వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరీర అధిక బరువు, లావును తగ్గించే ప్రధాన యోగాసనాలు ఇవే

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: జీవితం తీర్చిదిద్దుకోవటానికి తరగని పెన్నిది విద్య అయితే, ఆ విద్యలో ఒక భాగము యోగము. ఈ యోగ విద్యలో ఉన్న ఆసనములు మానవజీవితానికి శాంతి, ఆనందమయ జీవనానికి యోగ ఎంతగానో ఉపయోగ పడుతుంది. యోగ,వ్యాయామ అనేవి మానవుని ఆరోగ్య జీవతానికి ఒక చక్కటి మార్గం అని చెప్ప వచ్చును.

ప్రతీ రోజు యోగా చేసేవారికి శరీరం వ్యాధి నిరోధ శక్తిని ఎక్కువ కలిగి ఉంటుంది.
రెగ్యులర్ గా యోగ ఆసనాలు వేసే వారికి క్యాన్సర్ మొదలైన అనేక జబ్బులకు నివారణ శక్తినిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి సహాకరిస్తుందని అధ్యయనంలో గమనించడం జరిగింది.మనిషి రోజు వ్యాయామం లేదా వాకింగ్ చేయడం వలన మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది.

కొంత మంది బద్ధకంతో ఇంట్లోనే కూర్చొని సమయాన్ని వృధాగా గడుపుతుంటారు,శరీరానికి శ్రమ లేకపోతే తద్వారా బరువు ఓంట్లో కొవ్వు పేరుకు పోయి శరీరం అధిక బరువుగా తయారు అవుతుంది. అలా శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది,ఆతర్వాత మనకు తెలియకుండానే ఊహించని ఆనారోగ్య సమస్యలకు గురిఅవుతాము.

జీవన విధానంలో తినే ఆహారానికి ఒక పద్ధతి అనేది లేకపోతే అనేక అనారోగ్య సమస్యలతో పాటు బరువు పెరగడం జరుగుతుంది.కొంత మంది ఎక్కువ కేలరీలు గల చిరుతిళ్ళు తినడం వలన అలా ఎక్కువ మోతాదులో తినడంమే కాకుండా శరీరానికి తగిన వ్యాయామం,శ్రమ లేకపోవడం వలన తీసుకున్న ఆహరం కొవ్వుగా మారి ఊబకాయని దారి తీస్తుంది.

ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు,యోగా గురువులు సూచించేది ఏమిటి అనగా మనిషి ఎంత బిజీ లైఫ్ గడిపినప్పటికి తన ఆరోగ్యాని దృష్టిలో పెట్టుకుని కనీసం వారానికి మూడు సార్లు 30 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం చేయడం లేదా రోజు ఒక కిలోమీటర్ దూరం వాకింగ్ చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కొంత సహాయపడుతుంది అని సూచించారు.

వాకింగ్ అంటే రోడ్ల వెంబడి కాకుండా పచ్చని ప్రకృతిలో తిగడం వలన ఆరోగ్యం ఏర్పడుతుంది.రోడ్లపై పెరిగిన కాలుష్యం కారణంగా ఆ దుమ్ము,దూళి,వాహనాల కాలుష్య పోగ వలన ఆరోగ్యం కంటే అనారోగ్యమే ఎక్కువగా జరుగుతుంది.ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి భారతీయ సిద్ధయోగులు సూచించిన వేల సంవత్సరాల నాటి 'యోగా' అభ్యసం ప్రస్తుతం పుణారావృతం అవుతుంది .

ఆధునిక కాలంలో శాస్త్రవేత్తలు ఆరోగ్య సాధన దిశగా వారు చేసిన పరిశోధనల ద్వారా అమెరికాలోని 'ఒహియో స్టేట్ యూనివర్శిటీ' మానసిక మరియు మనస్తత్వ ప్రొఫెసర్ నేతృత్వంలోని అధ్యయన మరియు "జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ " నిర్ధారన ప్రకారం వారి పరిశోధన ద్వారా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో ఒక రెండు వందల మందిని తీసుకుని వారు ఇంతకు ముందు యోగ,వ్యాయామం అసలు చేయనటువంటి రోగులను పరిశీలించడం జరిగింది.

