వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిషం: 2017లో భారత్‌లో పరిణామాలు

భారతదేశంలో 2017లో సంభవించే పరిణామాలను జ్యోతిష్కుడు ఇలా వివరిస్తున్నారు. దేశంలో పలు మార్పులు జరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

2017 సంవత్సర నాయకులు, వీరిలో మొదటి తొమ్మిది మంది ప్రధాన నాయకులు, మిగిలిన వారు ఉపనాయకులు. వీరిని బట్టి ఈ సంవత్సర కాలంలో భారతదేశంలోని ప్రజల మనోవృత్తుల గణనములు, శుభాశుభ విషయములలో ఎట్ల ప్రవర్తించునో తెలియును. ప్రకృతమున ఈ సంవత్సరము 9 మంది ప్రధాన నాయకులలో 4 శుభులు. 21 మంది ఉపనాయకులలో 10 మందికి శుభత్వం కలిగినది. కాగా ఈ సంవత్సరము లాభనష్టాలు రెండు కూడ తీవ్రస్థాయిలో కన్పిస్తున్నాయి.

ప్రజలు, నాయకులు కూడ తీవ్రముగా ఆలోచిస్తారు. తీవ్రముగా ప్రయత్నిస్తారు. రాజ్యాధిపత్యం శుక్రుడికి, మంత్రిత్వం బుధుడికి రావటం వల్ల అన్ని రంగాలలోను, ఆర్థిక వ్యూహాలలోను పొంతనలతోను, సమగ్ర సమన్వయము తోను కూడిన ప్రణాళికలు వెలువడును. అలాగే అంతర్జాతీయ స్నేహసంబంధాల వలన మన నాయకులు విదేశముల నుండి ఋణ ఆర్థిక సహాయమును అధికముగా తీసుకొని రాగల సూచనలు ఉన్నాయి. కాని ఆ లాభములు ప్రజలను చేరులోపల అనేక రంధ్రములు ఏర్పడి కొన్ని చిక్కులు వచ్చును.

అలాగే సమాజంలో అతివాద, తీవ్రవాద ధోరణులను పెరిగినప్పటికిని వాటి అణచివేత కూడ అంతే తీవ్రంగానే ఉండే సూచనలున్నాయి. అలాగే అంతర్గత రక్షణ వ్యవస్థలోను, సైనిక వ్యవస్థలోను కూడ చెప్పుకోదగ్గ విజయాలను సాధిస్తారు. కాగా, జాతీయం గాను, అంతర్జాతీయంగాను కొన్ని ఒత్తిళ్నఎదుర్కొనప్పటికిని నాయకులు,దృఢసంకల్పంతోనే వ్యవహరిస్తారు. ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు తీవ్రంగా లేచినప్పటికీ వాటి అణచివేత కూడ తీవ్రం గానే ఉండే సూచనలు ఉన్నాయి.

గందరగోళాల మధ్య శుభాలు..

గందరగోళాల మధ్య శుభాలు..

ఇన్ని గందరగోళాల మధ్యలో కొన్ని దీర్ఘకాలిక శుభ పరిణామాలు కూడా ఆశాకిరణాలుగా కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు తగాదాలలో మన దేశానికి కొన్ని నూతన విజయాలు అంద వచ్చు. అంతర్ రాష్ట్రీయ జల వివాదాలలో కొంతవరకు సామరస్యమైన సర్దుపాటుదనము కనిపించవచ్చును. పరిశ్రమలు, భారీపరిశ్రమలు ఈ ఏడు కూడ ముందడుగు వేస్తాయి. వ్యవసాయాభివృద్ధికి మధ్య మధ్య అవాంతరాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఋతుపవనాలు ఆలస్యమై వర్షాభావ పరిస్థితులు ఎదురు అవుతాయి. తుఫానులు పెరిగినప్పటికీ, పంటలకు పెద్దగా దెబ్బ తగలకపోవచ్చు.

మత ఉద్రిక్తతలను అణచేయడంలో ఇలా...

మత ఉద్రిక్తతలను అణచేయడంలో ఇలా...

మన విదేశీ వాణిజ్యం పెరిగే సూచనలు ఉండుట ఇత్యాది అంశములను పునాదిగా పెట్టుకొని వర్షలగ్న జగల్లగ్నాలను విచారణ చేయగా - అక్కడక్కడ మతసంబంధ విషయాలలో చోటు చేసు కుంటున్న ఉద్రిక్తలను అదుపు చేయటంలో ప్రభుత్వం సఫలీకృత మవుతుంది. దశమ, ఏకాదశ స్థానములను పరిశీలించగా చట్ట విరుద్ధమైన పనులు జరుగుచున్నప్పటికిని, వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడంలో ప్రభుత్వము విఫలమవుతుంది.

ఆదాయం తగ్గుతుందా..

ఆదాయం తగ్గుతుందా..

