వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనసును ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చా? మనసు మహోన్నతం అంటే ఏమిటి?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

మనసు మహోన్నతం అంటే ఏమిటో చూద్దాం. ఒక కొండ కొమ్మున చిట్ట చివర నిలబడి పైకి చూస్తే అంతులేని ఆకాశం కనిపిస్తుంది. అంచనాకే అందని ఆనందం కలిగి - చుట్టూ ఊహకందని విశాలత్వం, విశ్వ శూన్యం స్ఫురిస్తాయి. మరి మనం ఎంత? భూమికి బెత్తెడులేని ఈ అల్పాతి అల్పమైన మానవుడు భూమిని చాపలా చుట్టగలడు. సముద్రాన్ని అవపోశాన పట్టగలడు.ఆకాశాన్ని అంగలతో కొలవ గలడు.మరో స్వర్గాన్నే సృష్టించగలడు. అందుకు ఏ శరీరమో, బలమో, బలగమో, ధనమో, దర్పమో మరొకటో ఉపయోగపడదు.మనసు అదిచేసే సంకల్పం,అవే కీలకం.

మానవుడి జీవితంలో అతడి ఉనికిలో మనసే అతడినో మనిషిగా జీవరాసుల్లో ప్రధాన జీవిగా నిలబెట్టింది. అతడు సంకల్పిస్తే చివరకు బ్రహ్మగానే నిలబెట్టగలదు. అంటే మనసు చేయలేనిది ఏమీలేదు. ఇంక అద్భుతమైన బ్రహ్మాండమైన వనరును పొందికూడా మనం ఎందుకింత నిర్వీర్యంగా ఉండి పోతున్నాం ? మనసనేది మన సొంతం. మనలో ఉండేది. ముఖ్యంగా మనం సృజించుకునేది ప్రాథమికంగా అదో మట్టిసుద్ద, మైనపు ముద్ద, ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు.హంగులు మార్చుకోవచ్చు.

Astrologer told you can mould your soul.

ఇంకో అద్భుతమైన విషయమేమంటే - అదే మన శరీరతత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని కూడా మన సంకల్పాలను అనుసరించి మార్చే ఉపకరణం అవుతుంది. అలా మనం దాన్ని మార్చుకుంటే, కూర్చుకుంటే, చెక్కుకుంటే, అంటే విచిత్రంగా మనం ఎలా ఉండాలో ఏం కావాలో, ఎలా రూపాంతరం చెందాలో అలా మనల్ని తీర్చిదిద్దే బాధ్యతను మనం దానికి అప్పగించవచ్చన్న మాట. తర్ఫీదు ఇవ్వవచ్చన్నమాట. ఎంత అద్భుతం! మనసు రూపంలో మనకంటే అపురూపమైన వనరు, వరం భగవంతుడు ఇచ్చాడన్నమాట.

ప్రకృతిలో జీవులన్నీ దైవం తమకిచ్చిన వనరులతోనే, వసతులతోనే జీవన విధానాన్ని మలచుకుంటున్నాయి. కదలలేని చెట్లు వేళ్లతో నీళ్లు పీల్చుకుంటున్నాయి. ఆకులతో సూర్య రశ్మిని తీసుకుంటున్నాయి. పక్షులు ముక్కులతో ఆహారాన్ని అందుకుంటున్నాయి.క్రూర మృగాలు కోరపళ్లతో పదునైన గోళ్లతో వేటను దొరకబుచ్చుకుంటున్నాయి. అన్నీ ఉన్నవాటితోనే ఉన్నంతలోనే పైగా ఉన్నంతలోనే పరస్పర సహకారం,పరోపకారం కనబరుస్తున్నాయి. భగవంతుడి సృజనను సార్థకం చేస్తున్నాయి.
మనిషికి అన్ని అవయవాలతోపాటు రారాజైన మనసునూ ఇచ్చాడు.

అవయవాలైతే వేటిపని అవే చేస్తాయి.వాటి పరిమితి అంతే. మరి మనసు? అది రారాజు. దానిమాట అన్నీ వింటాయి. అన్నింటితో పని చేయించుకోగలదు. అన్నింటి మీదా అజమాయిషీ చలాయించగలిగిన మనసు మనం అదుపు చేయగలిగితే సద్వినియోగం చేసుకోగలిగితే అద్భుతాలు చేయగలదు. అనంతుడినైనా దించగలదు.
దేనికి నిర్దేశించిన పని అది చేయాలి.మనసు పని ఇంద్రియాలకు పనిని పురమాయించడం మాత్రమే కాదు. అత్యంత ఉన్నతమైన ఉత్కృష్టమైన పనిని దానికోసం కేటాయించాడు భగవంతుడు.

భగవత్తత్వాన్ని మోసుకునే సాధనామార్గంలో అన్నీ తానై మనిషిని సాధకుణ్ని ఉన్నత భూమికలకు నడిపించేది మనసే. మొదట్లో మొండి ఘటంలా చెప్పిన మాట వినని చిన్నపిల్ల చేష్టలా కనిపించే మనసు తరవాత ఎంతో హుందాగా బాధ్యతగా తన బాధ్యతలోని అవసరాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన పరిణతితో సాధకుణ్ని తన వెంట వేలుపట్టి నడిపిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. చివరకు తన కర్తవ్యాన్ని ముగించిన తృప్తితో క్రమక్రమంగా తనలోతాను లయమవుతూ అంతర్థానమైపోతుంది.మనసు పని ఎంత ఉత్కృష్టమో, అదెంత త్యాగశీలో దాని కర్తవ్యాన్ని అది ముగించే విధానంలోనే మనకు అర్థమవుతుంది.

English summary
Astrologer told you can mould your soul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X