• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మకరరాశిలో షష్ఠగ్రహకూటమి .. ఈ నెలలో 6 గ్రహాల స్థానాల్లో మార్పు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఈ నెలలో చాలా మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా 6 గ్రహాల తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావం పడనుండగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడనుంది. ఆరు గ్రహాలు మకరంలో కలయిక. ఖగోళంలో అరుదైన సంయోగం ఈ నెలలో సంభవించనుంది. 10 ఫిబ్రవరి 2021 బుధవారంనాడు రాత్రి చంద్రుడు మకరంలో ప్రవేశించిన తర్వాత ఈ మహాసంయోగం ఏర్పడుతుంది. ఇది చాలా అరుదుగా జరిగే అధ్భుత ఖగోళ ఘటన. నవగ్రహాల్లో ఆరు గ్రహాలు మకర రాశిలో ఉంటాయి.

ఒక రాశిచక్రంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కలిస్తే దేశంతో పాటు యావత్ ప్రపంచంలోనే భౌగోళిక మరియు రాజకీయ పరంగా అనేక మార్పులు జరుగుతాయి. సూర్యుడు, గురుడు, శని, కుజుడు మొదలైన గ్రహాలు ఓక్ చోట అంటే ఒకే రాశిలోకి వచ్చినప్పుడు యుద్ధం లేదా భారీ ప్రజాందోళనలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రముఖ రాజకీయ లేదా దేశంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న వారికి ఇబ్బంది ఏర్పడే సూచనలున్నాయి. దేశ ప్రముఖులలో ఒకరికి ప్రాణహాని జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఫలితాలలో హెచ్చుతగ్గులుంటాయి.

Change in Planets positions in the month of February, Know the details

2019 డిసెంబరు 26న ధనస్సురాశిలో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు రాహువు-కేతువు మినహా 5 గ్రహాలు కలిశాయి. ఫలితంగా విశ్వవ్యాప్తంగా మహమ్మారి కరోనాప్రభావానికి గురికావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఫిబ్రవరి 10 అర్థరాత్రి 11, 12 తేదీల్లో మకరంలో సంయోగం చెందనున్న ఆరు గ్రహాల వల్ల మరోసారి దేశంతో పాటు ప్రపంచంలో పెద్ద మార్పులు పరిస్థితి గోచరిస్తుంది. బహుశా భారతదేశంలో రైతు ఉద్యమం వేగవంతం కావచ్చును. ఫిబ్రవరి 12న అమావాస్య ప్రకారం పంచాంగ గ్రహగతుల పరిశీలన చేస్తే తులారాశి ప్రాబల్యం వలన నాలుగో పాదంలో శని, గురుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు కలవనున్నారు.

ఫలితంగా రైతుల ఆందోళన తీవ్రం కావడాన్ని సూచిస్తుంది. మకరం శని, చంద్రుడు వ్యవసాయ ఉత్పత్తులు, రైతులతో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నారు. మకరంలో చేరిన 6 గ్రహాల్లో 4 గ్రహాలైన గురుడు, శని, బుధుడు, శుక్రుడు శ్రవణం నక్షత్రంలో ఉండనున్నారు. శ్రవణ నక్షత్రం ధర్మ, గురువులు, వైద్య కారకంగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావం వలన రాబోయే రెండు నెలలలో పెద్ద ఆధ్యాత్మిక విభేదాలు, వివాదాస్పద పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.

ఈ షష్ఠగ్రహకూటమి వలన జ్యోతిషశాస్త్ర ప్రకారం భూమి ప్రభావితమవుతుందని భావిస్తారు. భూకంపం, ప్రకృతి వైపరిత్యాలు. మకరంలో శని, గురుడు మధ్యలో మేష రాశిలో కుజుడి స్థానం భూకంపాన్ని కలిగిస్తుంది. ఫిబ్రవరి 12 అమవాస్య రోజున సూర్యుడు, చంద్రుడు పృథ్వి తత్వం కారణంగా భూకంపాలను సూచిస్తున్నారు. ఈ యోగం ప్రభావంతో పాకిస్థాన్, ఉత్తర భారత దేశంలో నెల రోజులలోపు భూకంప ప్రకంపనలు తారసపడవచ్చును. ఫిబ్రవరి 12 అమవాస్య తర్వాత అసాధారణ వర్షాలు, వడగళ్లు కూడా పడే సూచనలున్నాయి. ఉత్తర భారతదేశంలో వడగళ్లు, కొన్ని చోట్ల పంటలను దెబ్బతీస్తాయి. పర్వత ప్రాంతాలలో మంచు కమ్ముకుని దీర్ఘకాల శీతాకాలానికి దారితీస్తుంది.

