మార్చిలో ఈ 4 రాశులకు జరగబోయేది ఇదే

గ్రహాలు ఖగోళంలో సంచారం చేయడం అనేదానికి మార్చి నెల చాలా కీలకమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఈ నెలలో కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు, సంపదకు కారకుడయ్యే శుక్రుడు కలుసుకుంటున్నారు. దీనివల్ల అన్ని రాశులపై ప్రభావంపడుతోంది. శుక్రుడు మార్చి 2న మీన రాశిలోకి ప్రవేశించి అప్పటికే అక్కడ సంచారం చేస్తున్న శనిదేవుడితో కలుస్తాడు. ఈ కలయిక వల్ల కొన్ని రాశులవారికి అనేకరకాల ఫలితాలు కలుగుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

సింహరాశి

చిన్న చిన్న విభేదాలు ఈ రాశివారికి తలెత్తుతాయి. అవి పెద్దవి కాకుండా చూసుకోవాలి. వ్యక్తిగతంగా కూడా కొన్ని నష్టాలు అధికంగా ఉంటాయి. దీంతోపాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థికంగా నష్టాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.

Astrology This is what is going to happen to these 4 zodiac signs in March month

వృశ్చిక రాశి

వాహనాన్ని నడిపే సమయంలో ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా మరికొన్ని సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కొన్నిరకాల సైద్ధాంతిక విభేదాలు వస్తాయి. ఇప్పటికే ఉన్న సమస్యలకు మరిన్ని సమస్యలు తోడవుతాయి. అయితే ఈ రాశివారు మొండితనం విడిచి ముందుకు నడిస్తే జీవితం బాగుంటుంది.

మీన రాశి

ఈ రాశివారికి అనేకరకాలుగా అనారోగ్య సమస్యలు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే ఖర్చులు కలిసివస్తాయి. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడరు. ఆర్థికంగా బాగా కలిసిరానుంది. చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇలా చేయడంవల్ల మంచి ఫలితాలను సాధిస్తారు.

కర్కాటక రాశి

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో నలుగురితో చర్చించి తీసుకోవాలి. ఒక్కోసారి మీరు కోరుకున్న ఫలితాలు రాలేదని మానసిక సమస్యలను ఎదుర్కుంటారు. అయితే దృఢంగా నిలబడాలి. కెరీర్ పరంగా బాగుంది. సమస్యలు కూడా వస్తాయి. విభేదాలు పెరిగే అవకాశం ఉంది. గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+