వివిధ రంగాల ద్వారా రావలసిన ఆదాయం తగ్గు సూచనలు ఉన్నాయి. కాగా,చట్టపరమైన వ్యవహారాలు మాత్రము గత సంవత్సరము కంటే కొంతమేర వృద్ధి చెందుతాయి. కాగా, గ్రామీణ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ కృషికి తగిన ప్రతిఫలము లభిస్తుంది. ద్వాదశ స్థానమును పరిశీలించగా గత ఏడాదివలె ఈ ఏడు కూడ ప్రభుత్వవైఫల్యంతోరాష్ట్రంలో ఆరోగ్యపథకములు వంటి ప్రజోపయోగ పనులకు తీవ్ర అంతరాయాలు, నష్టం ఏర్పడి సామాన్య జనజీవనానికి అవి అందని ద్రాక్షపళ్ళ వలె క్లిష్టం కావచ్చు. కాగా, ప్రభుత్వం అట్టి వారిని అదుపు చేయటంలో కొంతవరకే విజయం సాధిస్తుంది. జగల్లగ్నమైన తులను పరిశీలించగా గత సంవత్సరమునకు వలె కేంద్ర ప్రభుత్వ పాలకుల సమర్ధత, ఆలోచనలు, వ్యవహారాలు, ప్రాంచుకున్న నిర్దేశక సూత్రాలకు అనుగుణముగా, ప్రజోపయోగికరముగా వ్యవహారాలలో కొంత సామరస్యధోరణులు పెరుగుతాయి. యాజమాన్య ఉండి అంతర్జాతీయంగా మన దేశఖ్యాతి అంతర్జాతీయముగా మరింత వృద్ధి చెందుతుంది.

దేశంలో ఆర్థిక సంస్కరణలపై ఇలా...

దేశంలో ఆర్థిక సంస్కరణలపై ఇలా...

ద్వితీయస్థానమును పరిశీలించగా దేశ ఆర్థిక సంస్కరణల విషయాలలో ప్రభుత్వము, నాయకులు పటుదలగా ఉన్నప్పటికిని వాటిలో గల లోపాలను సరిచేయడంలో వారు సమర్ధులు కాలేరు. దేశ పురోగమనం, జాతీయ అభివృద్ధి, రాజకీయ సుస్థిరతకు భంగమును కలిగించపోయినప్పటికిని ప్రశాంతత ఉండు సూచనలు తక్కువగా ఉన్నాయి. తృతీయస్థానమును పరిశీలించగా ఇతర దేశాలతో ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు బాగా వృద్ధి చెందినప్పటికి మన దేశానికి మేలు చేసే ఒప్పందాలు కుదుర్చు కొనడంలో అధికారులు విఫలం అయ్యే సూచనలు ఉన్నాయి. విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నప్పటికి, రాజకీయ తీవ్రత వలన ఆశించిన సంస్కరణలు రాక పోవచ్చును. కాగా, కొన్ని ఆకస్మిక దుర్ఘటనలు జాతీయ రహదారుల అభివృద్ధికి ఆటంకముగా మారుతాయి.

దేశ విద్యారంగంలో ఇలా..

దేశ విద్యారంగంలో ఇలా..

చతుర్థ స్థానమును పరిశీలించగా కేంద్రప్రభుత్వ నిరాదరణ ధోరణితో విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు ఎండమావిగా కనిపిస్తున్నాయి. సమరులైన వైజ్ఞానికులు, వైద్యులు ఉన్నప్పటికిని ఆ యా రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో తగిన కృషిని చేపట్టని పరిస్థితి కనిపిస్తున్నది. వ్యవసాయ రంగములో ప్రకృతి బాధలు, | ఈతి బాధలు ఎక్కువవటం, ప్రభుత్వపు ప్రోత్సాహం తక్కువగా ఉండటం, ప్రభుత్వము వారి ఆర్థిక సహాయము కూడా కంటితుడుపు చర్యగా ఉండటం రైతులకు తీవ్రనిరాశను కలిగిస్తుంది. అలాగే ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు ఉన్నాయి. పంచమ స్థానమును పరిశీలించగా సంగీత, సాహిత్య కళా రంగాలలో మన దేశ కళాకారులకు, పరిశోధన సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం పెరగవచ్చును. అలాగే మన దేశ దౌత్యాధికారులు కూడా| అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింప చేస్తారు.

శత్రుదేశం, ఉగ్రవాదుల దాడులు ఇలా..

శత్రుదేశం, ఉగ్రవాదుల దాడులు ఇలా..