షష్ఠగ్రహకూటమి వలన చైనాకు విపత్తు కలిగే అవకాశం. ఉగ్రవాద వ్యాప్తికి దారితీస్తుంది. పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ పెద్ద సంకటంలో ఇరుక్కునే అవకాశముంది. పాకిస్థాన్ చంద్రుడు రాశి అయిన మిథునంలో 8వ పాదం వినాశానాన్ని సూచిస్తుంది. ఈ గొప్ప శక్తి దేశాన్ని పెద్ద భూకంపం నుంచి దెబ్బతీస్తుంది. చైనా రాశి అయిన మకరంలో శని, గురుడు సహా ఇతర గ్రహాల రవాణా అక్కడి ఆర్ధిక సంక్షోభం, అసంతృప్తికి కారణమవుతుంది. చైనా స్టాక్ మార్కెట్లు పతనమవుతాయి. అక్కడి ధనిక వర్గాలకు పెద్ద దెబ్బను ఇస్తుంది. భారతదేశంలో కూడా దీని ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంది.

షష్ఠగ్రహకూటమి వలన ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం:-

వృషభరాశి వారికి :- ఆరు గ్రహాల కలయిక వలన మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు మీ కార్యచరణను ప్రభావితం చేస్తుంది. ఎవరితో వాదనకు దిగకండి. సంబంధంలేని విషయాలలో తల దూర్చకండి. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. కుటుంబ విధులు మీరొక్కరే చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా విభేదాలు రావచ్చు. చేసే వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మధ్యవర్తిత్వాలు చేయకండి. ఈ సమయంలో ఎవ్వరికైనా రుణాలు ఇవ్వడం మానుకోండి. లేకుంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. సృజనాత్మక పనిని కోల్పోతారు.

​కర్కాటకరాశి వారికి :- గ్రహాల మార్పు మీ కోసం మధ్యస్తంగా ఉంటుంది. ఏదైనా ఆస్తి కొనుగోలు చేయడానికి ఇది శుభ సమయం కాదు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో ఆరోగ్య జీవితం గురించి మీరు మీ పనిశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహార నియమాలను పాటించాలి. మీకు పడని ఆహార, పానీయాలకు దూరంగా ఉండాలి. మీరు ప్రేమ జీవితంలో నూతన ప్రారంభాన్ని పొందుతారు. ఇందుకోసం మీ మాటలు, ప్రవర్తనను నియంత్రించండి. విద్యార్థులు మంచి మార్కులు పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. వృత్తిపరమైన రంగంలో అనవసరమైన చర్చ, వివాదాలకు దూరంగా ఉండండి.

​తులారాశి వారికి :- గ్రహాల మార్పు వలన సమాజం, కుటుంబ వ్యవహారంలో గట్టి పోటీని ఎదుర్కోవాలి. ఈ సమయంలో మీరు ఇతరులతో మాట్లాడే సమయంలో ప్రియంగా , శాంతంగా ఆలోచనాత్మకంగా మాటలను, పదాలను ఉపయోగించాలి. ఆవేశం, అనాలోచిత చర్యలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పని పూర్తి చేయడంలో విఫలమైతే కోపం పెరుగుతుంది, జాగ్రత్త వహించాలి. మసాలా ఆహారం తినడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశముంది. పనిప్రదేశంలో పోటీ పడి పనిచేయాలి. శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. గ్రహాల మార్పులు మీ పనిలో తీవ్రమైన మార్పును తీసుకొస్తాయి. కాబట్టి పెట్టుబడికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశమున్నందున అనవసరమైన ఖర్చులు మానుకోండి.

​వృశ్చికరాశి వారికి :- గ్రహాల మార్పు వలన ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోండి. ప్రేమ విషయంలో ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి భంగం కలిగించే అవకాశముంది. కాబట్టి మీ కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల ప్రవర్తన మీకు ఒత్తిడిని తీసుకొస్తుంది. ఇది మీ ఇద్దరి మధ్య తేడాలను కలిగిస్తుంది. అనవసరమైన చర్చ గొడవలకు కారణమవుతుందని గుర్తుంచుకోండి. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలసిపోయే కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రశాంత ఆరోగ్య జీవితాని కొరకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

​ధనస్సురాశి వారికి :- గ్రహాల మార్పు వలన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో ఏ విషయంలో నైనా సన్నిహితులతో, బంధువులతో వివాదం జరగవచ్చును, అది మీ మనస్సును కొంత కలవరపెడుతుంది. పెట్టుబడులకు ఈ సమయం సరైనది కాదు. ఆదాయం, ఖర్చులు వేగవంతం చేయండి. మీ పనిపై దృష్టి పెట్టండి. పనిని నిజాయితీగా పూర్తి చేయండి. అధికారుల సరైన ప్రశంసలు లేకపోవడం నిరాశకు దారితీస్తుంది.

​మీనరాశి వారికి :- గ్రహాల మార్పు వలన మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో మీ ప్రవర్తన, మాటలపై శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంచడానికి ఖర్చులను అదుపు చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే రుణాలు తీసుకునే పరిస్థితి రావచ్చు. రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కుట్రలకు దూరంగా ఉండండి. అనవసరమైన ప్రమాదాలకు దూరంగా ఉండండి. వాహనాల వినియోగంలో జాగ్రత్త వహించండి. కుటుంబంతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఫేక్ సంస్థలకు దూరంగా ఉండండి. అనైతిక కార్యకలాపాలకు పాల్పడకండి.

English summary
A lot of changes are going to happen this month. In particular the 6 planets are changing their position
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X