వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రారబ్ధం(డెస్టినీ) అనుభవించక తప్పదా?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే'
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి!!

Astrologer told about Prarabdham (Destiny)

నుదుట వ్రాసిన రాతలు చెరిపివేయడం బ్రహ్మ చేతకానీ, విష్ణువు చేతకానీ, శివుడి చేతకానీ ఎవరివల్లా కాదు.

విధిరేవ గరీయసి' - పూర్వ కర్మలననుసరించి ఏది అనుభవించాలో నిర్దారింపబడి ఉంటుంది. దానిని విధి అంటారు. అది అనుభవించక తప్పదు.

ప్రారబ్ధం భోగతే నశ్యేత్ - అనుభవించవలసినది ప్రారబ్ధం. అది అనుభవించడం వల్ల పోతుంది తప్ప మార్చలేవు.

వీటిని తొలగించలేనప్పుడు పూజలు పునస్కారాలు చేసి ప్రయోజనం ఏమిటి?
ప్రారబ్ధం అనుభవించక తప్పదు అనేది సాధారణ నియమం మాత్రమే.

తగిన సాధన చేసి వీటిని కూడా మార్చవచ్చు.
విద్యుత్ తీగ మీద చెయ్యి వేస్తే షాక్ కొడుతుంది. ఇది సామాన్య సూత్రం.

కానీ చేతికి రబ్బరు తొడుగు కట్టుకొని పట్టుకుంటే షాక్ కొట్టదు. అలాగే సాధన అనే కవచాన్ని పెట్టుకుంటే ప్రారబ్ధం కూడా తొలగించుకోవచ్చు.

'శుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిమ్' -

భగవంతుని మనస్సు పెట్టి ధ్యానించినట్లయితే అశుభములు తొలగిపోయి శుభ పరంపరలు కలుగుతాయి.

అశుభం - ప్రారబ్ధ వశాత్తు పూర్వ కర్మలననుసరించి వచ్చే దుఃఖములు, తప్పుడు పనులు చేయడానికి ప్రేరణలు.
ప్రారబ్ధం అనుభవించక తప్పదు అని చతికిలపడిపోకూడదు.

యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యత్ చ దుర్గమం!
తత్ సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం!!

దేనిని మనం అసలు చేయలేం అనుకుంటామో, దేనిని మనం పొందలేము అనుకుంటామో, దేనిని సాధించలేము అనుకుంటామో, అవన్నీ కూడా తపస్సు చేస్తే సాధ్యం అవుతుంది.

మానవుడు గతానికి తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోకూడదు.

దుఃఖం ఎక్కువ ఉన్నప్పుడు తపస్సు పెంచుకోవాలి. దేవతారాధన, నియమబద్ధమైన జీవితం, ధార్మికమైన ఆలోచనా సరళి పెంచుకుంటూ తపో మార్గాన్ని, సజ్జన సాంగత్యం,ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించినట్లయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోగలము.
ఉదాహరణగా మార్కండేయుడు, సావిత్రి, మొదలైన వారి చరిత్ర గుర్తుకు తెచ్చుకుంటే చాలు సంకల్ప బలంతో దేనినైనా సాధించవచ్చు అని తెలుస్తుంది

జైశ్రీమన్నారాయణ.

English summary
Astrologer told about Prarabdham.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X