వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టిన తేదీ లేని జాతకులు ఏమి చేస్తే గ్రహ బాధలు తొలగుతాయి?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ప్రస్తుత కాలంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి వ్యక్తి లోనూ ఉంటుంది. జీవితంలో జరిగే మంచి చెడులను తెలుసుకునేందుకు జ్యోతిష్కులను, పండితులను ఆశ్రయిస్తుంటారు. కొందరు హస్త సాముద్రికం ఆధారంగా చెబుతుండగా, ఇంకొందరు సంఖ్యాశాస్ర్తాన్ని ఆధారంగా చేసుకుని, మరికొందరు గ్రహ సంచారాల ఆధారంగా జాతకాలు చెబుతుంటారు. చేతిలోని రేఖల ఆధారంగా చెప్పేది హస్త సాముద్రికం కాగా, గ్రహ గతుల ఆధారంగా చెప్పేది జన్మకుండలి ఆధారిత జ్యోతిష్యం.

జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి జన్మించిన తేదీ (నెల, సంవత్సరంతో సహా), సమయం, పుట్టిన ప్రదేశం తప్పనిసరి. ఇవన్నీ కచ్చితంగా ఉంటే జాతకం కూడా కచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. జనన సమయం సరిగా ఉండాలి. ఇదే లగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. ఈ లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధారించడం సాధ్యమవుతుంది.

అలాగే, లగ్నం కచ్చితంగా నిర్ధారించేందుకు జన్మించిన ప్రదేశం కూడా ముఖ్యమే. సూర్యోదయ సమయాలు ఆయా ప్రాంతాలనుబట్టి కొన్ని నిమిషాలు హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా లగ్న నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మేషాది మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ప్రమాణం సుమారు 2 గంటల వరకు ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు నిమిషాల తేడాలో లగ్నం మారవచ్చు. జన్మించిన ప్రదేశం తెలుసుకోవడం ద్వారా లగ్నంలో తేడాలు రాకుండా చూసే అవకాశముంటుంది.

కొందరికి జన్మించిన తేదీ, సమయం తెలియదు. వారి పెద్దలు చెప్పే కొండ గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధారించవచ్చు. అయితే, జన్మ కుండలి వేయడం దీనివల్ల సాధ్యం కాదు. కేవలం రాశి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

జాతకం లేని వారికి శాంతులు అంటే జన్మించిన సమయం లేని వారికి. అయితే జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును.

Astrologer told about birth date missing persons graha effects

ఆదిత్య హృదయం:

ఇది సూర్యునికి సంబంధించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పటించుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను పొందుతారు. ఇంకా.. మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది. పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుంచి, దుఃఖముల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పఠించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాధించాడు. గోధుమలతో చేసిన పదార్ధములు, క్యారెట్, రాగి చెంబులో నీళ్లు తాగడం వలన కూడా సూర్య గ్రహా దోషాలు తొలుగుతాయి.

రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం:

జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే "రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం" 41 రోజులు పారాయణ చేస్తూ , నవగ్రహాలకు రోజూ 27 ప్రదక్షిణలు చేయాలి. చివరి రోజు కందులు, ఎర్ర గుడ్డ, ధనము దక్షిణగా పెట్టి,కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారా?

మీరు "విష్ణు సహస్ర నామ స్తోత్రం" 41 రోజులు పారాయణ చేయండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేఇంచండి. మీ బాధలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా?

మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయించండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేయించండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేయిస్తే ఇంకా మంచిది. లేదా" సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చేయండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.

వివాహం ఆలస్య మవుతోందా?

మీరు "రుక్మిణి కల్యాణం" పారాయణ చేయండి. లేదా 41రోజులు , రోజుకి 41 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చేయండి. అయితే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.

ధనమునకు ఇబ్బంది పడుతున్నారా?

ధన కారకుడైన సాయి బాబా పారాయణ 41 రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు, అరటి తొక్కలు, ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. 41వ రోజు బూంది ఒక కిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి.

డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ

ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు "ఏకన్యాస రుద్రాభిషేకం" చేయండి. అలాగా 8 మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేయించండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి. ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ "శ్రీ సూక్తము" పారాయణ చేయవలెను.

హనుమాన్ చాలీసా

హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం "హనుమాన్ చాలీసా". ఈ హనుమాన్ చాలీసాను దినమునకు 11 పర్యాయములు చొప్పున మండలం(40 రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని 108 పర్యాయములు పఠించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ 3 వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతునికృపచే శుభములు కలుగును.

సమస్త గ్రహదోషాలు పోవాలి అంటే ప్రతిరోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి.

రక్త హస్తాలతో ( కాళీ చేతులతో ) గుడికి వెళ్లవద్దు.

నిష్ఠతో చేస్తే తప్పక శుభాలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ.

English summary
Astrologer told about birth date missing persons graha effects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X