లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తులసి ఆకులతో చిన్న చిట్కా!
సనాతన ధర్మంలో తులసిమొక్కను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని పండితులు చెబుతారు. ఈ మొక్క ఉన్న ఏ ఇంట్లోనూ పేదరికం సంభవించదు. అందుకే ప్రతిరోజూ కోట్లాది మంది తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. మీరు ఒకవేళ డబ్బులు సరిపోకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తులసితో గొప్ప పరిహారం చేసుకోవచ్చు.
తులసి ఆకులు కోరికలను నెరవేర్చడానికి అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. పరిహారానికి 11 తులసి ఆకులు అవసరం. పగటిపూట 11 పచ్చి తులసి ఆకులను ఎంచుకొని కడిగి ఎండలో ఆరబెట్టండి. సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి. ఆ ఆకులతో మాల తయారుచేసి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇలా చేయడంవల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి.

డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్నట్లయితే తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సు లేదా డబ్బులుంచే అల్మారాలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి కుటుంబానికి ధన వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. కొందరు ఏ పని ప్రారంభించాలన్నఅందులో ఉండే ప్రతికూల అంశాలనే చూస్తుంటారు. నాలుగైదు తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడిపాత్రలో వేస్తే చాలు. ప్రతికూల శక్తి తగ్గి సానుకూలశక్తి పెరుగుతుంది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మంమీద, ఇతర ప్రదేశాల్లో తులసి ఆకులతో చల్లుకోవాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగడంతోపాటు కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయి.













Click it and Unblock the Notifications