వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు: ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉండాలి?

By Pratap
|
Google Oneindia TeluguNews

గృహమేకదా స్వర్గసీమ అన్న నానుడికి మనం నివసించే ఇల్లుకు గుమ్మాల పాత్ర ప్రధానమైనది. శుభ సంఖ్యలో గుమ్మాలు ఉండాలని శాస్త్రీయ పరంగా ద్వారలకు విశిష్ట స్థానం ఉంది.వాస్తు శాస్త్ర ప్రకారము ఇంటికి ఎన్ని ద్వారాలు(గుమ్మాలు) ఉంటే మంచిది.

ఈ విషయాన్ని శాస్త్ర ప్రకారంగా పరిశీలించినట్లయితే గుమ్మాలకు సంఖ్యానియమం అనేది నిర్ణయించబడిఉంది. శుభాన్ని కలిగించే "శుభ దిక్కులలో" మంచి ద్వారా సంఖ్య గల ఇంట్లో నివసించే వారికి మంచి ఫలితాలను ఇస్తాయి.శాస్త్రానికి బిన్నంగా ద్వారాలుంటే దానివల్ల అశాంతి జీవనాన్ని కలిగించే ఫలితాలను ఇస్తాయి.

మనం నివసించే ఇల్లు,స్వంతం అయిన ,అద్దేఇల్లు అయిన గుమ్మాల శంఖ్య ఆధారంగా ఒకే విధంగా ఫలితాలను ఇస్తాయి.శుభ,గృహంలో గుమ్మల సంఖ్యను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో అనే విషయం ఈ క్రింద తెలియ జేయడం జరిగింది.

Astrology: vastu of residence

*శుభాన్ని కలిగించే ద్వారాల సంఖ్య ఫలితాలు.*

"రెండు" ద్వారములు(గుమ్మాలు)గల ఇల్లు చాలా శ్రేష్టము. దీనివలన శ్రేష్టమైన జీవన అభివృద్ధి కలుగుతుంది.

"నాలుగు" ద్వారాలు ఉన్న గృహంలో ఆయువు, ఆరోగ్యం, కృషికి లాభము, సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది,

"ఆరు" ద్వారాలున్న ఇంట్లో ఐశ్వర్యము, పుత్ర వృద్ధి, శ్రేయస్సు కలిగిస్తుంది.

"ఎనిమిది" ద్వారములు ఉన్న గృహములో సకల భోగభాగ్యములు, అష్టైశ్వర్యములను కలిగిస్తుంది.

"పన్నెండు" ద్వారములు గల ఇల్లు ఉద్యోగ, వ్యాపారములలో వృద్ధిని, కీర్తిని కలిగిస్తుంది.

"పద్నాలుగు" ద్వారలు ఉన్న ఇల్లు ధన సంపద, కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది.

"పదహారు" ద్వారములు గల గృహములో అన్నింటా లాభములు, అధికారమును, జీవనంలో లాభాలను కలిగిస్తుంది.

*కీడును కలిగించే సంఖ్య గల ద్వారము( గుమ్మం)లు*

"మూడు" ద్వారములు ఉన్న గృహము వలన ఫలితం. శత్రువుల వలన బాధలు, అపనిందల పాలు చేస్తుంది, అధిక ఖర్చులు ఉంటాయి.

"ఐదు" ద్వారములు గల ఇల్లు సంతానానికి సంబంధించిన పీడలు, రోగ బాధలు, శత్రువుల నుండి బాధలు కలిగిస్తుంది.

"ఏడు" గుమ్మాలు ఉన్న గృహములో ఫలితం మరణము, జీవిత భాగస్వామి వ్యభిచారము, అధిక కష్టములను కలిగిస్తుంది.

"తోమ్మిది" ద్వారములు ఉన్న గృహము వలన శరీర పీడను కలిగించి యజమానికి నష్టాన్ని కలిగిస్తుంది.

"పది" గుమ్మాలు ఉన్న ఇల్లు కష్టనష్టాలను కలిగిస్తుంది,ఆ ఇంటికి దొంగల వలన భయం ఉంటుంది.

"పదకోండు" ద్వారలు కలిగి ఉన్న ఇల్లు వలన ఫలితం అష్టకష్టములు కలిగిస్తుంది, భార్య వ్యభిచారము చేసేలా చేస్తుంది.

"పదమూడు"ద్వారాలు ఉన్న గృహము వలన ఫలితం మరణ ప్రమాదములు,మరియు అనేక కష్టనష్టాలను కలిగిస్తుంది.

"పదిహేను" ద్వారములు ఉన్న గృహము అనేక కష్టాలు,బాధలు,అశాంతి,అధిక ఖర్చులను కలిగిస్తుంది.

ముఖ్యంగా గృహమునకు ద్వారాల సంఖ్య మరియు గుమ్మాలు ఉండే దిక్కు,దిశ ,కొలతలు అనేవి చాలా ప్రధానమైన విషయముగా భావించాలి. వాస్తురీత్యా సూచించిన సరియైన గుమ్మాల సంఖ్య ఉన్నట్టయితే ఆ ఇంట్లో నివసించే వారు ఆరోగ్యంగా , అన్యోన్యంగా ఉంటూ, ఒకరి కొకరు సహకరించుకుని ఆనందమయంగా దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటారు.శాస్త్రానికి భిన్నంగా గుమ్మాల సంఖ్య ఉన్నట్లయితే ఆ కుటుంబంలో కలతలు, కలహాలు, అనారోగ్యాలు, ఇతర అనేక కష్టనష్టాలను కలిగిస్తుంది.కాబట్టి ఇంటి విషయంలో అనుభవజ్ఞులైన వాస్తు పండితుల సలహాలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది జైశ్రీమన్నారాయణ.


డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
Astrologer explans the vasthu of a home and bout the shafts to be placed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X