వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిష్య శాస్త్రం అంటే ఏమిటి.. ? మనిషి యొక్క కర్మ ఫలితాన్ని చెబుతుందా..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్య గొప్పది. జన్మించిన తేది, సమయం, ప్రదేశం.. ఈ మూడింటిని బట్టి మానవుని వ్యక్తిత్వం, అతడి భవిష్యత్ సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు చూపించే విద్య జ్యోతిష్యం.

భవిష్యత్తు మార్చే అవకాశం జ్యోతిష్యంకు ఉందా..?

భవిష్యత్తు మార్చే అవకాశం జ్యోతిష్యంకు ఉందా..?

జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మానవుడు అనుభవించే మంచి, చెడు రెండూ గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితాన్ని మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది.

కర్మ ఎన్ని రకాలు.. అవి ఏవి..?

కర్మ ఎన్ని రకాలు.. అవి ఏవి..?

అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మనం ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము. కర్మ 3 రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించగలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు కర్మలు. మంచి యోగాలు మంచి కర్మలు. దోషాల పైన గురు దృష్టి లేదా పంచ విధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది. శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు.

 గ్రహాల ఆధారంగా జ్యోతిష్యం..?

గ్రహాల ఆధారంగా జ్యోతిష్యం..?

జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనం జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్‌ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశం ఆధారంగా జాతకచక్రం గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది. దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే జాతక చక్రం అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జ్యోతిషమనే మహా సముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది.

 3 విభాగాల్లో విస్తరించిన జ్యోతిష్య శాస్త్రం

3 విభాగాల్లో విస్తరించిన జ్యోతిష్య శాస్త్రం

జ్యోతిష శాస్త్రం ప్రధానంగా 3 విభాగాలలో విస్తరించింది. సిద్ధాంత, సంహిత, హోరా విభాగాలు. సిద్ధాంత స్కంధాన్ని గణిత స్కంధం అని కూడా అంటారు. దీనిలో గ్రహ గణితానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఉంటాయి. గ్రహాల మధ్యమ స్థితి, స్పష్ట స్థితి, సంవత్సర-ఆయన-మాసాది కాలనిర్ణయం, గ్రహణాదులు మొదలైన గణితాధార విషయాలను వివరిస్తుంది. దీనిలో మూడు విభాగాలుంటాయి.

1. కల్పారంభం నుంచి గ్రహగణితం కలిగిన దానిని సిద్ధాంతమని.

2. ఒక మహాయుగం నుంచి గ్రహగణితం కలిగిన దానిని తంత్రమని.

3. ఒక శక సంవత్సరం నుంచి గ్రహ గణితం కల దానిని కరణమని అంటారు.

సంహిత విభాగములో ఖగోళములో గ్రహభ్రమణాలు, తోకచుక్కలు, ఉల్కాపాతాలు, గ్రహణాలు మొదలైన వాటివలన ప్రపంచానికి జరిగే శుభాశుభాలకు సంబంధించిన విషయాలు, ముహూర్త సంబంధ విషయాలు ఉంటాయి. హోరా విభాగం మనిషి జన్మ సమయాన్ని ఆధారంగా చేసుకొని అతని జీవితంలో జరిగే శుభాశుభాలను వివరిస్తుంది. దీనికే జాతక స్కంధం అని పేరు. దీని ద్వారా మానవుడుజన్మించిన సమయం, ప్రదేశం ఆధారంగా అతని జాతకచ క్రాన్ని లిఖించి అయా గ్రహ, భావ, యోగాల అధారముగా అతని జీవితములో జరిగే శుభాశుభ ఫలాల్ని లెక్కించడం జరుగుతుంది.

 ప్రతి నక్షత్ర పాదానికి ఒక అక్షరం

ప్రతి నక్షత్ర పాదానికి ఒక అక్షరం

సామాన్యులు కూడా తమ రాశి నక్షత్రాలను మరిచిపోకుండా ఉండే విధంగా ఆయా నక్షత్ర పాదాలు ఏయే అక్షరాలను ప్రభావితం చేస్తాయో వాటికి అనుగుణంగా ప్రతి నక్షత్ర పాదానికి ఒక అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నక్షత్రములో ఆ పాదములో జన్మించిన వ్యక్తులు ఆ నక్షత్రపాదానికి సూచించబడిన అక్షరముతో ఆరంభమయ్యే పేరును తమ జన్మ నామముగా పెట్టుకునే విధానాన్ని మన ప్రాచీనులు ఏర్పాటు చేశారు. జన్మనామాక్షరాలకు సంబంధించి పూర్తివివరాలను లఘు బ్రహ్మయామిళ గ్రంథములో పొందవచ్చు.

మీ జన్మ నక్షత్రము ద్వారా మీ జన్మ నామాన్ని తెలుసుకునే విధంగా నక్షత్రాలు వాటికి సూచించబడిన అక్షరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

అశ్విని - చు, చే, (చో,చౌ),లా

భరణి - లీ, లూ, లే, లో

కృత్తిక - ఆ, ఈ, ఊ, ఏ

రోహిణి - ఓ, వా, వీ, వు

మృగశిర - వే, వో, ( కా , కృ ) , కీ

ఆరుద్ర - కూ, ఘ, ( జ్ఞ , జ్ఞా ) ఛా

పునర్వసు - కే, కో, హా, హీ

పుష్యమి - హూ, హే, హో, డా

ఆశ్రేషా - డి , డూ, డే, డో

మఖ - మా, మీ, మూ, మే

పుబ్బ - మో, టా, టీ, టూ

ఉత్తర - టే, టో, ( పా, ఫ ), పి

హస్త - పూ, ( షం , క్షే ) , ణా, ఠా

చిత్త - పే, పో,( ప్ర, రా) , ( రీ , శ్రీ , బ్ర )

స్వాతి - ( రూ, హృ ), రే, ( రో, ద్రో , ద్రౌ ) త

విశాఖ - తీ, తూ, తే, తో,

అనురాధ - నా, నీ, నూ, నే

జ్యేష్ఠ - నో, యా, యీ, యూ

మూల - (యె, యే ) , యో, బా, బి

పూర్వాషాఢ - బూ, ధా,( భా , భై ), డా

ఉత్తరాషాఢ - బే, భో , జా, జి

శ్రవణం - జూ, జే, జో, ఖ

ధనిష్టా - గా, గీ, గూ, గే

శతభిషం - ( గో, గౌ ), సా, సీ, సు

పూర్వాభాద్ర - సే, సో, దా, ది

ఉత్తరాభాద్ర - దూ, ( శ్యం, శ, శ్యా ) , ఝా , థ

రేవతి - దే, దో, చా, చి

English summary
Astrology is the greatest of all the sciences available to man. Taking the date, time and place of birth the astrologers will be able to predict mans attitude, future, and his values.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X