వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహర్నవమి మహాత్యం: పురాణ గాథ..

ఇప్పడు రాజకీయ ప్రయోజనం లేకపోయినప్పటికీ సామూహిక పూజావిధానం ఒక సంప్రదాయంగా ఈనాటికీ అమలులో ఉంది.

|
Google Oneindia TeluguNews

మన పండుగలు, నోములు ఒక సాంఘిక ప్రయోజనాన్ని ఆశించి నిర్ణయింప బడ్డవే. అదీకాక ఈ పండుగలలో కొన్నింటిని ఒక లబ్దికోసం ఆధునికులు ఉపయోగించారు. వినాయకచవితిని తిలక్ మహాశయుడు ప్రజలను స్వాతంత్రోన్ముఖు ల్పిగా చేయడానికి ఉపయోగించాడు.

ఆ తరువాత "విజయదశమి' తరతమ భేదాలు మరచి అందరూ సమాన మేనన్న సాంఘిక ప్రయోజనాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ విధమైన లక్ష్యాన్ని సాధించటంకోసం విజయదశమి పండుగ చేసుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.

Recommended Video

Simple Prasads for Nine days of Navratriనవరాత్రుల కోసం సులువైన 'నైవేద్యాలు' మీకోసం | Oneindia Telugu

ఇప్పడు రాజకీయ ప్రయోజనం లేకపోయినప్పటికీ సామూహిక పూజావిధానం ఒక సంప్రదాయంగా ఈనాటికీ అమలులో ఉంది.
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమికల మాసం ఆశ్వీయుజమాసం. శరద్రుతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వయుజశుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి.

Astrological significance of Mahanavami

తొమ్మిదిరోజులు దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీనవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరద్రుతువులో జరుపుకుంటారు గనుక శరన్నవ రాత్రులని కూడా అంటారు. ఈ పండుగలలో రామభక్తిభావం ఉత్తుంగతరంగంగా దేశాన్నంతటిని ముంచెత్తుతుంది. ఉత్తరభారతంలో పల్లెలు, పట్టణాలలో "రామలీల"

ఉత్సవాలు నెలరోజులు ముందుగానే ప్రారంభం అవుతాయి. చివరిరోజైన దశమి (విజయదశమి) నాడు "రావణవధ" మహాకోలాహలంగా జరుగుతుంది. అంటే చెడును జయించి మంచికి పట్టంకట్టటమన్నమాట. ఆ విధంగా విజయాన్ని చేకూరుస్తుంది కనుక దీనిని విజయదశమిగా వ్యవహరిస్తారు.

అదీకాక జ్యోతిషశాస్త్ర ప్రకారం కూడా ఈ దశమిని విజయయాత్రకు అంటే సాఫల్యతకు ముహూర్తంగా నిర్ణయిస్తారు. కొన్ని ప్రాంతాలలో విజయదశమి "అపరాజితాదశమి" అనికూడా వ్యవహరిస్తారు. కారణం ఈ రోజున ప్రారంభించిన పనులు ఎప్పడూ విజయవంతం కావటమే. లౌకికమైన పూజలతో ఈ విజయదశమికి శాస్త్రీయవిధి కూడా వుంది. ఈ రోజున శమీవృక్ష పూజచేస్తాం.

అజ్ఞాతవాసారంభంలో అర్జునుని గాండీవంతో పాటు పాండవుల ఆయుధాలన్నీ ఈ శమీవృక్షంలోనే దాచుటమే! అందుకు కారణం. రామచంద్రుడు కూడా తాను విజయ యాత్రకు బయలుదేరేముందు జమ్మిపుజ చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి.

శమీ శమయతేపాపం శమీ లోహత కంటకా 1
ధారిణనరునబాణానాం రామస్య ప్రియవాదినీ II
కరిష్యమాణ యాత్రాయాం యధాకాలం సుఖంమమ |
తత్రనిర్విఘ్న కర్రీత్వం భవశ్రీ రాజపూజితే |
ఈ మంత్రాన్ని జపిసూ శమీపూజ చేస్తాం. ఆనాడు "జమ్మి" ఆకును "బంగారం"లా! భావించి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పకుంటూ ఇచ్చుకుంటారు.

ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష దశమి రోజున సంధ్యాసమయంలో నక్షత్రాలు essoãoes కనబడినప్పడు సరిగ్గా ఆ సమయంలో "విజయ" అనే ముహూర్తం ప్రారంభం అవుతుందని జ్యోతిష్కులు చెప్పారు. ఈ ముహూర్తంలో మొదలుపెట్టిన ప్రతిపని విజయవంతం అవుతంది.

ఆశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే
సకాలో విజయోట్టేయః సర్వకార్యార్థసిద్ధయే

ఈ విషయాన్ని శంకరుడు పార్వతికి చెప్పినట్లు మన గ్రంథాలు తెలియ జేస్తున్నాయి. మూలానక్షత్రం సప్తమినాడు సరస్వతిపూజ, అష్టమినాడు దుర్గాదేవిపూజ (దుర్గాష్టమి), నవమినాడు ఆయుధపూజ (పరిశ్రమలలో యంత్రాలకు పూజలుచేసి బలులు ఇస్తారు), దశమినాడు విజయదశమి జరుపుకుంటూ శమీపూజ చేస్తారు, పలుప్రాంతాలలో దశావతారాలతో పూజలు చేస్తారు.

గర్ధంతి శైలశిఖరేషు విలంబి బింబా మేఘావియుక్త వనితా హృదయానుకారాః
ఏషాం రవేణ నహసోత్పతి తైర్మయూరైః ఖలవీజ్యతే మణిమయైరివ తాలవృంతైః
అని ప్రథమావతారంతో ప్రారంభం అవుతుంది, దశావతారాల అలంకారం, దీనికి మన తెలుగునాట మరో విశిష్టమైన ప్రయోజనంకూడా ఉంది.

పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలను తీసుకొని వారి వారి ఇండ్లకు వెడతారు. అక్కడ పిల్లలకు పప్ప బెల్లాలు పంచిపెడతారు. ఉపాధ్యాయులకు దక్షిణాదులిస్తారు. ఇందువల్ల పల్లెల్లో కలుపుకోరుతనము పెరుగుతుంది. ఒకరికొకరు పెద్దలు పరిచయం చేసుకుంటారు. ఇది ఒకనాటి సంప్రదాయం.

అయ్యవారికి చాలు అయిదు వరహాలు పిల్లలకు చాలు పప్పుబెల్లాలు అని పిల్లలు పాటలు పాడుకుంటూ ఇంటింటికీ తిరుగుతారు. అయ్యవార్లు పిల్లలచేత "మహర్నవమిగడలు" అని కట్టిస్తారు. అందులో ఏడుకులాలదారాలను ఒకదానిపక్కన ఒకటిగా గాలిపటాల ఆకారంలో కట్టి ఇంటింటికి తిరుగుతారు. "కులము" అంటే రంగు అనిఅర్ధము. దీనివల్ల పల్లెల్లో "కలర్బైన్" ఏర్పడుతుంది.

ఏ రంగు పక్కన ఏ రంగు బాగుంటుందో అన్నది విశదంగా తెలుస్తుంది. ఈ సందర్భముగా పోతనామాత్యుడు రచించిన నారాయణ శతకంలోని "ధరసింహాసనమై" అన్న పద్యాన్ని పిల్లలచేత కంఠస్థం చేయించి, చదివిసూ తిరుగుతారు. ఈ పద్యం మన కళ్లముందు ఓ భూగోళాన్ని చూపిస్తుంది.
ఈ ఉత్సవాలతోపాటు దేవీ నవరాత్రిపూజలు (వ్రతాలు) జరుగుతాయి.

రామాయణ కాలం నాటికే శ్రీదేవీ నవరాత్రిపూజలు జరుపుకోవడం ఆచారంగా ఉండి రావణుడు సీతా మహాసాధ్విని అపహరించుకొని పోయినప్పడు శ్రీరాముడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అప్పడు శ్రీదేవీ నవరాత్రి వ్రతాన్ని ఆచరించ వలసిందిగా నారదమహర్షి శ్రీరామచంద్రునికి ఉపదేశించాడు (దేవిభాగవతం - ౩వ స్కంధము) వ్యాసభగవానుడు.

"... నవరాత్రి వ్రతం శుభం/శరత్కాలే విశేషణాకర్తవ్యం విధిపూర్వకం." అని కాలప్రాశస్త్యాన్ని చెప్తాడు. ఈ ప్రతాన్ని తొమ్మిదిరోజులు "దేవీనవరాత్రి వ్రతంగా" ఆచరించి విజయదశమిరోజున ప్రతసమాప్తి చేస్తారు. ఈ విధంగా దసరాఉత్సవాలు సాంఘిక ప్రయోజనాలను, కాలనియమాలను తెలియజేస్తాయి.

English summary
In Hinduism, Mahanavami has great significance for the occult among the Saktheyas. Followers of Lord Vishnu, the Vaishnavas perform special pujas and rituals on this day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X