వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికారినామ సంవత్సరంలో నాయకులు, ప్రాంతాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

1.రాజు - శని ,
2.మంత్రి -రవి ,
3.సేనాధిపతి -శని,
4.సస్యాధిపతి-కుజుడు ,
5.ధాన్యాధిపతి-చంద్రుడు ,
6.అర్ఘ్యాధిపతి -శని ,
7.మేఘాధిపతి-శని ,
8.రసాధిపతి-శుక్రుడు,
9.నిరసాధిపతి -కుజుడు.

*** రాజు ( శని ) అవ్వడం కారణంగా :-

* పరిపాలనలో పలు సంఘర్షణలు చోటు చేసుకుంటాయి.

* ప్రక‌ృతి వైపరిత్యాలు ఉంటాయి.

*ఆధినిక టెక్నాలజీతో పరిపాలన సామర్ధ్యం పెంచుకుంటారు.

*తెలంగాణ రాష్ట్రంలో కొత్త వింతలు కొన్ని చూడవలసి వస్తుంది.

Astrologers predictions about states and political leaders

* రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదాలు బలపడతాయి.

* ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వాలను ఇబ్బంది కలిగిస్తాయి.

* పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి పనులు వేగవంతంగా కాగలవు.

* పంటలు మాధ్యమంగా పండును.

* వర్షాలు విచిత్రంగా కురియును .

* దొంగల భయం ఉంటుంది.

* చిరు ధాన్యాలు అధికంగా పండుతాయి.

* అవినీతి పరుల ఆగడాలు విచారించ బడుతాయి.

*న్యాయ స్థానాల ప్రాముఖ్యత, విచారణ కమీటిల ప్రాధ్యాన్యత పెరుగుతుంది.

* కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.

* పేదవారి కనీస అవసరాలు తీరుతాయి.

* నియంతృత్వ దోరణి, రౌడీయిజం, దోపిడిలు, అవినీతికి తెరపడుతుంది.

*తెలుగు రాష్ట్రాలలో రాజకీయ మార్పులు జరుగుతాయి.

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పక్షపార్టీ అధికారం లోకి, అధికార పార్టీ ప్రతిపక్షంలోకి వస్తుంది.

*నలరేగడి భూములు ఉన్నంతలో వ్యవసాయం బాగుంటుంది.

* " గో " సంరక్షణ కేంద్రాలు అధికం అవుతాయి.

* భయంకరమైన ప్రకృతి నిర్దయ చవి చూడవలసి వస్తుంది.

*** మంత్రి - ( రవి ) అవ్వడం కారణంగా :-

* నకిలీ మందులు ఎక్కువ చలామణి అవుతాయి.

* వైద్య సేవ ( వ్యాపారం ) మిన్నంటుతుంది ( కనికరం లేని "కమర్షియల్ " వైద్యం అవుతుంది )

*విడాకులు తిసుకునేవారి సంఖ్య అధికం అవుతుంది.

* అధికార స్థానాలలో స్త్రీలకు పెద్దపీట వేస్తారు.

* పోటీ పరీక్షలలో స్త్రీలదే పై చెయ్యి.

* ఈ సారి ఎండలు గతం కంటే ఎక్కువగా ఉంటాయి.

*ఎక్కువ శాతం సంతాన సాఫల్య కేంద్రాలు మోసపూరితమైనవే వెలుస్తాయి, తస్మాత్ జాగ్రత్త .

*దొంగ స్వామిలు, గురువుల భాగోతాలు భయట పడుతాయి, కలిమాయ, అయిననూ ప్రజలు అలాంటి వారినే నమ్ముతారు.

* ఆధ్యాత్మిక కేంద్రాలలో అనేక అవకతవకలు, అసభ్యకరమైన సంగతులు బయట పడతాయి.

* ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కువైతాయి.

* వింత రోగాలు, అగ్ని భయములు ,ఉగ్రవాద చర్యలు , యుద్ధ భయములు కనబడతాయి.

* అనావృష్టి -అవసరానికి వర్షాలు పడవు.

*** సేనాధిపతి ( శని ) అవ్వడం కారణంగా :-

* యుద్ధం అనివార్య సూచనలున్నాయి.

* అదే కోణంలో అంతర్యుద్ధం కూడా తప్పదు .

*తీవ్రవాద కార్య కలాపాలు ఎక్కువవుతాయి.

*ఈ సారి ఎక్కువ మంది తీవ్రవాదులను మన సైన్యం మట్టి కరిపిస్తారు ( చనిపోతారు).

