• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చండీ తత్త్వము: దివ్యశక్తుల యోగామాయకు అందరూ తలలు వంచాల్సిందే

|

డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151

బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకరి కన్నా ఒకరు గొప్ప వారు. యోగమాయా బలానికి ఈ ముగ్గురూ కట్టుబడి వుండేవారే. త్రుటిలో జగత్తును సృష్టించి, పెంచి, సంహరించే దివ్యాతి దివ్య శక్తులు గల యోగామాయకు అందరూ తలలు ఒగ్గ వలసినవారే. మాయ అంతర్ముఖ, బహిర్ముఖ భేదముతో రెండు విధములుగా ఉంటుంది. ప్రణవములో అ కారము బ్రహ్మ, ఉ కారము విష్ణువు, మకారము శివుడు. ఈ మాయ వలెనే త్రిగుణములు, త్రిశక్తులు ఏర్పడినవి. బ్రహ్మాదులు ఈ గుణ త్రయానికి సంబంధించి వుంటారు. అగ్ని మండడం, గాలి వీచడం, సూర్యుడు ఉదయంచడం, విష్ణువు పోషించడం ఇవన్నీ ఆమె వలెనే జరుగుతూ వుంటాయి.

ఆమె శక్తి గనుక లేకపోతే వాళ్ళకు గుణాలు వుండవు. పేర్లు మాత్రమే మిగులుతాయి. దేవతలు అందరూ ఆ యోగ మాయ చేతిలో కీలు బొమ్మలు. ఆమె ఆడించినట్లు ఆడుతూ వుంటారు. చంద్రునకు వెన్నెలగా, అగ్నికి వేడిమిగా, సూర్యునకు వెలుగుగా వున్నది ఆమే శక్తియే. ఆత్మను ఆశ్రయించిన మాయకే విద్య అని పేరు. అది ఒక ఆవరణ. దానిని తొలిగిస్తే నిత్యమూ సత్యమూ అయిన ఆ తల్లి రూపం కనిపిస్తుంది.

సృష్టి స్థితి లయములు గావించున్న ఆ మహా మాయను ఎవరు ఉపాసించు చున్నారో, వారు జనన మరణ రూపమగు సంసారము నుండి తరించు చున్నారని, మోక్షమును బొందుచున్నారని నృసింహతాపిన్యుపనిషత్తు తెలియ జెప్పుచున్నది. ఆ శక్తిని భజించినవాడు మృత్యువును జయించి మోక్షమును బొందును. త్వం వైష్ణవీ శక్తి రనంత వీర్యా విశ్వస్య బీజం పరమాపి మాయా సమ్మోహితం దేవి సమస్త మే తత్...

Chandi Tatvam: Prominence about Divya Yoga

ఈ లోక మంతయూ మాయా శక్తి చే సమ్మోహిత మగుచున్నది.ఒకప్పుడు దేవిని దేవత లెల్లరు "అమ్మా నీ వెవరు? అని అడుగగా "నేను బ్రహ్మ స్వరూపిణిని, నా వల్లనే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించు చున్నది" అని చెప్పినది.

"సర్వే వై దేవా దేవీ ముపతస్థుః కాసిత్వం దేవీ సా బ్రవీ దహం బ్రహ్మ రూపిణీ మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్.

అట్లే మాయ, బ్రహ్మ రూపిణి, విశ్వ మోహిని, ఆత్మ స్వరూపిణి అని భువనేశ్వరి ఉపనిషత్తు చెప్పుచున్నది.
" స్వాత్మ్యైవ లలితా .... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది.

చితి స్తత్పదలక్ష్యార్దా చిదేకరస రూపిణి ... అని బ్రహ్మాండ పురాణము అమ్మను కొని యాడినది.
ఇట్లు అష్టాదశ పురాణములు, ఉప పురాణములు, స్మృతులు దేవిని పర బ్రహ్మమని ప్రతి పాదించినవి.

శక్త్యక్ష రాణి శేషాణి హ్రీం కార ఉభాయాత్మకః .. అని ఇతర బీజాక్షరములు కేవలము శక్తికి సంబంధించినవి వనియు మాయా బీజమైన హ్రీం కారము మాత్రము ఉభాయాత్మక మైన శివ శక్త్యాత్మక బీజమని బ్రహ్మాండ పురాణము చెప్పు చున్నది.

హ్రీం బీజము పర బ్రహ్మ స్వరూపమని, మోక్షప్రదమని దేవీ భాగవతము చెప్పు చున్నది.

హ్రీం హ్రీమితి ప్రతి దినం జపతాం జనానాం,
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే.

త్రిపురముల యందు వసించు ఓ .. అమ్మా హ్రీం హ్రీం అని నీ బీజ మంత్రమును జపించు వారికీలోకమున దుర్లభమైన దేమియునూ లేదు. సకల కల్యాణ భాజనమైనదీ హ్రీంకారము. శ్రీదేవీ ప్రణవము హ్రీంకారము.

English summary
Chandi Tatvam is a very important tradition in Hindu religion. It has lot of prominance for Divya Yoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X