షష్ట స్థానమును పరిశీలించగా శత్రుదేశముల తాకిడియు, ఉగ్రవాదుల ధాటియు గుడ్డిలో మెల్లగా మెరుగుపడవచ్చును. సప్తమ స్థానమును పరిశీలించగా విదేశము లతో అనుకూల సంబంధాలను వాణిజ్యపరంగాను, వ్యావహారిక పరంగాను వృద్ధి చేసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతముగా వ్యవహరించే సూచనలు ఉన్నాయి. అష్టమ స్థానమును పరిశీలించగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్ వ్యవహారాలు, ఆర్థిక వ్యాపారాలలో తీవ్రమైన మాంద్యం కనిపిస్తున్నది. నవమ స్థానమును పరిశీలించగా దేశంలో ఆధ్యాత్మిక భావాలు, ప్రజలలో దేశభక్తి, జాతీయభావములు బాగా పెరుగు తాయి. అలాగే ఆధ్యాత్మిక గురువులు నైతిక విలువలను, ఆధ్యాత్మిక విలువలను పెంచడంలో విపరీతమైన కృషి చేస్తారు. నౌకావ్యాపారములు మరింత అభివృద్ధి చెందుతాయి. అలాగే న్యాయశాఖలో జాతీయ ప్రాముఖ్యము విప్లవాత్మక తీర్పులు కొన్ని రావచ్చును. న్యాయవ్యవస్థ తన గౌరవమును నిలబెట్టుకొనుటకు అధికముగా శ్రమించవలసి వచ్చును.

ఖాయిలాల పరిశ్రమలకు మంచి...

ఖాయిలాల పరిశ్రమలకు మంచి...

దశమస్థానమును పరిశీలించగా ఖాయిలా పడ్డ పరిశ్రమలు తిరిగి వెలుగు చూడవచ్చు. విశేషించి భారీ పరిశ్రమ రంగంలో కార్మిక, యాజమాన్య వివాదాలు తమ హద్దులలో ఉండి ప్రగతికి దోహదం చేస్తాయి. ఏకాదశ, ద్వాదశ స్థానములను పరిశీలించగా దేశంలో నిరుద్యోగ తీవ్రత తగ్గుముఖం. ప్రభుత్వము వివిధ పథకముల ద్వారా సమృద్ధిగా ఆదాయ వనరులు సమీకరించుకొనును. రాజకీయ, సాంఘిక వత్తిడుల తీవ్రత ఎక్కువైనను, వారిని నియంత్రించే విషయంలో ప్రభుత్వం విజయం సాధిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరమున అన్ని ఇబ్బందులను ధైర్యంగా అధిగమించి, అభివృద్ధి పథములో పయనింప చేయుటలో ప్రభుత్వము సఫలీకృతమవుతుంది. ఈ సంవత్సరము మన దేశమును పాలించు గ్రహములలో సూర్యుని అంశ ఎక్కువున్నందున విశేషముగా సూర్యోపాసన అధికంగా చేసి ప్రగతిని, సన్మంగళములు పొందుదురు గాక ! శుభమ్ !!

వర్షాలు ఎక్కువే పడుతాయి..

వర్షాలు ఎక్కువే పడుతాయి..

వర్ష జగల్లగ్నకుండలులు పరిశీలన చేయగా దేశమునందు సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నవి. క్రమేపి అభివృద్ధి జరుగుచుండును. తీప్రవాద సమస్య పొంచి ఉన్ననూ రక్షణ సైన్యము తిప్పి కొట్టును. ఆర్థిక లావా వీలు ఇతర దేశాలతో ఒప్పందాలు విశేషంగా బలపడతాయి. దేశమునందు వర్షములు ఎక్కువగాపడును. పంటలు సమృద్ధిగా పండి ఆహార సమస్యను పరిష్కరించెదరు. రాజకీయనాయకులకు అనిశ్చితి ఏర్పడును. అన్నిరంగములయందు విజయము సాధింతురు. ప్రజలకు హాని కలిగించే మాదకద్రవ్యాలు మార్కెట్టలో ఎక్కువగా లభ్యమవుతాయి.ప్రముఖ పుణ్యక్షేత్రములందు సాంఘిక శుభ కార్యములు అధికమగును.

సాఫ్ట్‌వేర్ రంగంలో మార్పులు, ఉద్యోగాల పెంపు

సాఫ్ట్‌వేర్ రంగంలో మార్పులు, ఉద్యోగాల పెంపు

సాఫ్ట్ వేర్ రంగమునందు క్రొత్త మార్పులు జరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. పర్యాటక రంగము ధనములేక అభివృద్ధి తక్కువగా ఉంటుంది. నిరుద్యోగ విషయంలో సరియైన నిర్ణయము ప్రభుత్వ ములు తీసుకుంటాయి. క్రీడారంగమునందు గెలుపు కన్నా ఓటములే ఎక్కువ. న్యాయస్థానముల యందు న్యాయము ఎక్కువ పాళ్ళలో ఉండును. రైలు, విమాన ప్రమాదములను నివారించుటలో ప్రణాళికలను ఏర్పడును. స్త్రీలపై అత్యాచారాలు, దాడులు తగ్గుముఖం పడతాయి.

English summary
According to Astrologer predictions - the situation and developments will be above said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X