• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జన్మ నక్షత్రానికి అనుకూలమైన వృక్షం

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

జ్యోతిష్య శాస్త్రములోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. చాలా మందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి కూడా తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలను కలుగుతాయి.

మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చేయాలో ఈ శాస్త్రములో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది.

 Cells are divided into three types of cells. Multiples

నాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్ల పక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చును. అయితే అది పెరిగేలా ప్రత్యేక శ్రద్ద చూపించాలి. మీ నక్షత్రము చూసుకుని ప్రతి నెల ఒక్కసారైనా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం, ప్రదక్షిణ చేసుకోవడం వలన శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసి పిల్లల చేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి. పుట్టిన తేదీ ఆధారంగా జాతకానికి సంబధించిన చెట్టు, వాటి పూజా విధానం వివరంగా తెలుస్తుంది.

జన్మనక్షత్ర ఆకృతులు, పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు:-

1. అశ్వని నక్షత్రము:- ( తురగముఖాశ్వినీ త్రీణి - గుర్రం ముఖము ఆకృతిలో మూడు నక్షత్రాలు ) అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.

2. భరణి నక్షత్రము:- ( భరణీ యోని త్రీణి - యోని ఆకృతిలో మూడు నక్షత్రాలు ) భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది

3. కృత్తిక నక్షత్రము:- ( కృత్తికా క్షురాష్మట్కం - మంగలి కత్తి ఆకృతిలో ఆరు నక్షత్రాలు ) కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

4. రోహిణి నక్షత్రము:- ( శకటం పంచ రోహిణీ - బండి ఆకృతిలో ఐదు నక్షత్రాలు ) రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

5. మృగశిర నక్షత్రము:- ( మృగశిరా శీర్షం త్రయం - శీర్షాకారంలో మూడు నక్షత్రాలు ) మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

6. ఆరుద్ర నక్షత్రము:- ( ఆర్ద్ర ప్రవాళ మేకం - పగడం ఆకృతిలో మెరుస్తూ ఒకే నక్షత్రం ) ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.

7. పునర్వసు నక్షత్రము:- ( పునర్వసూ కులాల చక్రం పంచ - చక్రాకృతిలో ఐదు నక్షత్రాలు ) పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

8. పుష్యమి నక్షత్రము:- ( సరళా పుష్యమీ త్రీణి - సరళాకృతిలో వరుసగా మూడు నక్షత్రాలు ) పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు.

9. ఆశ్లేష నక్షత్రము:- ( ఆశ్లేషా సర్పా ఋతూ - సర్పాకృతిలో ఆరు నక్షత్రాలు ) ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.

10. మఖ నక్షత్రము:- ( మఖాందోళికా పంచ - పల్లకీ ఆకృతిలో ఐదు నక్షత్రాలు ) మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి.

11. పుబ్బ నక్షత్రము:- ( పుబ్బ, ఉత్తర నేత్ర ద్వయో: - కంటి ఆకృతిలో రెండు నక్షత్రాలు ) పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

12. ఉత్తర నక్షత్రము:- ( పుబ్బ, ఉత్తర నేత్ర ద్వయో: కంటి ఆకృతిలో రెండు నక్షత్రాలు ) ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

13. హస్త నక్షత్రము:- ( హాస్తా పాణినాం పంచ - చేతివేళ్ళ ఆకృతిలో ఐదు నక్షత్రాలు ) హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

14. చిత్త నక్షత్రము:- ( చిత్తా మౌక్తిక మేకం - ముత్యం ఆకృతిలో ఒకే ఒక నక్షత్రం ) చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

15. స్వాతి నక్షత్రము:- ( స్వాతీ మాణిఖ్య మేకం - మాణిక్యం లాగా ఒకే నక్షత్రం ) స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

16. విశాఖ నక్షత్రము:- ( విశాఖ కులాల చక్రం పంచ - చక్రాకృతిలో ఐదు నక్షత్రాలు ) విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

17. అనురాధ నక్షత్రము:- ( అనురాధ జ్యేష్టాంగుళ ఛత్రాకార త్రయం - గొడుగు ఆకృతిలో మూడు నక్షత్రాలు ) అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

18. జ్యేష్ఠ నక్షత్రము:- ( అనూరాధ జ్యేష్టాంగుళ ఛత్రాకార త్రయం - గొడుగు ఆకృతిలో మూడు నక్షత్రాలు ) జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.

19. మూల నక్షత్రము:- మూలా కుష్యత్కేసరీ పంచ - కోపించిన కేసరి ఆకృతిలో ఐదు నక్షత్రాలు ) మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.

20. పూర్వాషాడ నక్షత్రము:- ( పుర్వాషాఢా ఉత్తరాషాఢా ద్వే ద్వే భేకం - కప్పు ఆకృతిలో రెండు నక్షత్రాలు ) పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

21.ఉత్తరాషాడ నక్షత్రము:- ( పుర్వాషాఢా ఉత్తరాషాఢా ద్వే ద్వే భేకం - కప్పు ఆకృతిలో రెండు నక్షత్రాలు ) ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.

22. శ్రవణం నక్షత్రము:- ( శ్రవణం మత్స్యకార త్రయం - చేప ఆకృతిలో మూడు నక్షత్రాలు ) శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

23. ధనిష్ఠ నక్షత్రము:- ( ధనిష్టా శీర్ష త్రయం - శీర్షాకృతిలో మూడు నక్షత్రాలు ) ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

24. శతభిషం నక్షత్రము:- ( శతభిషక్చతం తారా: - వంద తారల గుంపు ) శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

25. పూర్వాభాద్ర నక్షత్రము:- ( పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ద్వే ద్వే ఖట్వం - మంచం ఆకృతిలో రెండు నక్షత్రాలు ) పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.

26. ఉత్తరాభాద్ర నక్షత్రము:- ( పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ద్వే ద్వే ఖట్వం - మంచం ఆకృతిలో రెండు నక్షత్రాలు ) ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

27. రేవతి నక్షత్రము:- ( రేవతీ మత్స్యాకార త్రయం - చేప ఆకారంలో మూడు నక్షత్రాలు ) రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

English summary
The planets are the heads of the astrological stars. The gods will be the gods for it. The stars are Deva, Rakshasa. Human. Cells are divided into three types of cells. Multiples are calculated according to astrology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more