వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ ఇంటికి వాస్తు దోషమా: ఇలా నివారించుకోవచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

అత్యంత మహిమాన్వితం గలది మత్స్యయంత్రం. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారమే మత్స్యఅవతారం విష్ణువు వేదాలను రక్షించడానికి అవతరించిన అవతారమే మత్స్యావతారం.ఆ తర్వాత కాలల్లో వేదాలని కాపాడిన మత్స్యానికి ప్రతీకగా రూపొందించబడినదే మత్స్యయంత్రం,

మయబ్రహ్మచే నిర్మించబడి వాస్తుదోష నివారణ కొరకు మత్స్యయంత్రం ను తయారు చేయడం జరిగింది అని అధర్వణ వేదములో చెప్పబడింది. సమస్త వాస్తు దోషాలను నివారించే శక్తినికలిగి మానవులకు ఉపయోగకరమైన శుభ ఫలితాలు ఇస్తుంది.

 మత్స్య యంత్రం ఎక్కడైతే....

మత్స్య యంత్రం ఎక్కడైతే....

మత్స్యయంత్రము ఎక్కడైతే "భూ"స్థాపితం చేస్తారో ఆ ఇంట్లో,స్థలంలో సమస్త వాస్తు దోషలను తొలగించి ఇంటికి రక్షణగా నిలిచి,ఇంట్లో నివసించే వ్యక్తులకు మేలు కలిగిస్తూ ఉంటుంది. మత్స్య యంత్రం అనేది నేటిదికాదు వేద కాలంనుండే నిర్మించబడిన మత్స్యయంత్రము ఏంతో మహిమాన్వితమైనది. గృహంలోని వాస్తు దోష నివారణలకు, శల్యవాస్తుకు, ఇతర దోషనివారణలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

శల్య దోషం అంటే ఏమిటి...

శల్య దోషం అంటే ఏమిటి...

శల్య దోషం అనగా మనము నివసించే ఇంటి స్థలం భూమి క్రింది భాగంలో ఉండే దోషాలు.అంటే ఎముకలు,పుర్రెలు, వెంట్రుకలు,పెంకులు మొదలగునవి భూమిలో ఉంటే వాటిని శల్య దోషంగా పరిగణిస్తారు.ఇలాంటి ప్రాంతంలోను,పరిసరప్రాంతలో ఉండటం వలన అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి,మనం వాస్తు శాస్త్ర ప్రకారం శల్యదోషం లేకుండా ఇల్లు కట్టుకోవాలి అంటే మన ఇంటి స్థలం మొత్తం ఒక పురుష ప్రమాణం అనగా ఆరు పీట్ల లోతుగా పాత మట్టిని మొత్తం తీసి వేసి అక్కడ శంఖుస్థాపన పూజ చేసి అక్కడి నుండి కట్టడం ప్రారంభించాలి.

 పాత మట్టి అసలే వాడకూడదు..

పాత మట్టి అసలే వాడకూడదు..

పాత మట్టిని అస్సలు వాడకూడదు.పునాది బెందడుకు మొరం మట్టిని మాత్రమే వాడినచో ఈ దోషం వర్తించదు,కాని ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం.మనం ఇల్లు కట్టక ముందు,కొనకముందు ఆస్థలం ఏలా ఉండేదో ఎవ్వరికి తెలువదు, అక్కడ పోలాలో లేదా పాడు పడ్డ పెంట స్థలమో,స్మశానమో ఎలా ఉందో ఎవరికి తెలియదు.ప్రస్తుత కాలంలో కొన్ని ఇండ్లు,అపార్టమ్ంట్స్ కట్టేవారు ఈ నియమం తెలియక అనేక కష్టాలు పడుతున్నారు.వాస్తు చూపించే ఇల్లు కట్టాము అయినా ఇబ్బందులు వస్తున్నాయి అని వాపోతుంటారు దానికి కారణం శల్యదోషం అయ్యి ఉండవచ్చు. ఇలాంటి విషయాలకు పంచలోహ మత్స్యయంత్రం "భూ"దోషాలను సైతం నివారిస్తుంది.

 యంత్రం భూస్థాపితం చేయడం వల్ల..

యంత్రం భూస్థాపితం చేయడం వల్ల..

మయ బ్రహ్మచే మహిమగల బీజాక్షర మంత్ర సమన్వయంచే ప్రత్యేకించి తయారు చేయబడినది,ఈ యంత్రము భూ స్థాపితం చేయడం వలన అనేక రకాల వాస్తు దోషనివారణలకు కలిగిస్తుంది.నూతన గృహ నిర్మాణ సమయంలో కాని,పాత గృహములలో ఉన్న వాస్తు దోషనివారణలకు,మరియు భూమిలో ఉండే శల్య దోషనివారణలకు,మరియు కాస్మిక్ ఎనర్జీ ఇంటిపై ప్రసరింపజేయుటకొరకు,ఇతర అనేక ప్రయోజనాలను పొందుట కొరకు దీనిని ఇంటిలో,వ్యాపార సంస్థలలో నాలుగు దిశలలోని గోడలోపల స్థాపితం చేయడం జరుగుతుంది,
ఈ పద్దతి అసలైన శాస్త్రపద్ధతి. దీనివలన పూర్ణమైన శుభ ఫలితాలను కలుగుతాయి. ఈ యంత్రంలో ఉండే బీజాక్షరాలలో ఏ అక్షరం ఎటు ఉండాలనేది ప్రధానాంశం,ఇష్టం వచ్చినట్లు పెట్టకూడదు, ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించిన,ఈశాన్య మూలలో ఒక పాత్రలో నీరును పోసి అందులో ఈ యంత్రాన్ని పెట్టి పూజింఛడం వలన చెప్పుకోతగ్గ ఫలితలును ఇవ్వదు ఇది గమనించాలి.