* అశ్లీల చిత్రాలు , సాంప్రదాయనికి విరుద్ధమైన చిత్రాలు ,వాస్తవాన్ని వక్రీకరించి యువతను,సమాజాన్ని పెడత్రోవ పట్టించే చిత్రాలు ఎక్కువైతాయి.అలాంటివే ఆదరించ బడుతాయి.

* సి.సి కెమెరాల కళ్ళు కప్పే దొంగలు బయలుదేరుతారు. స్మగ్లింగ్ ,నేరాలు అధికమైనను మన పోలీసు రంగంవారు వారి చాక చక్యంతో పట్టుకుని అదుపులోకి తెస్తారు.

* ప్రకృతి వైపరీత్యాలలో రక్షణ శాఖ బుద్ధిబలంచే ప్రాణ నష్టాన్ని తగ్గిస్తారు.

*ఇస్రో సంస్థవారిచే నెలకొల్పే రాకెట్ విజయవంతతో కీర్తి పతాకం సాధిస్తుంది.

*** ధాన్యాది పతి ( చంద్రుడు ) అవ్వడం కారణంగా :-

* ధాన్యం , పట్టి , మిర్చి పసుపు, పొగాకు పంటలు బాగా పండును.

* తెల్లని పంటలకు అనుకూలం .

* పశువులు బాగా పాలు ఇస్తాయి.

* నీటి వ్యాపారం , విద్యా వ్యాపారం, మద్యం వ్యాపారానికి మూడుపువ్వులు ఆరుకాయలు.

* విదేశీ వ్యామోహలు పెరిగిపోతాయి.

* ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి.

*ప్రేమలు ,ప్రేమ పెళ్లిలు 75 శాతం విఫలం అవుతాయి.

*నీటి (జలగండ ) ప్రమాదాలు ఎక్కువగా పొంచి ఉన్నాయి. ఈతలకు వెళ్ళేవారు జాగ్రత్త.

*నేర రంగంలో స్త్రీల పాత్ర ఎక్కువైతుంది ,ఇది కలిమయ.

* మహిళా కమీషన్ లాగా పురుషులకు కమీషన్ ఉండాలనే అభిప్రాయం వస్తుంది.

* వారి పంట పుష్కలంగా పండుతాయి.

*** అర్ఘాధిపతి ( శని ) అవ్వడం కారణంగా :-

* వర్షాపాతం మధ్యస్తంగా ఉంటుంది.

* పుణ్య నదులకు ప్రతికూల కాలం.

* నీటి వ్యాపారం బాగా పెరిగి పోతుంది.

* హిమాలయ పర్వత ప్రాంతాలకు ప్రతికూల కాలం.

* సముద్ర తీర ప్రాంత పట్టనములకు సంకట స్థితి.

* భూకంపాలు సంభవిస్తాయి.

* అతి వేగవంతమైన గాలులు ,విచిత్రమైన వర్షాలు ఉంటాయి.

* వడగళ్ళ వనాల వలన తీవ్రమైన నష్టాలు కలుగుతాయి.

* జలభీభాత్సవాలు సంభవించడం వలన జనాలు ఇబ్బంది పడతారు.

* ప్రకృతి ముందు మానవుడు బలహీనుడు అని మరొక సారి నిరూపణ జరుగుతుంది.

*** మేఘాధిపతి ( శని ) అవ్వడం కారణంగా :-

* నైరుతి ఋతు పవనాలు కొంచం ఆలస్యం అయిననూ ఆశలు చిగురిస్తాయి.

* ఏప్రిల్ ,మే నెలల్లో హైదరాబాద్ ,బాంబే ,మద్రాస్ ,బెంగుళూర్ లలో దద్దరించే పిడుగు శబ్దాలతో వర్షాలు పడతాయి.

* ఆగష్టు ,సెప్టెంబర్,అక్టోబర్ నెలలో వర్షాలు పడతాయి.

*** రసాధిపతి ( శుక్రుడు ) అవ్వడం కారణంగా :-

* అశ్లీలత ,అపహాస్యం గల కళలు ఎక్కువైతాయి.

*యువత పెడత్రోవ పట్టడానికి డ్రగ్స్ ప్రభావం ప్రధాన కారణం అవుతుంది.

* మైనారీటి తీరని పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు పడతారు.

* ఆరోగ్యనిచ్చే పండ్లు ,ఆకు కూరలు సహజత్వాన్ని కోల్పోతాయి ( కల్తీ ).

* నీళ్ళ వ్యాపారం ,పాల వ్యాపారం గోరంగా ఉంటాయి ( కల్తీ ).

* ప్రకటనల ఆకర్షణలకు మోసపోయి మోసపోతారు.

