వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడిటేషన్ అంటే ఏమిటి?: ధ్యానం ఇలా చేయకూడదా?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: ధ్యానం(మెడిటేషన్) ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ధ్యానం చేయాలనుకుంటే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా స్థితులు అభ్యసించి తర్వాత ధ్యానం చేయడం ప్రారంభించాలి. లేకుంటే అనవసరంగా వైద్యులు కూడా గుర్తించలేని అనారోగ్యాలు సంభవించే ప్రమాదం ఉంటుంది.

జీర్ణ వ్యవస్థ, జ్ఞాపక శక్తి, మందగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెలియని ఇబ్బందులు ఏర్పడ వచ్చు. కావున మన సంస్కృతిని బట్టి, మనకు తెలిసిన యోగా శాస్త్రం ఏం చెబుతుందో దాన్ని పాటించాలి!

astrologer told the story about meditation

ఆసన సిద్ధి కలిగిన తర్వాత ప్రాణాయామం, నాడీ శోధన తర్వాత కపాలభాతి, భస్త్రికలు నేర్చుకున్న తర్వతనే మంత్ర జపం లాంటి ప్రత్యాహార విధానాన్ని సాధన చేయాలి. ఆ తరువాత ధారణా స్థితిలో ఉండ గలగాలి.

ప్రత్యాహార సాధనలో ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి. వ్రతాలు, పూజలు, దీక్షలు అన్నీ ప్రత్యాహార విధానాలే. అయితే ఈ రకమైన ఏకాగ్రత సాధన చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో భౄమధ్యంలో కలిగే ఇంద్రియాతీత మైన అనుభూతియే ధారణా అనుభవం! ఇందులో భాగంగా ధారణా స్థితిలో ఉన్నవారు ఏ వస్తువునైనా, మనిషినైనా ఒక సారి చూసి కళ్ళు మూసుకుంటే ఆ వస్తువుని లేదా వ్యక్తిని కనులు తెరిచి చూస్తున్నంత స్పష్టంగా, చూడగల్గడం జరుగుతుంది.

ఈ స్థితిలో కొంత అభ్యాసం చేయాలి. తర్వాత ధ్యానం ప్రారంభించాలి! ఏది ఏమైనా ధ్యానం చేయడానికి ఆసన సిద్ధి చాలా ముఖ్యం.కనీసం మూడు గంటల పాటు ఒకే ఆసనంలో స్థిరంగా కూర్చుని ఉండగల్గాలి. కనీసం ఒక గంట సేపైనా కూర్చుని ఉండగల సామర్థ్యం సాధన చేయాలి.

యోగా ఇంత కఠినంగా ఉంటే మేము చేయలేం అనుకుంటే ఒక్క మంత్ర జపం శ్వాసతో కలిపి చేసుకుంటే చాలు. ఇంకనూ ఇదీ వీలు కావడం లేదు అంటే మీ జీవితం ప్రస్తుతం ఎలా ఉందో అలా దాన్ని యథాతథంగా అంగీకరించి సమర్పణా భావంతో జీవించ గలిగితే అత్యంత సులభంగా ముక్తి మార్గములో ముందుకు వెళ్ళవచ్చు!

ఏదైనా శ్రద్ధగా ఆసక్తి పూర్వకంగా చేస్తే వేరే సాధనల్లో వచ్చే ఫలితాలు ఎక్కడైనా పొందవచ్చు.గురు ముఖతగా నేర్చుకున్న విద్యలకు ప్రాధాన్యతలు ఎక్కువ.

English summary
Astrologer told the story about Meditation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X