 వేదకాలం నుంచి ఇది..

వేదకాలం నుంచి ఇది..

వేదకాలం నుండి తరతరాలుగా మన వరకు ఇది ప్రామాణికంగానే తీసుకోబడుతుంది. నాటినుండి నేటివరకు అనేక కొత్త, పాత గృహాల యందు, దేవాలయాల యందు, వ్యాపార సంస్థల యందు, కర్మాగారములందు, వాహనాల యందు, వ్యవసాయ క్షేత్రాలలో ఉపయోగిస్తూ అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు.

 యంత్ర రాజంగా పేరు...

యంత్ర రాజంగా పేరు...

మత్స్యయంత్రము సమస్త వాస్తు దోష నివారణలు తొలిగించే యంత్రరాజంగా పేరుపోందినది. ఈ యంత్రాన్ని తయారు చేయుటకు (రాగి, వెండి, బంగారం, సూర్యలోహం, చంద్రలోహం)లు పంచలోహములతో కూడిన రేకుపై 5X5 అంగుల ప్రమాణంలో బీజాక్షరాలతో యంత్రాన్ని శాస్త్రానుసారంగా దైవజ్ఞుల చేత తయారు చేయించి,మూహూర్త సమయంలోయంత్ర సంస్కారము విధి విధానంగా ప్రాణ ప్రతిష్టాదులు జరిపించి యంత్ర పూజ, జపాదులు చేయవలెను.ఈ యంత్రాన్ని శక్తివంతంగా చేయడానికి విధి విధానాలలో మిగిలిన యంత్రాలకంటే కొంత ఎక్కువగానే పద్ధతులను తెలియజేయబడింది. కాబట్టి ఇది నిష్టతో నిర్వహించవలసి ఉంటుంది.దీక్షతో యంత్రాన్ని పూర్తిచేసిన తర్వాత యంత్ర ప్రాణప్రతిష్ట మంత్రాన్ని శాస్త్ర సూచనల ప్రకారం ఒక లక్ష సార్లు మత్స్యగాయత్రీ మంత్రమును జపించాలి. ఆ తర్వాత నవధాన్యాలతో అభిషేకించి,స్వచ్ఛ జలం,పంచామృతంతో అభిషేకించాలి.

 గాయత్రీ మంత్ర జపం

గాయత్రీ మంత్ర జపం

గాయత్రీ మంత్రాన్ని పదివేల సార్లు జపించాలి. పూజ జపాదులు నిర్వహించిన తర్వాత చివరి రోజు హోమం కూడా నిర్వహించాలి. హోమానికి మూల మంత్రంతో ఆవు నెయ్యి, నల్ల నువ్వులు,బిల్వపత్రములతో పదివేల జపసంఖ్యతో హోమం చేయాలి.ఉపాసకుడైన సాధకుడు శాస్త్రోక్తంగా అన్నశాంతి గావించిన తర్వాతనే ఈ యంత్రం శక్తివంతమౌతుంది.

శాస్త్రోక్త ప్రక్రియల తర్వాత ఇలా..

శాస్త్రోక్త ప్రక్రియల తర్వాత ఇలా..

ఈ శాస్త్రోక్త ప్రక్రియలు పూర్తి అయిన తర్వాత తారాబలం చంద్రబలం కలిగిన ముహూర్తంలో యంత్రాన్ని గృహములోని నలుదిక్కులలో స్థాపించాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకొని ఉంటుంది కాని ఫలితం అద్భుతంగా ఇస్తుంది,ఆర్ధిక స్థోమత లేనివారు ఈశాన్య మూలలో ఒక యంత్రాన్ని స్థాపించుకోవచ్చును. యంత్ర స్థాపన చేసిన ఇండ్లలో సకల అరిష్టాలు తొలగి గృహ యజమాని నికి కుటుంబ సభ్యులకు అందులో నివసించే వారందరికీ సుఖ సంతోషాలను కలిగిస్తూ ఆయురారోగ్య, ఐశ్వర్య,భోగభాగ్యములు, ధనధాన్యాభివృద్ధి, కీర్తి ప్రతిష్టలను కలిగించే కల్పవృక్షం, కామధేనువు లాగా శుభ ఫలితాలను ఇస్తుంది.

మత్స్య యంత్ర స్థాపన వల్ల తొలిగే దోషాలు

మత్స్య యంత్ర స్థాపన వల్ల తొలిగే దోషాలు

వాస్తుశాస్త్రానికి అనుగుణంగా కట్టని ఇండ్లకు,గృహంలోని దోషాలు, దిశ సంబంధమైన దోషాలకు, వీధి పోటుకు, వీదిశూలలకు,ఆయుక్షీణం అయిన పాత గృహాలకు మరియు గ్రహ దృష్టి, దైవదృష్టి ,విప్రదృష్టి, నరదృష్టి ,దుష్టశక్తుల దోషాలను,పరిసరాల దోషాలను నివారించి ఇంటిల్లిపాదికి రక్షణగా నిలుస్తుంది. పంచలోహాంతో తయారు చేసినటువంటి ఈ యంత్రం అత్యంత శక్తివంతమై శుభఫలితాలను ఇస్తుంది. మీకు ఎమైన సందేహాలు ఉన్నచో, శాస్త్రోక్తంగా పూజించిన మత్స్యయంత్రాలు మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.వివరాలు తెలియ జేయగలము జై శ్రీమన్నారాయణ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
According to Vasthu expert and Astrolger - Matsya yantra will be the remedy for Vasthu Dosam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X