* నకిలీ స్వాములు,బాబాలు పుట్టుకొస్తారు.

*** నిరాసాధిపతి ( కుజుడు ) అవ్వడం కారణంగా :-

* ఉగ్రవాద చర్యలు కొన్ని భగ్నం అయిన వాటి తాలూకు విధ్వంసాలు దేశంలో సంభవిస్తాయి.

* రాజకీయాలు పూర్తిగా దిగాజరుతాయి.

* పిల్లలు పెద్దల మాటలు వినరు.

* నకీలి వస్తువుల తయారీ అధికమౌతాయి.

* ఆధ్యాత్మిక రంగాలలో పోటీ తత్త్వం పెరుగుతుంది.దాడుల సూచనలున్నాయి.

**** పశుపాలకుడు ( బలరాముడు ) స్థాన రక్షకుడు ( బలరాముడు ) సంవత్సర అధిపతి ( శని )అవ్వడం కారణంగా :-

* పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది .

* పరిశ్రమలు అన్ని అనుకూలం .

* కొన్ని ప్రాంతలలో ఎక్కువ కొన్ని ప్రాంతలలో తక్కువ వర్షం పడును.

* అధిక వేడి ,అధిక వర్షం వలన అనేక వింత వ్యాదులు వస్తాయి.

* కార్తీక ,పుష్య మాసాలలో ( నవంబర్,డిసెంబర్ ) తుఫానులు ఉంటాయి.

*** వికారి నామ సంవత్సర పంచాంగ ఫలితా ఆధారంగా దేశ ,రాష్ట్ర గోచార ఫలితాలు***

* దక్షిణ భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం ధాన్యాపు భాండాగారం అవుతుంది.

* ఈ సంవత్సరం గత సంవత్సారాల కంటే ఎండలు తీవ్రంగా మండుతాయి.

* తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తిరిగి పుంజుకుంటాయి.

* తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల హవా నడుస్తుంది.

* భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు 80 శాతం తలక్రిందులు అవుతాయి.

*పెళ్ళిలకు సంబంధించిన మోసాలు ఎక్కువైతాయి.

విదేశీ వ్యామోహ పెళ్లి సంబంధాలలో దారుణంగా మోసపూరితంగా ఉంటాయి.తస్మాత్ జాగ్రత్త.

* హిమాలయ పర్వత ప్రాంతాలలో ,నేపాల్ తో సహా భూ కంపాలు ఉంటాయి.

*నరేంద్ర మోడీ గారికి జాతక రిత్య అగ్ని పరీక్ష కాలమే ,ఈ సారి ఎలక్షన్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

* బిజెపి కి గతం లో మాదిరి కాకుండా తక్కువ సీట్లు వస్తాయి.మొత్తానికి నెగ్గుక వస్తారు.

* జల ఉపద్రవాలు మళ్లీ అమెరికాను తీవ్ర ఇబందుల పాలు చేస్తాయి.

* రైతులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.

* లోకసభ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీ 16 సీట్లలో ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటుంది.

* ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు.టి.డి.పి ప్రతి పక్షంలో ఉంటుంది.

పవన్ కళ్యాన్ గారికి 10 నుండి 20 సీట్లు వస్తాయి ,టి.డి.పి కి 30 నుండి 50 లోపు సీట్లు వస్తాయి.జగన్ గారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత అనుకులమైన సీట్లు సాధించు కుంటారు.

* ప్రకృతి భీభత్సవాలలో ఆంధ్ర ప్రదేశ్,తమిళనాడు ,ఒరిస్సా మరియు సముద్ర తీరప్రాంతాలు ఇబ్బందులను ఎదుర్కొంటాయి.

* రాహుల్ గాంధీ గారి జాతకం అనుకూలంగా ఉంది,గతం కంటే ఎక్కువగా ఈ సారి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలలో సీట్లు కైవసం చేసుకుంటుంది.

* ఢిల్లీ లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.

*స్త్రీలపై టీవి సీరియల్ ప్రభావాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి.

* ఎక్కువ శాతం బిజెపి ఆశలు పెట్టుకున్న స్థానాలు ,నాయకులు నీరు గారుస్తారు.

* ఎన్.డి. ఎ పార్టీ కి ఇతరుల మద్దతు అవసర పడుతుంది.ఒక వేల మోడీకి ఇతర మిత్ర పార్టీలు సపోట్ చేయకపొతే "హంగ్ " లోక సభ ఏర్పడుతే మల్లి రెండు సంవత్సరాలలోపు లోక సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది.