అందులో సగం మంది రోగులు యోగాను పట్టించుకోకుండా ఉన్నవారే మరో ఇతర సగం వారు కంప్యూటర్, టీవి ద్వారనో వారానికి రెండు సార్లు ఒక గంటన్నర తరగతులను ఇలా 12 వారాల పాటు ఇంట్లోనే అభ్యాసం చేయడం జరిగింది. మూడు నెలల తర్వాత చికిత్స ముగిసే సమయానికి యోగా సాధన చేసే వారిలో తక్కువ అలసటను మరియు శక్తి అధిక స్థాయిని పొండడం గమనించి యోగా క్యాన్సర్ రోగులకు కూడా సహాయపడుతుంది అని నిర్ధారించడం జరిగింది. "జానైస్ కియోకల్ట్-గ్లాసర్" వారి రిపోర్ట్ లో తెలియజేసారు.

యోగాభ్యాసాన్నిమనం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది.రెగ్యులర్ గా యోగ చేయడం ద్వారా శరీరంలోని ఎక్కువ బరువును తొలగించడమే కాకుండా అనేక రకాలుగా ఆరోగ్యానికి సహాయపడుతుంది.మనకున్న అధిక బరువును తగ్గించుకోవడానికి అభ్యాస సాధన చేయడం కొరకు కొన్ని యోగా వ్యాయామాలను గమనిద్దాం.

యోగ మ్యాట్ లేదా కార్పెట్

యోగ మ్యాట్ లేదా కార్పెట్

ఆచరించ వలసిన పద్ధతులు :- వాస్తవానికి యోగాసనాలు ఉదయాన ఏమి తినక ముందే ఆసనాలు వేయాలి.సాయంకాలం చేసే వారు మాత్రం నిబంధనలు పాటించాలి. వ్యాయామం,ఆసనాలు వేయుటకు భోజనం చేసిన మూడు గంటల తర్వాత ,ద్రవ (లిక్వీడ్ ) పదార్ధాలు తీసుకున్న గంట తర్వత ఆసనాలు వేయాలి.మనం పీల్చే గాలిని నోటి ద్వార తీసుకోకూడదు,ముక్కు ద్వారనే శ్వాస పీల్చుకోవాలి.ఆసనాలు వేసే సమయంలో వేసుకునే బట్టలు వదులు (ఫీ) గా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.ఆసనాలు వేసిన తర్వత మూత్ర విసర్జన తప్పక చేయాలి,దీని వలన ఒక చోట చేరుకున్న శరీరానికి హాని చేసే మలిన కణాలు బయటకు పోతాయి.

ఆనారోగ్యంతో ఉన్నవారు,ఆపరేషన్లు చేసుకున్న వారు చేయకూడదు. స్త్రీలు గర్భావస్త సమయాలలో,పిరియడ్స్ సమయాలలో ఏ ఆసనాలనూ చేయకూడదు.ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒకరు రోజు ఉదయాన పరిగడుపుతో ఉన్నప్పుడు ఐదు తులసీ దళములను నమిలి మింగి నీళ్ళను త్రాగాలి. దీని వలన జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది,ఎసిడిటి మరియు ఇతర అనేక రోగాల నివారణకు ఉపయోగ పడుతుంది.రాగి చెంబులోని నీళ్ళను త్రాగడం చాలా మంచింది.

పని ఒత్తిడి వలన సమయం దొరకనివారు రోజు యోగా చేయలేని వారు కనీసం వారానికి మూడు సార్లు అయినా చేయాలి.రోజు సాధన చేసే వారిలో ఫలితం పూర్ణంగా ఉంటుంది.ఈ యోగాసనాలలో ప్రతి ఒక భంగిమలో 3 నుండి 5 సార్లు లోతైన ధీర్ఘ శ్వాసలను తీసుకుంటూ సాధన చేయాలి. ప్రతి ఒక వ్యాయామంలో ప్రధాన భంగిమను సాధన చేస్తూ ప్రారంభించండి.ఇలా కష్టంగా ఉంది అనిపిస్తే మీకు సులువైన విధంగా మార్చుకొండి.ఫలితాలను త్వరగా పొందాలి అనుకుంటే ప్రతి భంగిమలో 5 నుండి 8 శ్వాసలను తీసుకుంటూ రోజు రోజుకు సంఖ్యను పెంచుకుంటూ పోవాలి.

