వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరన్నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు ముహూర్తాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శరద్రుతువులో ఆశ్వీయుజమాసం ప్రారంభం మొదలుకొని తొమ్మిది రాత్రులు నవరాత్రలుగా జరిపి, పదవరోజు ఉదయం శమీ పూజతో ఉద్వాసన చేయడం పరిపాటి. వివిధ రోజులలో వివిధ పద్ధతులలో అలంకారాలు నివేదించి అమ్మవారికి వివిధ పద్ధ తులలో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటం పరిపాటి. సమాచారం కొరకు అన్ని వివరాలు ఒకేచోట ముందుగానే అందించడం జరుగుతుంది. నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు అంగ్ల తేది ప్రకారం 17 అక్టోబర్ 2020 దేవి శరన్నవరాత్రారంభం.

Devi Navaratri: What are the nine forms of Goddess Durga and the muhurats
17 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, శనివారం మొదటి రోజున 'బాలా త్రిపుర సుందరీ' అలంకారం.

ముహూర్తం:- కలశస్థాపన శుభ సమయం ఉదయం 7:38 నిమిషాల నుండి 11:29 వరకు, మధ్యాహ్నం 11:29 నుండి 12:16 వరకు.

నైవేద్యం - పులగం

18 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ విదియ, ఆదివారం రెండవ రోజున 'గాయత్రీ దేవి' అలంకారం.
ఉదయం 8:05 - 8:35 , సాయంత్రం 6:18 - 6: 56
నైవేద్యం - పులిహోర

19 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ తదియ, సోమవారం మూడవ రోజున 'మహాలక్ష్మి దేవి' అలంకారం
ఉదయం 9 :05 - 9 :30 , సాయంత్రం 5 :35 - 6:30
నైవేద్యం - వడపప్పు, పానకం

20 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ చవితి, మంగళవారం నాల్గవ రోజున 'అన్నపూర్ణ' అలంకారం.
ఉదయం 7 :02 - 7 :40 , సాయంత్రం 5 :05 - 5 : 32
నైవేద్యం - పరమాన్ణం, బూరెలు

21 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పంచమి, బుధవారం ఐదవ రోజున 'లలితా దేవి' అలంకారం.

ముహూర్తం:- సరస్వతీ ఆవాహనం ఉదయం 6:05 - 7:53 ( మూల 1 వ పాదం )
సరస్వతీ దేవి మూల నక్షత్ర పూజ ఉదయం 7:54 - 8:58
సరస్వతీ దేవి సాయాహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:39 వరకు
నైవేద్యం - పెసర బూరెలు, పరమాన్నం

22 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ షష్టి, గురువారం ఆరవ రోజున 'శాకంబరీ దేవి' అలంకారం.

ముహూర్తం:- త్రిరాత్ర కలశస్థాపన సమయం ఉదయం 6:05 - 7:32
పూర్వాషాడ సాయహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:38
పూర్వాషాడప్రదోష పూజ సాయంత్రం 5:39 - 8:02
నైవేద్యం - శాకాన్నం (కూర అన్నం)

23 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, శుక్రవారం ఏడవ రోజున 'సరస్వతీ దేవి' అలంకారం.
ఉదయం 6 :20 - 7 :05 , సాయంత్రం 5 :39 - 6:20
నైవేద్యం - కదంబం ప్రసాదం.

24 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, శనివారం ఎనిమిదవ రోజున దుర్గాష్టమి 'దుర్గాదేవి' అలంకారం.
ముహూర్తం:- ఉదయం 7;38 - 8:59, మధ్యాహ్నం 11:28 - 12:14 , సాయంత్రం 5:37 - 7:11
నైవేద్యం - నిమ్మకాయ పులిహోర

24 -10 -2020 సరస్వతీదేవి ఉద్వాసన ముహూర్త సమయం ఉదయం 7:38 - 8:59

25 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ నవమి, ఆదివారం తొమ్మిదవ రోజున 'మహిషాసుర మర్దినీ' అలంకారం.
ఉదయం 8:45 - 9:15 , సాయంత్రం 6:12 - 6: 37
నైవేద్యం -చలివిడి, వడపప్పు, పానకం.

అక్టోబర్ 25
విజయదశమి పూజ ప్రారంభ ముహూర్త సమయం ఉదయం 8:40 - 11:57
శమీ పూజ, ఆయుద పూజలు ఉదయం 10:25 - మధ్యాహానం 12:14
అపరాజితా దేవి పూజా సమయం మధ్యాహ్నం 1:00 - 3:18
విజయ దశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:46 - 2:32
విజయ దశమి పర్వదినాన దుర్గాదేవి ఉద్వాసన సాయంత్రం 5:36 - 8:00 లేదా

26 అక్టోబర్ సోమవారం ఉదయం 6:06 - 8:24 లోపు.

English summary
It is customary to perform Navratri for nine nights beginning with the Ashviyujamas in the autumn, and to be discharged on the tenth morning with Shami Puja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X