* తీవ్ర వాదులతో అత్యంత జాగ్రతలు అవసరం.

* ఉత్తర భారత దేశంలో మరియు చైనా దేశంలో భూ కంపాలు ఉంటాయి .

* రాహు గ్రహా ప్రభావం వలన పేకాట ,జూదం ,క్లబ్బులు ,పబ్బులు ,కులాంతర .మాతాంతర వివాహాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎక్కవ అవుతాయి.డూప్లికేట్ అధికారులు ఎక్కువ అవుతారు జాగ్రత్త.

* జల గండాలు ఎక్కువ సూచిస్తున్నాయి ఈతలకు వెళ్ళే వారు జాగ్రత్త .

*జాడ తెలియని విమానాలు .

* ఇంట్లో నుండి పారిపోయే వారి సంఖ్యా అధిక మౌతాయి.

* వైద్యంలో చాలా మంది ప్రజలు మోసపోతారు ( డబ్బులు అన్యాయంగా వైద్య కేంద్రాలు దండుకుంటాయి )

* కుల వృత్తులు రోజు రోజుకి అంతరించి పోతాయి.

* హైదరాబాద్ లో ఉగ్రవాదుల కార్య కలాపాలు తస్మాత్ జాగ్రత్త .

*బాలీవుడ్ ప్రముఖ నటుడికి గడ్డు కాలం .

* ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు సినిమా రంగం లేదా దేశంలోని ప్రముఖులలోని ఒకరికి ప్రాణ సంకటం పొంచి ఉంది.లేదా భూ కంపం అయిన వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది.

* ఈ సంవత్సరం అనుమానాస్పద మృతుల సంఖ్య అధికం.

* ఉల్లి, టమోటో కొంత కాలం సామాన్యులకు దూరంగా ఉంటుంది.

* రాబోయే లోక సభ ఎన్నికలకలో ప్రముఖులు ఓడిపోతారు.

* రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవికి దగ్గరి అవకాశంలో ఉన్న స్వీకరించాడు . అవసరం అయితే తను సూచించిన వ్యక్తీ ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది.

* శీతల పానీయాల వలన అనారోగ్యం చోటు చేసుకుంటుంది.మజ్జిగా ,కొబ్బరిబోండా ,నిమ్మ రసం మొదలగునవి మాత్రమే శరీరానికి మేలు చేస్తాయి.

* కే.సి.ఆర్ హావా పార్లమెంట్ సీట్లలో ఉంటుంది.ఎక్కువ సీట్లు సాధిస్తారు.

* సంతానా సాఫల్య కేంద్రాలు 98 శాతం మొసపూరితమైనవే,ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి.

* హైదరాబాద్,డిల్లీ,బొంబాయి, కోల్ కతా, నాగ పూర్ మొదలగు ప్రముఖ నగరాలకు ఉగ్రవాదులతో ముప్పు వాటిల్లనుంది, జాగ్రత్తలు అవసరం.

*దేశంలో ప్రకృతి భీభాత్సవాల వలన హై అలర్ట్ వచ్చే సూచనలు ఉన్నాయి.

* హెలికాప్టర్ ,విమానాల ప్రమాదాలు -ప్రముఖుల మరణాలు సూచించ బడుతున్నాయి.

* జి.జె.పి (ఎన్ .డి. ఎ) రాకపోతే లోక సభ పూర్తికాలం ఉండదు.

* భారత దేశం సుభిక్షంగా ఉండాలంటే దేశాన్ని ఎవరైతే రక్షిస్తారో ,ముప్పుల నుండి ధైర్యంగా ,యుక్తిని ప్రదర్శించి కాపాడే వ్యక్తిని ,బందు ప్రీతి లేని వ్యక్తిని ప్రధాని సీట్లో కూర్చో బెడితే భారత దేశం ప్రగతి పథవలో నడుస్తుంది. ప్రపంచంలో పేరు గాంచుతుంది.

* గోమాత రక్షణ ,సేవలు చేయండి భూమి మీద ఉపద్రవాలు తొలగుతాయి. పశు ,పక్ష్యాదులకు ఈ ఎండా కాలం నుండి వాటి రక్షిచుట కొరకు కొన్ని ధాన్యపు గింజలు , త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. ఇలా చేస్తే మీకు నవగ్రహ అనుకూలతలు పెరిగి శుభాలు కలుగుతాయి.

English summary
The results of this diaphragm effect are given by the perspectives of the gravestones and the glands. These results are from the minds of all sections. You can see the entire detail through your personal horoscope. So you can contact your experienced scholars who are available to you for your complete horoscopes, and ask them to get horoscope and details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X