• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

13 ఏప్రిల్ 2020: ఈ రోజు ఈ రాశివారికి అనుకూలమా, ప్రతికూలమా? జాతకాలు ఏం చెబుతున్నాయి..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషం: ఈ రోజు సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మిత్రులను కలుసుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 Daily Horoscope: How is your day on 13th April 2020? find out in accordance with zodiac sign

వృషభం: ఈ రోజు ఆస్తి వివాదాలు పరిష్కారం కావడంతో లబ్ది పొందుతారు. నూతన మిత్రులు పరిచయంతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కీలక విషయాల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

మిధునం: ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ వత్తిడుల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానానికి విద్యా ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకం: ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు, ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానానికి అవకాశాలు దక్కుతాయి. ఆపదల నుంచి బయటపడతారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహం: ఈ రోజు అనుకోని సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి కీలక విషయాలలో సహాయ సహకారాలు అందుకుంటారు. వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందుతారు. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ఫలితం ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్య: ఈ రోజు మిత్రులతో ఏర్పడిన విభేదాలు, మనస్పర్ధలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. రుణాలు కొంతవరకు తీరుతాయి. శుభవార్తలు వింటారు. భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబంతో గడుపుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

తుల: ఈ రోజు ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు తగదు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధికంగా కలిసివచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. మిత్రుల వల్ల లబ్ది పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృశ్చికం: ఈ రోజు భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు దక్కుతాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు ఉంటాయి. అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనస్సు: ఈ రోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం పొందుతారు. వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .

మకరం: ఈ రోజు బంధువులో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వస్తు లాభం పొందుతారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలిస్తాయి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభం: ఈ రోజు ప్రారంభించిన వ్యవహారాలు, చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

మీనం: ఈ రోజు దూర ప్రాంతాల్లోని మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

English summary
Daily Horoscope: How is your day on 13th April 2020? find out in accordance with zodiac sign
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X