వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడికి ఎందుకు వెళ్ళాలి?: వెళితే పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుడికి ఎందుకు వెళ్ళాలి? అని కొందరికి. గుడికి వెళ్ళే అలవాటు కొందరికి ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా చాలా మంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగులు,ఇబ్బందులు ఉంటే వాటిని మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు,ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.

 వైదిక ఆలయాలంటే

వైదిక ఆలయాలంటే

మన దేశంలో చిన్న పెద్ద కలిపి వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి శాస్త్ర నిర్ధిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే దేవాలయాలుగా పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థల మహత్యాన్ని సంతరించుకున్నాయి.

మనలోకి పాజిటివ్ ఎనర్జీ..

మనలోకి పాజిటివ్ ఎనర్జీ..

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువు, మనసు ప్రశాంతతను పొందుతాయి.

 ఆరోగ్యంగా ఉంచుతాయి

ఆరోగ్యంగా ఉంచుతాయి

దేవాలయ గర్భ గృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన పంచలోహా యంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతారు. పంచలోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా లోహం గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.

రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి,దాని వలన శరీరంలోనికి పాజిటివ్ తరంగాలు ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతాయి.

నిత్యం గుడికెళ్లే వారికి..

నిత్యం గుడికెళ్లే వారికి..

అడప దడప ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆలయ యంత్ర ప్రభావిత శక్తి కొంత సోకిన గమనించదగ్గ తేడా మనకు తెలియదు. కాని నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది.

గుడిలో జరిగే ప్రతీ చర్యలోనూ శక్తి..

గుడిలో జరిగే ప్రతీ చర్యలోనూ శక్తి..

గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి మనస్సును చైతన్య పరుస్తాయి..

గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే పరిమళాలు శరీరంతో రసాయణ చర్య జరిగి శక్తి వంతం అవుతుంది.

మూల విరాట్ ను ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు, వేదమంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాలలో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

ఔషధ గుణాలు కలిగిన ప్రసాదాలు

ఔషధ గుణాలు కలిగిన ప్రసాదాలు

గుడిలో ప్రసాదాలు పులిహోర,దధ్యోజనం,చక్కర పొంగళి,వడలు, కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ ప్రసాదాలు దేవుల్లకు నీవేదన సమర్పించిన తర్వత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.

తీర్థంలో పచ్చ కర్పూరం, యాలుకలు, సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూప ద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము, తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాన్ని ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

మనలోకి దివ్య శక్తి, తేజస్సు

మనలోకి దివ్య శక్తి, తేజస్సు

లోహానికి శక్తి తరంగాలను తొందరగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా ప్రయోజనం కలుగుతుంది.

భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
కర్పూర హారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు కలుగుతుంది.కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

 ఆలయాలకు దూరమైతే..

ఆలయాలకు దూరమైతే..

వెనకటి కాలంలో ఎక్కువ శాతం కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరు సూర్యోదయం కంటే నిద్ర లేచి ఇల్లును శుభ్రపరచి సుచిగా స్నానం చేసి ఇంట్లో దేవుని పూజించుకుని కుటుంబ సభ్యులు అందరు తప్పక దగ్గరలో ఉన్న ప్రధాన దేవాలయాని వెల్లి అక్కడ దర్శనం చేసుకుని తీర్ధ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చి అప్పుడు " టీ " కాఫీ మొదలగునవి త్రాగేవారు. ప్రస్తుత కాలంలో దైవానికి, దేహానికి సమయం ఇవ్వలేనంత బద్దకమో లేక ఇతర బిజిలో పడిపోతున్నారు. ఇలా చేయడం వలన మనిషికి, మనస్సుకి మంచిది కాదేమో అని ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అర్దం అవుతుందేమో....జై శ్రీమన్నారాయణ.

English summary
Astrologer told the story about temple visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X