వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శని త్రయోదశి: ప్రాముఖ్యత, విశేషాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శని త్రయోదశి ప్రాముఖ్యత నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.

జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.

బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాధిపతి లా శని దండన విధిస్తాడు.

 astrologer told the story about shani trayodashi

శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.

క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది.

ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ "దోషం" అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.

ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లబిస్తుంది.

ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అవి :

నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం.

నల్ల కాకులకు అన్నం పెట్టడం, నల్ల కుక్కల్కు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుముకు సంబంధించిన వస్తువులను పెదవారికి దానం చేయడం.

శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు
(నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం)

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
ఎవరివద్ద నుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.మద్య మాంసాదులను ముట్టరాదు.

వీలైనవారు నల్ల నువ్వులతో శివార్చన స్వయముగా చేయటము.

శనీశ్వర గాయత్రి:
"ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్‌"
(శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను)

ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

పూర్వజన్మ కర్మ ఫలం:-

ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. లేదా అనేక ఇబ్బందుల పాలవుతారు.

చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.

ఫలితం అనుభవించాల్సిందే ఎంత దైవాంశ సంభూతులైనా వారి వారి కర్మల ననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడు కార్యాలకు పాల్పడిన వారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృ గర్భం నుండి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది.

మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.

శనిదేవునికి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వర్రపదాయినిగా బాధ్యతలు ఉన్నాయి. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు.

ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశ పారంపర్య లక్షణాలను వదులుకోడు.శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తి ధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు.శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.

ఓర్పు, సహనం ముఖ్యం.మంచి కన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదిం చాలంటే ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాల నుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే ! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిదేవుని కోర్టులో తప్పక శిక్షించబడతారు.

మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచి పనులు, ప్రార్థనలు, భక్తి యుతులు తప్ప ఏవీ పనిచేయవు.శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు.

శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగేస్తాడు.

శని దండనాధికారి శాస్త్రరిత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

English summary
astrologer told the story about shani trayodashi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X