చక్రాసనము :-

చక్రాసనము :-

మోకాళ్ల నుండి కాళ్లు మడిచి పైకి ఎత్తాలి.కాళ్ల అరికాళ్ళు నేలపై ఆనించి ఉంచాలి.రెండు కాళ్లకు మధ్య కనీసం ఒకటిన్నర అడుగుల దూరం ఉంచాలి.రెండు చేతులు శిరస్సువైపునకు లేపి వెనుకవైపునకు రెండు అరిచేతులను నేలపై ఉంచాలి.రెండు అరిచేతులకి మధ్య కూడా కనీసం ఒకటిన్నర అడుగుల దూరం ఉంచాలి. ఇప్పుడు చేతులు మరియు కాళ్ల బలంతో పూర్తి శరీరమును నడుము నుండి వంచి పైకి ఎత్తాలి.చేతులను మెల్ల మెల్లగా కాళ్లవైపునకు తీసుకొనివచ్చి సంపూర్ణ శరీరం యొక్క ఆకారం వృత్తము లేదా చక్రమువలె చెయాలి.కళ్లను మూసుకుని ఉంచాలి.శ్వాసను స్వాభావికంగా ఉంచాలి.ఇలా ఒక నిమిషము నుండి ఐదు నిమిషాల వరకు అభ్యాసమును పెంచాలి.

 శలభాసనము:-

శలభాసనము:-


బోర్ల పడుకుని-చేతులు తలకు రెండువైపుల నేరుగా చాచి ఉంచాలి.అరచేతులు నేలకు తాకుతూ ఉండాలి.గడ్డం కూడా నేల తాకి ఉండాలి.కాళ్ళు దగ్గర దగ్గరగా ఉంచి పాదాలను పైవైపు చూస్తూ ఉండాలి.శరీరం మినివేళ్ళ నుంది తల వరకు నేరుగా ఉండాలి.రెండు పిడికిళ్ళు బిగించి,వాటిని గజ్జల దగ్గర పెట్టాలి.నడుము కింద నుండి కాళ్ళను గాలిలోకి లేపాలి.తిరిగి మొదటి భంగిమ స్థితికి రావాలి.ఇందులో క్రిందకు వంగే ప్రతీసారి శ్వాసను బయటకు విడవాలి.పైకి లేచే ప్రతిసారి శ్వాస తీసుకోవాలి.

నౌకాసనము:-

నౌకాసనము:-

బోర్లా పడుకుని.చేతులు తల చాచి అరచేతులు భూమికి అనేలా పెట్టాలి.శ్వాస తీసుకుంటూ కాళ్ళు,చేతులు,మోకాళ్ళు,మోచేతులు మడవకుండా చాచి ఉంచి పైకి లేవాలి. ఐదు సాధారణ శ్వాసలు ఈ భంగిమలో తీసుకున్న తర్వత యాదాస్థితికి రావాలి.

ధనురాసనము:-

ధనురాసనము:-


బోర్లా పడుకుని రెండు కాళ్ళు వెనక వైపునకు మడుచుకొనవలెను.చేతులు వెనకకు చాచి రెండు కాళ్ళు చీలమండలను పట్టుకొనవలెను.ధీర్ఘశ్వాస తీసుకుంటూ తల,ఛాతీ,తొడలు భూమిపై నుండి పైకి లేపాలి.ఆ తర్వాత శ్వాస బయటకు వదిలి వేయాలి.ఇలా ఐదు శ్వాసలు తీసుకునే వరకు ఉండి తిరిగి యధాస్థితికి రావాలి.

 హలాసనము:-

హలాసనము:-

వెల్లకిలా పడుకుని శ్వాస తిసుకుంటూ మోకాళ్ళు వంచకుండా 90 డిగ్రీల కోణంలో పైకెత్తవలెను.అరచేతులు నేలకానించి భూమిపై ఉంచవలెను.కాళ్ళు , నడుము మరింత పైకెత్తి నడుము వంచుతూ,కాళ్ళు తలమీదుగా వెనుకకు తీసుకువచ్చి నేలకు అనించుటకు ప్రయత్నించవలెను.ఇలా ఐదు శ్వాసలు తీసేంత వరకు ఈ భంగిమలో ఉండి తర్వత యధాస్థితికి రావాలి.

