆ తర్వత పరిస్థితులు అత్యంత ఘోరమైనది అని అనుకుంటూ ఉంటారు. మరణం తర్వాత నేను స్వర్గానికో లేక నరకానికో వెళ్తాను అనుకుంటారు. మరణం తర్వాత ఏమౌతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం కోసం, ఇకపై వచ్చే విషయలాను జాగ్రత్తగా చదవండి.

భుమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది
భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని యొక్క అరికాలు పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు. ఎప్పుడైతే మరణ ఘడియలు ఆసన్నమయ్యాయో అప్పుడు యమధర్మరాజు ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు తీసుకువెళ్ళడానికి వచ్చాడని ప్రజలు విశ్వసిస్తారు.

సూక్ష్మ వెండి తీగ
అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు బంధింపబడిన ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్ష్మమంగా పరిశీలిస్తే.. ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిని కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది. అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన, ఆత్మ ఇక శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. ఏదో ఒక అయస్కాంత శక్తి వలన ఆత్మ, అలా శరీరం నుండి పైకి, ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది.

astrologer tells about what will happen after death

భౌతిక శరీరానికి ముగింపు
ఈ సమయంలో ఆత్మకి ఎన్నో గొంతులు ఒక్కసారిగా వినబడటం మొదలవుతుంది. అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినబడుతున్నాయంటే.. ఆ మరణించిన వ్యక్తి యొక్క చేరువలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు, ధ్వనుల రూపంలో వినబడటం జరుగుతుంది. శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది. నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ, ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను మరణించానని ఇక తన శరీరంలో చేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి, ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకూ ఆత్మ అలా సుమారు 12 అడుగులు శరీరానికి పైన వుంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి.. ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోంది అంటే, అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి, అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ, వింటూ ఒక సాక్షిభూతంగా వుందని.

భౌతికదేహంతో విడివడుట
ఇక అంత్యక్రియలు కూడా జరిగాక, తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక, ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థీవ దేహం పంచభూతాలలో కలసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తను దేహంలో ఉండటం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన, ఇక ఆత్మకి పూర్తి స్వేచ్చ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలచుకున్న మాత్రానా ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, ఆఫీసు, పార్క్‌లు ఇలా తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆత్మ దేహంలో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి గలవారై ఉంటే, మరణించాక, ఆత్మ తన గల్లాపెట్టి వద్దనే ఉంటుంది. ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే, తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటూ, వ్రేలాడుతూ ఉంటుంది. 7 రోజులు ముగిసాకా, తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని, భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది.

ఆత్మప్రయాణం
ఆత్మల లోకానికి వెళ్ళ్దడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి వుంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజులలో మనం జరుపవలసిన కార్యక్రమాలు చక్కగ నెరవేర్చవలసి వుంటుంది. మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్ధించడము జరుపవలెను. మనం అలా అడగడం వలన, కొంతలో కొంత వరకైనా తన ప్రియమైన వారియొక్క, సరికాని అంటే నెగటీవ్ ఎమోషన్లు (బాధలు, కోపాలు మొదలగునవి) ఆత్మ ప్రయాణంలో వెంటవెల్లకుండా ఉంటాయి. నేను మీకు సూచించేది ఏమిటంటే మరణం సంభవించిన రోజు నుండి 21 రోజుల వరకు, రోజుకు 15 నిమిషాలు చొప్పున 'హొపొనొపొనో' పద్ధతిని అవలంబించండి. ఈ పద్దతి హవాయ్ దేశంలో చాలా పురాతణమైన పద్దతి. (ఈ పద్దతిలో సంబంధంబాంధవ్యాలను మెరగుపరచుటకు, క్షమించమని ప్రార్థించడమూ జరుగుతుంది.) అంత్యక్రియల తరువాత జరుపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు, ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మలలోకానికి అడుగుపెడుతున్నాను అన్న సూచనగా, మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతి పెద్ద వెలుగు కనపడుతుంది.

పూర్వీకులను కలసుకొనుట

హిందువులు 11వ మరియు 12వ రోజున జరుపబడే హోమము మరియు ఇతర కార్యక్రమాలవలన.. ఆత్మ తన పూర్వీకులను, ఆప్త మిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలసుకోవడం జరుగుతుంది. మనం భౌతికంగా ఎలాగైతే, మన దూరపుబంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో, అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని అహ్వానించి మనస్పూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు, ఆత్మని తను భూలోకంలో, బాధ్యతవహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి, ఒక పెద్ద వెలుగువంటి బోర్డ్ ఉన్న ప్రదేశానికి తీసుకునివెళ్తారు. దీనినే 'కార్మిక్ బోర్డ్' అంటారు. ఈ బోర్డ్ లో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది.

English summary
Astrologer described about what will happen after death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X