యోగ అనేది బరువును,స్థూల కాయాన్ని తగ్గించుకోవడానికి గల మార్గాలలో ఉత్తమమైనది. జిమ్మింగ్,పరుగెత్తడాలకంటే ఎంతో సులువైనది.యోగాసనాలను ఇంట్లోనే సాధన చేయవచ్చు.అనవసరమైన బరువులను ఎత్తాల్సిన అవసరం లేదు.ఇందులో ఉత్తమ విషయం ఏంటంటే దీనిని ప్రతి ఒక్కరూ వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబంలోని చిన్న,పెద్ద వాళ్ళు అందరూ కలిసి సాధన చేయవచ్చును.దీని వలన ఒక ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవనశైలితో కుటుంబం ముందుకు వెళ్తుంది.

అధిక బరువు,లావు తగ్గాలంటే రోజు తీసుకుంటున్న ఆహారం అలవాట్లను మనకు అనుకూలంగా మార్చుకోవాలి.సాత్వికమైన కాయగూరలన్ని తినాలి.దిన చర్యలో తప్పక ఆకు కూరలు,కరివేపాకు పోడి, క్యారేట్, కీరా, సోరకాయ, బీరకాయ, నిమ్మరసం, పండ్ల జ్యూసులు ఉండేలా చూసుకొవాలి.ఉదయాన పరిగడుపున గోరు వెచ్చని నీళ్ళను త్రాగాలి.రాత్రి డిన్నర్ ఆయ్యక అరగంట తర్వాత మజ్జిగలో త్రిఫలా చూర్ణాన్ని ఒకటి నుండి రెండు టీ స్పూన్స్ వరకు కలుపుకుని త్రాగాలి. మాంసాహారం, వేపుడు పదార్ధాలు, మైదా పిండికి సంబంధించిన ఆహార పదార్ధాలు, ఎక్కువ మాసాలా వంటలు,అజినమోటో,పిజ్జా,బర్గర్, స్వీట్స్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పోట్ట,తైస్,సీట్,ఊబకాయం,ఒంట్లో అధికంగా పేరుకు పోయిన కొవ్వు వలన శరీర ఆకృతి విచ్చల విడిగా పెరిగి పోతుంది. దీని వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.ఇలాంటి వారికి చక్కని చిట్కా ప్రతిరోజు ఉదయాన పరిగడుపున
20 పూదీన ఆకులను శుభ్రంగా కడుక్కుని రెండు గ్లాసుల నీళ్ళను ఒక గిన్నెలో పోసి అందులో పూదీన వేసి చిటికేడు పసుపు వేసి నీళ్ళను మంచిగా మరిగించి ఆనీళు చల్లారాక గాజు గ్లాసులో సగం నిమ్మకాయ రసాన్ని ఒక 'టి' స్పూన్ తేనేను ఈ ఉడికించిన పూదీన ఆకుల రసాన్ని వడగట్టుకుని కలుపుకుని తాగాలి.

ఇలా రోజు చేస్తే ఒంట్లో పేరుకు పోయిన కొవ్వు,బానపొట్ట క్రమేపి కరిగి మంచి శరీరాకృతితో పాటు చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.అలాగే అన్నంలో రోజు మూడు 'టి' స్పూన్ల కరివేపాకు పోడి ఒక 'టి' స్ఫూన్ నెయ్యి వేసుకుని తింటే కూడా మంచి ఫలితం ఉంటుంది,దీని వలన జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.

మనం త్రాగిన నీళ్ళు నాలుగు గంటల్లో బయటికి వెళ్లిపోవాలి. తిన్న ఆహార పదార్ధాలు 24 గంటల్లో బయటికి వెళ్లి పోవాలి,లేకపోతే అనారోగ్యం.

మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనం రోగస్థులం అవుతాం.పగటి నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఆదివారం మొదలగు సెలవులు అని ఎక్కువ సేపు పడుకోకూడదు.

ఎవరైన సరే సూర్యోదయం కంటే ముందు లేసినవారి ఆరోగ్యం అదుపులో ఉంటుంది. రాత్రి త్వరగా పడుకునే అలవాటు చేసుకుని బ్రహ్మీ ముహూర్తాన 3:30 నుండి 6 గంటలలోపే నిద్ర లేవాలి.మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణశక్తిని చేర్చే ఏకైక మార్గం యోగ అందుకే భారతీయ ఋషులు యోగ మార్గాన్నే అనుసరించారు.

రోజూ అర గంట యోగ,ధ్యానం చేయండి.ఈ నియమాల్ని పాటిస్తే మంచి శరీరం + ఆరోగ్యమైన జీవితం దక్కుతుంది.దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్ళండి సంపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవించండి.

English summary
Astrologer told the story about Yoga Asanas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X